వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

17వ ఆసియాన్-భార‌త్ వాణిజ్య మంత్రుల స‌మావేశం నిర్వ‌హ‌ణ‌

Posted On: 30 AUG 2020 10:19AM by PIB Hyderabad

 

కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు మరియు రైల్వే శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, వియత్నాం పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రి హెచ్.ఇ. ట్రాన్ తువాన్ అన్హ్ సహ అధ్యక్షులుగా.. ఆగస్టు 29న వ‌ర్చువ‌ల్ విధానంలో 17వ ఆసియాన్-భార‌త్ వాణిజ్య మంత్రుల సంప్రదింపుల కార్య‌క్ర‌మ‌ము జ‌రిగింది. ఈ సమావేశంలో
బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం స‌హా మొత్తం ప‌ది ఆసియాన్ దేశాల వాణిజ్య మంత్రులు పాల్గొన్నారు. మహమ్మారి యొక్క ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడంలో సమిష్టి చర్యలు తీసుకోవడంలో వారి నిబద్ధతను ఆయా దేశాల మంత్రులు పునరుద్ఘాటించారు. బ‌ల‌మైన స్థూల ఆర్థిక గ‌ణాంకాలు, మేటి ఆర్థిక స్థిరత్వం మరియు స్థితిస్థాపకతో కూడిన సరఫరాను నిర్ధారించడంతో పాటు డ‌బ్ల్యూటీవో నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఈ ప్రాంతంలో అవసరమైన వస్తువులు మరియు ఔషధాల ల‌భ్య‌త‌కు ఆటంకం లేకుండా త‌గిన చ‌ర్య‌ల‌తో ముందుకు సాగాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. 'ఆసియాన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్' (ఏఐటీఐజీఏ) సమీక్ష కేంద్రీకృతంగా మంత్రుల చర్చ జ‌రిగింది. మంత్రులు పెరుగుతున్న వాణిజ్య సంబంధాలను మరియు ఇరు ప‌క్షాల ఆర్థిక తోడ్పాటును ప్రశంసించారు. ఈ సంద‌ర్భంగా ఆసియాన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (ఏఐబీసీ) నివేదికను మంత్రుల ముందు ఉంచారు. పరస్పర ప్రయోజనం కోసం ఏఐటీఐజీఏ ను సమీక్షించాలని ఏఐబీసీ నివేదిక సిఫార్సు చేసింది. దీంతో వీలైనంత త్వ‌ర‌గా ఈ స‌మీక్ష చేప‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్చ‌ల‌ను ప్రారంభించాల‌ని ఈ సంద‌ర్భంగా మంత్రులు ఆయా దేశాల సీనియ‌ర్ అధికారులకు సూచించారు. దీనికి తోడుగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మరింత స్నేహ‌పూర్వ‌కంగాను, సరళంగాను మరియు వ్యాపారాలకు సులభతరం చేసేలా విధానాల‌ను రూపొందించాల‌ని వారు సూచించారు. సమీక్ష సమకాలీన వాణిజ్య సౌకర్య పద్ధతుల్ని, క్రమబద్ధీకరించిన విధానాలు మరియు నియంత్రణ విధానాలతో ఒప్పందాన్ని మ‌రింత ఆధునికంగా చేస్తుంది. చర్చను ప్రారంభించిన మంత్రి శ్రీ గోయల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలని మరియు అంద‌రికీ మేలు చేసేలా నిల‌వాల‌ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. రూల్ ఆఫ్ ఆరిజిన్ నిబంధనల్ని బలోపేతం చేయడం, సుంకం అడ్డంకులను తొలగించే దిశగా పనిచేయడం మరియు మంచి మార్కెట్ సదుపాయాన్ని కల్పించాల్సిన అవసరాన్ని శ్రీ గోయల్ ఈ సంద‌ర్భంగా వ్యక్తం చేశారు.  పూర్తి సమీక్షను ప్రారంభించడానికి ముందు, ఏఐటీఐజీఏ యొక్క సమీక్ష చాలా ఆలస్యం అయిందని మరియు స్కోపింగ్ వ్యాయామం ఖరారు చేసే విషయంలో మరింత సన్నిహితంగా పాల్గొనాలని మంత్రి గోయల్ పునరుద్ఘాటించారు. ఏఐటీఐజీఏ సమీక్ష చాలా ఆలస్యం అయ్యిందని కావున‌ దీనిపై కేంద్రీకృత కస‌ర‌త్తులో తుది నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా..  అన్ని దేశాల వారు చాలా ద‌గ్గ‌ర‌గా ప‌ని చేయాల‌ని మంత్రి అన్నారు.  ఈ సంవత్సరం నవంబర్‌లో జరగాల్సిన ఆసియాన్-భార‌త్  నాయకుల సదస్సుకు ముందు గానీ.. ఈ సంవ‌త్సరం ముగింపు నాటికి గానీ ఈ విష‌య‌మై పూర్తి స్థాయి స‌మీక్ష నిర్వ‌హించాల్సిన‌ అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని  గోయ‌ల్ పున‌రుద్ఘాటించారు. భారత్ మరియు ఆసియాన్ దేశాలు సన్నిహిత స్నేహాన్ని పంచుకున్నాయన్నారు. చారిత్రక, సాంస్కృతిక మరియు సాంప్రదాయ బంధాలతో బలంగా ముడిపడి ఉన్నాయని తెలిపారు. భారతదేశం మరియు ఆసియాన్ దేశాల శ్రేయస్సు కోసం ఈ సంబంధం మ‌రింత బ‌ల‌ప‌డుతూనే ఉంటుందని మంత్రి గోయల్ పేర్కొన్నారు. ఏఐబీసీని మరింతగా బలోపేతం చేయడానికి భారతదేశం సూచనలు చేసింది మరియు ఇరు ప‌క్షాల వారి మధ్య ఆర్థిక సంబంధాన్ని మరింతగా పెంచడానికి గాను ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవడానికి ఫోరం అంగీకరించింది.
 

*****


(Release ID: 1649761) Visitor Counter : 284