మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 3 శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన

భూమి పూజలో పాల్గొన్న కేంద్ర విద్యామంత్రి,
పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి

Posted On: 29 AUG 2020 5:16PM by PIB Hyderabad

ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం 12 వ్యవస్థాపక దినోత్సవం రోజు జరిగింది. వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో మూడు శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్నిశాంక్’, కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన చేశారు.

  సందర్భంగా పోఖ్రియాల్ మాట్లాడుతూ, కొన్నేళ్ల వ్యవధిలో ని దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఎదిగిన ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని అభినందించారు. కోవిడ్-19 పై పోరులో భాగంగాభరోసాకార్యక్రమాన్ని పారంభించడంలో ఒడిశా కేంద్రీయ వర్సిటీ కృషిని ప్రశంసించారు. మహమ్మారి కారణంగా తలెత్తిన భయాందోళనలనుంచి చాలా మంది విద్యార్థులు బయటపడేందుకు కార్యక్రమం ఎంతగానో దోహదపడిందన్నారు. ఇంటివద్దనే జరిగే ఓపెన్ బుక్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు ఆయన వర్సిటీని అభినందించారు. ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకోసం భారత్ కు వచ్చిన గత వైభవాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. నూతన విద్యావిధానం ద్వారా అలాంటి స్థాయిని సాధించడానికి ఇదే తగిన తరుణమని అన్నారు. పరిశోధనా, అభివృద్ధి రంగాలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించవలసిందిగా ఆయన విశ్వవిద్యాలయానికి విజ్ఞప్తి చేశారు.

    కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, సమాజ అభ్యున్నతికి దోహదపడే పలు కేంద్ర పథకాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఒడిశాలో ప్రధాన విద్యాసంస్థగా పేరుపొందిన ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంత విద్యాభివృద్ధికోసం సంతృప్తికరమైన కృషి చేస్తోందన్నారు. విద్యాభివృద్ధిలో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు విశ్వవిద్యాలయం కృషి చేయవలసి ఉందన్నారు. జాతీయ పరిశోధనావ్యవహారాల ఫౌండేషన్ కింద మార్గదర్శక కార్యక్రమం, విద్యాసంస్థలు పరిశ్రమల మధ్య అనుసంధానం, గిరిజన వ్యవహారాలు, మానవ ఆవిర్భావం, సంబంధాల అధ్యయనం, స్థానికంగా ఉండే ప్రధాన పరిశ్రమలతో సంప్రదింపుల సేవలు వంటి అంశాలపై అధ్యయనం, పరిశోధన నిర్వహించాలని మంత్రి సూచించారు. హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్..ఎల్), నేషనల్ అల్యూమినయం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) వంటి పరిశ్రమలకు సంప్రదింపుల సేవలను అందించవచ్చని సూచించారు. రాష్ట్రంలోని ఏకైక కేంద్రీయ వర్సిటీ  అయిన  విశ్వవిద్యాలయానికి అన్ని రకాల సహాయం అందిస్తామన్నారు. ఆత్మనిర్భర భారత్ పథకానికి  పథ నిర్దేశకులుగా ఉండాలని ఆయన విద్యార్థులను కోరారు.

   ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ . రామబ్రహ్మం అంతకు ముందు విశ్వవిద్యాలయ పతాకాన్ని ఆవిష్కరించారు. వర్సిటీలోని వివిధ అధ్యయన విభాగాల సభ్యులు, అధికారులు, సిబ్బంది సమక్షంలో వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విశ్వవిద్యాలయం సాధించిన ప్రధాన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను ఆయన ప్రస్తావించారు. కొత్త కోర్సులను ప్రత్యేకించి, విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంపొందించే వైజ్ఞానిక కార్యక్రమాలను, కోర్సులను ప్రారంభించే అంశంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నట్టు చెప్పారు.

    భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల ప్రధాన సలహాదారు డాక్టర్ సంజీవ్ సన్యాల్,.. వ్యవస్థాపక దినోత్సవ ఉపన్యాసం అందించారు. దేశంలో అందుబాటులో ఉన్న సుసంపన్నమైన విద్యావకాశాలను గురించి ఆయన వివరిస్తూ, విద్యార్థులకు జీవితంలో ఆచరణ సాధ్యమైన విద్యను అందించాల్సి ఉందని, అప్పుడే విద్యార్థులు పుస్తక పఠన ప్రపంచంనుంచి బయటపడి, వాస్తవ ప్రపంచం తెలుసుకోగలుగుతారని అన్నారు. మారుతున్న కొత్త ప్రపంచం పోకడలకు అనుగుణంగా విద్యార్థులు తమంతట తాముగా అవగాహన కల్పించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలోని ప్రతి అంశంలోనూ కొత్త పద్ధతులు, అధ్యయన విధానాలకోసం అన్వేషణ జరగాలని, అప్పుడే విద్యార్జన సంపూర్ణమవుతుందని అన్నారు. విషయంలో కొత్త విద్యా విధానం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.

  విశ్వవిద్యాలయం తరఫున ప్రొఫెసర్ శరత్ కుమార్ పాలీట కూడా ప్రసంగించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ అసిత్ కుమార్ దాస్ వందన సమర్పణ చేశారు. వివిధ అధ్యయన విభాగాల సభ్యులు, సిబ్బంది భౌతిక దూరాన్ని పాటిస్తూ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులు, ప్రముఖులు ఆన్ లైన్ ద్వారా వర్చువల్ పద్ధతిలో కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌరవ్ గుప్తా కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు. 12 విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవానికి గుర్తింపుగా 12 మొక్కలను నాటారు.

 

******


(Release ID: 1649575) Visitor Counter : 144