ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ముందెన్నడూ లేనంతగా పెరిగి 4 కోట్లు దాటిన పరీక్షలు
వరుసగా మూడో రోజు కూడా రోజుకు 9 లక్షలు పైబడ్డ పరీక్షలు
Posted On:
29 AUG 2020 12:29PM by PIB Hyderabad
కోవిడ్ మీద పోరులో భాగంగా ఈ ఏడాది జనవరి మొదలుకొని భారత్ జరుపుతున్న పరీక్షలు మరో కీలకమైన మైలురాయి దాటాయి. ఇప్పటివరకు జరిగిన మొత్తం కోవిడ్ పరీక్షల సంఖ్య ఈ రోజు 4 కోట్ల మైలు రాయి దాటింది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యల ఫలితంగా భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రోజు వరకు మొత్తం 4,04,06,609 మంది శాంపిల్స్ పరీక్షించారు. జనవరిలో పూణేలో ఉన్న ఒకే ఒక లాబ్ నుంచి ఇప్పుడు 4 కోట్ల మైలురాయి దాటింది.
ఒక రోజు జరిపే పరీక్షలలో ఈ విధమైన పెరుగుదల నమోదు కావటం వల్లనే ఇది సాధ్యమైంది. రోజుకు10 లక్షల పరీక్షల సామర్థ్యాన్ని కూడా చేరుకున్న స్థితిలో గడిచిన 24 గంటల్లో 9,28,761 పరీక్షలు జరిపింది. దీనివలన ప్రతి పది లక్షల మందిలో పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 29,280 గా నమోదైందిఅన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య బాగా పెరగటం వలన కూడా పాజిటివ్ ల సంఖ్య పెరిగింది. జాతీయ స్థాయిలో పరీక్షలు ఇలా పెరుగుతూ ఉండటం వలన పాజిటివ్ కేసులు కూడా బాగా పడిపోతున్నాయి. ప్రస్తుతం పరీక్షలలో పాజిటివ్ నమోదైన వారి శాతం 8.57% గా నిలిచింది.
పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే వ్యూహం అమలు చేయటం వలన తగిన విధంగా చికిత్స అందించటం సాధ్యమవుతోంది. పరీక్షలు దూకుడుగా నిర్వహించటం వల్లనే పాజిటివ్ కెసులను తొలిదశలోనే నిర్వహించటానికి వీలవుతోంది. దీనివల్లనే వ్యాధి సోకే అవకాశం ఉన్నవాళ్ళను గుర్తించి స్వల్ప లక్షణాలున్నవారిమి ఐసొలేషన్ లో ఉంచటం, తీవ్ర లక్షణాలౌన్నవారిని ఆస్పత్రికి తరలించటం, తగిన చికిత్స అందించటం సాధ్యమైంది.
పరీక్షల విషయంలో అనుసరించిన కీలకమైన వ్యూహం లాబ్ ల నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తృతం చేయటం. దీంతో ప్రస్తుతం లాబ్ ల సంఖ్య 1576 కి చేరింది. ఇందులో ప్రభుత్వ రంగంలో 1002 లాబ్ లు ఉండగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో 574 ఉన్నాయి.
రకరకాల లాబ్ ల వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ : 806 (ప్రభుత్వ: 462 + ప్రైవేట్: 344)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 650 (ప్రభుత్వ: 506+ ప్రైవేట్: 144)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 120 (ప్రభుత్వ: 34 + ప్రైవేట్ 86 )
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
***
(Release ID: 1649527)
Visitor Counter : 240
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam