ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి జన్-ధన్ యోజన (పిఎంజెడివై) - ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం ప్రారంభించిన జాతీయ స్థాయి కార్యక్రమం అమలు ఆరు సంవత్సరాలు పూర్తి
శ్రీ మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం లక్ష్యంగా చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలకు పునాది రాయి - ఆర్థికమంత్రి
ప్రారంభం నుంచి 40.35 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు బ్యాంకింగ్ సదుపాయం. రూ.1.31 లక్షల కోట్ల డిపాజిట్లు;
63.6% గ్రామీణ పిఎంజెడివై ఖాతాలు; 55.2% మహిళా జెడివై ఖాతాలు
పిఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద ఏప్రిల్-జూన్ 2020 నెలల మధ్య కాలంలో మహిళా పిఎంజెడివై ఖాతాదారుల ఖాతాల్లో రూ.30,705 కోట్లు జమ
వివిధ పథకాల కింద ప్రభుత్వం అందించే సహాయంగా 8 కోట్ల పిఎంజెడివై ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి)
Posted On:
28 AUG 2020 7:27AM by PIB Hyderabad
ఇంతవరకు సమాజంలో నిరాదరణకు, సామాజికంగా-ఆర్థికంగా నిరాకరణకు గురవుతున్న వర్గాలకు మద్దతు ఇచ్చి ఆర్థిక కార్యకలాపాల్లో అందరినీ భాగస్వాములను చేయడానికి ఆర్థికమంత్రిత్వ శాఖ కట్టుబడింది. సమ్మిళిత వృద్ధికి దోహదపడే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ (ఆర్థిక కార్యకలాపాల్లో అందరి భాగస్వామ్యం) ప్రభుత్వ జాతీయ ప్రాధాన్యత. వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలోకి పేద వర్గాల పొదుపు పెట్టుబడులు తేవడం ద్వారా వారికి ఆదాయ వనరు అందుబాటులోకి తేవడం అత్యంత ప్రధానం. అవసరం ఏర్పడినప్పుడు తమ ఖాతాల్లో నుంచి సొమ్ము ఉపసంహరించుకునే ఆదాయవనరు అందుబాటులో ఉంచడం వల్ల ఆ కుటుంబాలు అవాంఛనీయ వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకోకుండా ఉంటారు. ఈ హామీ నెరవేర్చే దిశగా చేపట్టిన ప్రధాన కార్యక్రమమే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ప్రపంచంలోని అతి పెద్ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమాల్లో ఇదొకటి.
2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పిఎంజెడివైని ప్రకటించారు. అదే నెల 28వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ విషవలయం నుంచి పేదలు విముక్తులవుతున్న పర్వదినంగా దీన్ని నిర్వహించుకోవాలని ప్రధానమంత్రి అన్నారు.
పిఎంజెడివై 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆ పథకం ప్రాధాన్యతను పునరుద్ఘాటిస్తూ “శ్రీ మోదీ ప్రభుత్వం ప్రజాసంక్షేమ లక్ష్యంతో చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలకు పునాది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన” అన్నారు. “ప్రత్యక్ష నగదు బదిలీ కావచ్చు, కోవిడ్-19 ఆర్థిక సహాయం, పిఎం-కిసాన్, ఎంజిఎన్ఆర్ఇజిఏ వేతనాల పెంపు, జీవిత/ ఆరోగ్యబీమా కవరేజి కల్పన, యువజనుల్లో ప్రతీ ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు అందించడంలో తొలి అడుగు వంటి పిఎంజెడివై నిర్దేశిత లక్ష్యాలన్నీ ఇంచుమించుగా పూర్తయ్యాయి” అని ఆమె చెప్పారు.
ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ కూడా ఈ సందర్భంగా పిఎంజెడిడైపై తన ఆలోచనలు పంచుకున్నారు. “ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో పిఎంజెడివై బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేని వారిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చింది. భారత ఆర్థిక నిర్మాణాన్ని విస్తరించింది. 40 కోట్ల మందికి పైగా ఖాతాదారులకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కల్పించింది. ఈ పథకం లబ్ధిదారుల్లో అధిక సంఖ్యలో మహిళలే ఉన్నారు. గ్రామీణ ఖాతాలే ఇందులో అత్యధికం” అని ఆయన చెప్పారు. “నేటి కోవిడ్-19 కల్లోలిత సమయంలో సమాజంలో సరైన రక్షణ లోపించిన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం, సాధికారత సాధన డిబిటి ద్వారా ఎంత వేగంగా, నిరంతరాయంగా సాధించామో మనం కళ్లారా చూశాం. పిఎం జన్ ధన్ ఖాతాల ద్వారా నిర్వహించిన డిబిటి ప్రభుత్వం అందించిన ప్రతీ ఒక్క రూపాయి లబ్ధిదారులకు నేరుగా చేరడానికి భరోసాగా నిలిచింది. వ్యవస్థాత్మకమైన లీకేజిలకు అడ్డుకట్ట వేసింది” అన్నారు.
ఈ పథకం విజయవంతంగా అమలుజరిగి 6 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటివరకు ఈ స్కీమ్ సాధించిన విజయాలు, ప్రధానాంశాలు ఒక సారి మననం చేసుకుందాం.
పూర్వాపరాలు
ప్రజలందరికీ భరించగల స్థాయిలో ఆర్థిక సర్వీసులు ప్రత్యేకించి బ్యాంకింగ్/ సేవింగ్స్, డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, నగదు జమలు, రుణం, బీమా, పెన్షన్ సేవలు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా చేపట్టిన జాతీయ స్థాయి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పిఎంజెడివై).
1. లక్ష్యాలు
- భరించగల వ్యయాల్లో ఆర్థిక ఉత్పత్తులు సేవలు అందరికీ అందుబాటులో ఉంచడం
- వ్యయాలు తగ్గించి, విస్తృతిని పెంచడం కోసం టెక్నాలజీ వినియోగం
2. ఈ స్కీమ్ ప్రధానాంశాలు
- ఇంతవరకు బ్యాంకు సేవలు అందుబాటులో లేని వారికి బ్యాంకింగ్ - పేపర్లపై రాతకోతలు అత్యంత కనిష్ఠ స్థాయిలో ఉంచుతూ, కెవైసి, ఇ-కెవైసి నిబంధనల సడలింపు, జీరో నిల్వ, జీరో చార్జీలతో ప్రత్యేక శిబిరాల ద్వారా బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం
- భద్రత లేని వారికి భద్రత - నగదు విత్ డ్రాయల్, వ్యాపారుల వద్ద చెల్లింపుల సదుపాయంతో పాటు రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమాతో కూడిన దేశీయ డెబిట్ కార్డుల జారీ
- నిధులు లేని వారికి నిధుల