హోం మంత్రిత్వ శాఖ

28న పోలీస్ రీసెర్చ్ బ్యూరో స్వర్ణోత్సవాలు

Posted On: 27 AUG 2020 4:56PM by PIB Hyderabad

బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సంస్థ రేపు అగస్టు 28న స్వర్ణోత్సవాలు జరుపుకుంటోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటుండగా, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా గౌరవ అతిథిగా హాజరవుతున్నారు. కరోనా సంక్షోభం కారణంగా ఈ వేడుకలను వర్చువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్  కేంద్ర కార్యాలయంతోబాటి అనుబంధ యూనిట్లు రాష్ట్ర పోలీస్ కార్యాలయాలు, సి ఎ పి ఎఫ్ లు వీడియో లింక్ ద్వారా తిలకిస్తాయి.

కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ చేసిన తీర్మానం ద్వారా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ 1970 ఆగస్టు 28న ఏర్పాటైంది. పోలీసింగ్ లో ప్రతిభను పెంచటం, పోలీస్ సమస్యలను ఒక పద్ధతి ప్రకారం వేగంగా అధ్యయనం చేయటం, పోలీసుల మెలకువలలో శాస్త్ర సాంకేతిక అంశాల వినియోగం దీని ప్రధానలక్ష్యాలు. ప్రారంభంలో ఇందులో రెండు యూనిట్లు ఉండేవి. పరిశోధన, ప్రచురణ, గణాంకాల డివిజన్ ఒకటి కాగా అభివృద్ధి డివిజన్ మరొకటి. పోలీస్ శిక్షణ మీద గోరే కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 1973లో వీటికి శిక్షణ విభాగం తోడైంది. జైళ్ళు, జైళ్ళ సంస్కరణలను అధ్యయనం చేయటానికి 1995లో దిద్దుబాటు విభాగం కూడా చేరింది. 2008 లో జాతీయ పోలీస్ మిషన్ ను కూడా ఇందులో చేర్చారు. అభివృద్ధి డివిజన్ పునర్నిర్మించి ఆధునీకరణ డివిజన్ గా పేరు మార్చారు. 


ఇన్నేళ్ళుగా బిపిఆర్ అండ్ డి  సంస్థ ఎన్నో బాధ్యతలు పెంచుకుంటూ అదనపు విభాగాలను చేర్చుకుంటూ ప్రస్తుత స్థితికి చేరింది. ఇప్పుడు భోపాల్ లో పోలీస్ ట్రైనింగ్ కోసం  సెంట్రల్ అకాడెమీ ప్రారంభిస్తూదాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దటంతోబాటు  బిపిఆర్ అండ్ డి కింద మొత్తం 6  విభాగాలు పని చేసేలా ఎదిగింది.
భారత పోలీసు వ్యవస్థకు ఈ సంస్థ చేసిన సేవలను సంక్షిప్తంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ఈ సంస్థ 49వ వ్యవస్థాపక దినోత్సవం ముగించుకొని 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఇలా అభివర్ణించారు. " బిపిఆర్ అండ్ డి  కే బగైర్ అచ్ఛీ పోలీసింగ్ కీ కల్పనా నహీ హో సక్తీ "( బిపిఆర్ అండ్ డి   లేకుందా మెరుగైన పోలీసింగ్ ను ఊహించుకోలేం" అని. 


 గడిచిన ఐదు దశాబ్దాలకాలంలో బిపిఆర్ అండ్ డి  ప్రయాణం అద్భుతంగా సాగింది. భారత పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దటంలో అది ప్రధాన పాత్ర పోషించింది. శిక్షణలు, సామర్థ్య నిర్మాణం కోసం పరిశోధనలు, నేషనల్ మిషన్ ప్రాజెక్టులు చేపట్టింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, సవాళ్ళకు దీటుగా ఆధునీకరణ చర్యలు చేపడుతూ పోలీసు అధికారుల శక్తి సామర్థ్యాలను పెంచుతూ ఇప్పటివరకు 55,000  మందికి పైగా సుశిక్షితులను చేసింది.

***



(Release ID: 1649010) Visitor Counter : 195