పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
చమురు మరియు సహజవాయువు పరిశ్రమల రంగంలో 5. 88 లక్షల కోట్ల వ్యయ అంచనాలతో 8, 363 ప్రాజెక్టుల ప్రారంభం.
ఈ ఏడాది ఏప్రిల్ 20నుంచి తిరిగి ప్రారంభమైన ప్రాజెక్టుల పనులు.
ఈ ప్రాజెక్టుల ద్వారా కేంద్ర ప్రభుత్వం 33.8 కోట్ల పని దినాలను కల్పిస్తోంది.
సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్న పెట్రోలియం పరిశ్రమల రంగం. భారీ స్థాయిలో పని చేస్తూ దేశంలో ఉద్యోగ కల్పనకు, ఆర్ధిక రంగ వృద్ధికి దోహదం.
Posted On:
25 AUG 2020 6:20PM by PIB Hyderabad
కరోనా మహమ్మారి కట్టడికి సంబంధించిన అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తూనే చమురు మరియు సహజవాయువుల పరిశ్రమల రంగంలో రూ. 5. 88 లక్షల కోట్ల వ్యయ అంచనాలతో 8, 363 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల పనులన్నీ ఈ ఏడాది ఏప్రిల్ 20నుంచి తిరిగి ప్రారంభమయి ప్రగతి పథంలో కొనసాగుతున్నాయి. .
చమురు మరియు సహజవాయువు పరిశ్రమలకు చెందిన అన్ని రకాల ప్రాజెక్టులు ఇందులో వున్నాయి. వీటిలో ప్రధానమైన ప్రాజెక్టులు 25. వీటి వ్యయ అంచనా రూ. 1, 67, 248 కోట్లు. వీటిని చేపట్టడంద్వారా 76,56,825 పనిదినాలను కల్పలించడం జరిగింది.
కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్ర ప్రెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రిత్వశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో సమగ్రమైన సమీక్షలు జరుగుతున్నాయి. తాజా సమీక్ష ఈ నెల 24న నిర్వహించారు. కేంద్ర మంత్రి దార్శనికత కారణంగా దేశంలో పెట్రోలియం పరిశ్రమ సంక్షోభాన్నించి బైటపడి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికిగాను, వృద్ధిని సాధించడానికిగాను భారీ ఎత్తున కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ పని చేస్తోంది. దేశ ఆర్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికిగాను దేశంలోని చమురు సహజవాయువు సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఉద్యోగాల కల్పన, వస్తు రవాణాలో ముఖ్య భూమిక పోషిస్తూ దేశ ఆర్ధిక రంగానికి మద్దతుగా నిలిచాయి.
ఈ 8363 ప్రాజెక్టులను పూర్తి చేసే లోపు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 33.8 కోట్ల పని దినాల కల్పన జరుగుతుంది. ఇందులో ఉద్యోగాల కల్పనకు సంబంధించి 9.76 కోట్ల పని దినాలను 2020-21 ఆర్ధిక సంవత్సరంలో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో (15-08-2020 నాటికి) ఈ చమురు , సహజవాయువు ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన మూలధన వ్యయంద్వారా 2.2 కోట్లకు పైగా పని దినాలు కల్పించడం జరిగింది.
2020-21 ఆర్ధిక సంవత్సరంలో చమురు, సహజవాయువు కంపెనీలు ఉద్యోగ కల్పన దృష్టితో నిర్వహించే తమ నిర్వహణా కార్యక్రమాలకోసం (ఓపెక్స్ ..ఆపరేటింగ్ ఎక్స్ పెన్సెస్) రూ. 41, 672 కోట్లు వ్యయం చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ఇందులో రూ. 11, 296 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. ఈ రూ. 41, 672 కోట్ల ఓపెక్స్ ద్వారా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 14. 5 కోట్ల ఉపాధి పనిదినాల కల్పన జరుగుతుంది. ఇంతవరకూ 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ( 15-08-2020 నాటికి) ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 4.4 కోట్ల పని దినాలను ఓపెక్స్ ద్వారా కల్పించడం జరిగింది.
2020-21 ఆర్ధిక సంవత్సరంలో మూలధన వ్యయానికి ( క్యాపిటల్ ఎక్స్ పెండిచర్..మూలధన వ్యయం), ఉద్యోగ కల్పనకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణకు (ఓపెక్స్) రూ. 1.62 లక్షల కోట్లను ఖర్చు చేయాలని చమురు, సహజవాయువు కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 24 కోట్ల పని దినాల కల్పనకు అవకాశముంది. ఇంత పెద్ద మొత్తంలో చేస్తున్న వ్యయం కారణంగా ఆయా పరిశ్రమల్లో పెట్టుబడులు పెరుగుతాయి. తద్వారా దేశ ఆర్ధిక రంగం పునరుజ్జీవం పొందుతుంది. దేశ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
****
(Release ID: 1648901)
Visitor Counter : 191