నీతి ఆయోగ్
ఎగుమతి సన్నద్థత సూచీ(ఇపిఐ) - 2020 పై నివేదికను విడుదల చేసిన నీతి ఆయోగ్ (ఇపిఐ)
Posted On:
26 AUG 2020 1:53PM by PIB Hyderabad
నీతి ఆయోగ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంపిటిటివ్ నెస్ భాగస్వామ్యంతో ఎగుమతుల సన్నద్ధతా సూచీ- 2020 (ఇపిఐ)ని ఈరోజు విడుదల చేసింది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఎగుమతుల సన్నద్ధత, వాటి పనితీరును పరిశీలించే తొలి నివేదిక ఇది. ఇపిఐ ఈ రంగంలోని సవాళ్లు, అవకాశాలు, ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని పెంచడం, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్కును ప్రోత్సహించడానికి దీనిని ఉద్దేశించారు.
ఇపిఐ నిర్మాణంలోని నాలుగు స్థంభాలు - పాలసీ, వ్యాపారవాతావరణం, ఎగుమతుల వాతావరణం, ఎగుమతుల పనితీరు కాగా. 11 ఉప స్థంభాలు- ఎగుమతుల ప్రోత్సాహక విధానం, సంస్థాగత ఫ్రేమ్‌వర్కు, వ్యాపార వాతావరణం, మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానత, ఫైనాన్సు అందుబాటు, ఎగుమతుల మౌలిక సదుపాయాలు, వాణిజ్య మద్దతు, పరిశోధన అభివృద్ధి మౌలిక సదుపాయాలు, ఎగుమతుల వైవిద్యీకరణ, ఎగుమతుల దృష్టి .
“ అంతర్జాతీయ వేదికపై, బలమైన ఎగుమతిదారు కావడానికి భారతీయ ఆర్థిక వ్యవస్థకు అద్భుతమైన శక్తిసామర్ధ్యాలు ఉన్నాయి. అందువల్ల , రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను దేశ ఎగుమతుల కృషిలో క్రియాశీలకపాత్ర వహించేట్టు ఇండియా చూడాలి. ఈ దార్శనికతను సాకారం చేసే ప్రయత్నంగా ఎగుమతుల సన్నద్ధత సూచి- 2020, ఆయా రాష్ట్రాల సామర్ధ్యాలు, శక్తిని అంచనా వేస్తుంది. ఈ ఇండెక్స్‌నుంచి లభించే వివరాణాత్మక సమాచారం ఆధారంగా, దీనితో సంబంధం ఉన్న అన్ని పక్షాలూ ఎగుమతుల వాతావరణాన్ని జాతీయ స్థాయిలో, ఉప జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.” అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, డాక్టర్ రాజీవ్ కుమార్ అన్నారు.
నీతి ఆయోగ్ ఛీఫ్ ఎక్జిక్యూటివ్ అధికారి అమితాబ్ కాంత్ మాట్లాడుతూ, “ ఎగుమతుల సన్నద్ధతా సూచీ అనేది డాటా ఆధారంగా ఎగుమతుల ప్రోత్సాహకానికి సంబంధించిన కీలక అంశాలను ఉప జాతీయ స్థాయిలో గుర్తించడానికి సంబంధించినది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విషయంలో , ఎగుమతులకు సంబంధించి, సుస్థిరాభివృద్ధి సాధనకు కీలకమైన అన్ని ఆర్థిక ప్రమాణాలు, ఆర్ధిక యూనిట్లనుఇది పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఈ సూచీ, ప్రాంతీయంగా పనితీరుపై ఆయా రాష్ట్రప్రభుత్వాలకు ఒక మార్గనిర్దేశకంగా సహాయపడనుంది. ఫలితంగా ఎగుమతులు పెంచుకోవడానికి ఎలాంటి విధానాలు అనుసరించాలి, ఎలా మెరుగుపరచుకోవాలన్నది తెలుస్తుంది.”
ఈ ఎడిషన్ ఇపిఐని గమనించినపుడు, దేశంలోని చాలావరకు రాష్ట్రాలు ఉపస్థంభాలైన ఎగుమతుల వైవిధ్యం, రవాణా అనుసంధానత, మౌలిక సదుపాయాల వంటి వాటిలో సగటున మంచి పనితీరునే కనబరిచాయి. ఈ మూడు ఉప అంశాలలో భారతీయ రాష్ట్రాలు 50 శాతం పైగా సగటు స్కోరు సాధించాయి. అలాగే ఎగుమతుల వైవిద్యీకరణ, రవాణా అనుసంధానత, లో తక్కువ ప్రామాణిక మార్పు గమనించినపుడు కొద్ది రాష్ట్రాలు మాత్రమే ఓవర్ అచీవర్లుగా ఉన్నాయి. అయితే భారతీయ రాష్ట్రాలు ఎగుమతుల పోటీని తట్టుకుని పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ఇతర కీలక అంశాలపై దృష్టిపెట్టవలసి ఉంది.
మొత్తం మీద, చాలావరకు కోస్తా రాష్ట్రాలు మంచి పనితీరు కనబరిచాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులు ఉన్నతస్థాయి మూడు ర్యాంకులు సాధించాయి. ఎనిమిది కోస్తా రాష్ట్రాలలోని ఆరు కోస్తా రాష్ట్రాలు, పది అత్యున్నత ర్యాంకులలో ఉన్నాయి. దీనితో ఇక్కడ ఎగుమతులు ప్రోత్సహించడానికి బలమైన అవకాశాలు ఉ న్నాయని వెల్లడి అవుతున్నది. చుట్టూ భూభాగమే ఉన్న రాష్ట్రాలలో రాజస్థాన్ మెరుగైన ఫలితాలు సాధించింది. దాని తర్వాత తెలంగాణ, హర్యానాలు మంచి పనితీరు కనబరిచాయి. హిమాలయన్ రాష్ట్రాలలో ఉత్తరాఖండ్ అగ్ర భాగాన ఉంది. దాని తర్వాత త్రిపుర, హిమాచల్ ప్రదేశ్‌లు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతలలో ఢిల్లీ మంచి పనితీరు కనబరిచింది. ఆ తర్వాత స్థానంలో గోవా, చండీఘడ్‌లు ఉన్నాయి.
.
ఈ నివేదికను గమనించి చూసినపుడు , ఎగుమతుల ధోరణి, సన్నద్ధత అనేవి కేవలం సంపన్న రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదని తేలుతోంది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కూడా క్రియాశీల ఎగుమతుల విధానాలను చేపట్టవచ్చు. ప్రోత్సాహక మండళ్ళను ఏర్పాటు చేసుకోవచ్చు. తమ ఎగుమతులు పెంచుకోవడానికి జాతీయ స్థాయి లాజిస్టిక్ ప్రణాళికలతో అనుసంధానం కావచ్చు. చత్తీస్ ఘడ్, జార్ఖండ్ ఇవి రెండూ చుట్టూ భూతలమే ఉన్న రాష్ట్రాలు. ఇవి ఎగుమతులను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకున్నాయి. ఇలాంటి సామాజిక ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్ చేపట్టిన చర్యలను పరిశీలించి, తమ ఎగుమతులు పెంచుకునేందుకు వీటిని అనుసరించవచ్చు.
ఎగుమతుల ఆసక్తి తో, ఉన్న అనేక ఈశాన్య రాష్ట్రాలు తమస్థానిక ఉత్పత్తులపై దృష్టి పెట్టడం ద్వారా ఎక్కువ ఎగుమతుల చేయగలిగాయి. ఇటువంటి వాటిపై (సుగంధ ద్రవ్యాలు వంటివి) దృష్టిపెట్టడం వల్ల ఒకవైపు ఎగుమతులను పెంచడమే కాకుండా మరోవైపు ఈ రాష్ట్రాల్లో రైతు ఆదాయాన్ని ఇది మెరుగుపరుస్తుందని సూచిస్తోంది.
ఈ నివేదిక వెల్లడించిన అంశాల ప్రకారం, దేశంలో ఎగుమతుల ప్రోత్సాహం అనేది ప్రధానంగా మూడు సవాళ్లను ఎదుర్కొంటున్నది. అవి ఎగుమతుల మౌలిక సదుపాయాలలో అంతర్గతంగా, వివిధ ప్రాంతాల మధ్య అంతరాలు, రాష్ట్రాలలో సరైన వాణిజ్య మద్దతు ,ప్రగతి దృష్టి లేకపోవడం, సంక్లిష్ట మైన, ప్రత్యేక ఎగుమతులకు సంబంధించిన పరిశోధన అభివృద్ధి సరిగా లేకపోవడం వంటివి.
ఈ కీలక సవాళ్లను ఎదుర్కొనడానికి కీలక వ్యూహాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. సంయుక్తంగా ఎగుమతుల మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమ- అకడమిక్ వ్యవస్థల మధ్య అనుసంధానత, ఆర్థిక దౌత్యానికి రాష్ట్రస్థాయి ఏర్పాట్లు వంటివి అవసరం. ఈ వ్యూహాలను తగిన విధంగా, మార్పుచేసిన ప్రణాళికలు, స్థానిక ఉత్పత్తులకు ప్రమాణాలు మెరుగుపరచడం, వినూత్న విధానలను అనుసరించడం,ఇలాంటి ఉత్పత్తులకు సరికొత్త ఉపయోగాలపై దృష్టిపెట్టడం, కేంద్రం నుంచి తగినంత మద్దతు వంటి వాటి ద్వారా చేపట్టవచ్చు.
ఆత్మనిర్భర్ భారత్‌పై ప్రధాన దృష్టితో ఇండియాను ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు , అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రాలు ఎగుమతుల లక్ష్యాన్ని పెంచేందుకు అవసరమైన అద్భుత సమాచారాన్ని ఇపిఐ అందిస్తుంది.
ఇపిఐ తుది ఫ్రేమ్ వర్క్ రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు , ఎక్సిమ్ బ్యాంక్, ఐఐఎఫ్టి, డిజిసిఐఎస్ వంటి వాటి ప్రతిస్పందన ఆధారంగా రూపొందించబడినది. ఈ డాటా ప్రాథమికంగా రాష్ట్రప్రభుత్వాలు సమర్పించినదే. కొన్ని సూచికలకు సంబంధించి ఆర్.బి.ఐ, డిజిసిఐఎస్, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలను సంప్రదించడం జరిగింది.
ఫ్రేమ్ వర్క్:
నాలుగు పిల్లర్లు, అందులొ ఒక్కొక్కదాని ఎంపికకు సంబంధించిన హేతుబద్ధత కింద ఇవ్వడం జరిగింది.
పాలసీ: సమగ్ర వాణఙజ్య విధానం ఎగుమతులు, దిగుమతులకు వ్యూహాత్మక దిశను చూపుతుంది.
వ్యాపార వాతావరణం: సమర్ధమైన వ్యాపార పరిస్థితులు రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడానికి పనికివస్తుంది. ఇది మౌలిక సదుపాయాలకు, వ్యక్తులు స్టార్టప్‌లు ప్రారంభించడానికి వీలుకలిగిస్తుంది.
ఎగుమతుల వాతావరణం: ఇది వ్యాపార వాతావరణాన్ని, ఎగుమతుల ప్రత్యేక దృష్టి కోణం లోంచి అంచనావేస్తుంది.
ఎగుమతుల పనితీరు: ఇది పనితీరు ఆధారిత అంశం. ఇది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఎగుమతుల పరిధిని పరిశీలిస్తుంది.
ఈ నివేదిక కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.:
https://niti.gov.in/sites/default/files/2020-08/Digital_ExportPreparednessIndex2020_0.pdf
ఈ నివేదిక ఆవిష్కరణ ఈవెంట్ కు సంబంధించిన లింక్:
https://www.youtube.com/watch?v=pQlW73yV4lY
*****
(Release ID: 1648779)
Visitor Counter : 350
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada