ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్ర లోని రాయ్ గఢ్ లో భవనం కూలిపోయిన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు బాధ ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 AUG 2020 10:28AM by PIB Hyderabad
మహారాష్ట్ర లోని రాయ్ గఢ్ లో భవనం పడిపోయి ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాధ ను వ్యక్తం చేశారు.
‘‘మహారాష్ట్ర లోని రాయ్ గఢ్ లో గల మహాడ్ లో భవనం పడిపోయిన సంగతి తెలిసి ఖిన్నుడినయ్యాను. ఈ ఘటన లో ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల శోకం లో నేను కూడా పాలుపంచుకొంటున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఎన్ డిఆర్ఎఫ్ జట్లు, ఇంకా స్థానిక అధికారిగణం విషాదభరిత ఘటన స్థలం వద్ద ఉండి, సాధ్యమైన సహాయాన్నంతా అందిస్తున్నారు’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1648440)
సందర్శకుల సూచీ సంఖ్య : : 241
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam