పర్యటక మంత్రిత్వ శాఖ

దేఖో అప్నా దేశ్ సిరీస్ లో భాగంగా పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో

హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం పై 50వ వెబినార్

Posted On: 24 AUG 2020 6:16PM by PIB Hyderabad

పర్యాటక మంత్రిత్వశాఖ వారి దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్  ఇప్పుడు చరిత్రాత్మక మైలురాయి చేరుకుంటూ హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వంపేరిట ఆగస్టు22 న 50వ సెషన్ వెబినార్ నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్ 14న ఈ సిరీస్ మొదలైంది. భారతదేశంలో పర్యాటక ప్రదేశాల గురించి అవగాహన కలిగించటంతోబాటు వాటికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రజలకు అంతగా తెలియని గొప్పదనాన్ని, తక్కువగా తెలిసిన కోణాలను ఆవిష్కరించటం దీని ప్రత్యేకత. ఏక్ భారత్ - శ్ర్తేష్ఠ్ భారత్ స్ఫూర్తిని కూడా ఇది ప్రచారం చేస్తుంది.

సాంస్కృతిక వారసత్వ విద్యా కన్సల్టెంట్ అయిన శ్రీమతి మధు వొట్టేరి " హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం " అనే వెబినార్ ను సమర్పించారు. ఆమె రచయిత్రి, భవన పరిరక్షక వాస్తు శిల్పి కూడా. తెలంగాణ కు భిన్నంగా హైదరాబాద్ లో నెలకొన్న నిజాం పాలనాకాలంనాటి ఇస్లామిక్ ప్రభావిత సంస్కృతిని ఈ వెబినార్ లో ప్రత్యేకంగా ప్రదర్శించి చూపారు. ఇది హైదరాబాద్ మీద, మరీ ముఖ్యంగా పాత నగరపు శిల్పకళారీతి మీద, ఆహారం, జీవనశైలి, భాష స్పష్టమైన ముద్ర వేసింది. కొత్త నగరం భిన్న సంస్కృతులకు ఆలవాలంగా మారిన తీరు కూడా ఆమె వివరించారు. హైదరాబాద్ లో సుసంపన్నమైన సాహిత్యం, కళలు ఉండటాన్ని రుజువు చేస్తూ అనేక మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ఎగ్జిబిషన్లు ఉన్నాయన్నారు.

హైదరాబాద్ నగరం ముత్యాల నగరం గాను, నిజాంల నగరంగాను పేరుపొందటానికి కారణాలను శ్రీమతి వొట్టేరీ వివరించారు.  కుతుబ్ షాహీ సామ్రాజ్యం ప్రారంభమైన నాటి నుంచీ శక్తిమంతమైన చరిత్రాత్మక సంప్రదాయానికి  కేంద్రంగా విలసిల్లిన తీరును కూడా తెలియజెప్పారు.  నగరాన్ని ఆ తరువాత మొఘల్ సామ్రాజ్యధిపతులు ఆక్రమించుకోవటంతో చివరిగా అసఫ్ జాహీ వంశీయుల పరమైంది. గత రాజరిక వైభవం ఈనాటికీ హైదరాబాద్ సంస్కృతి, ఆహారం, పేరెన్నికగన్న చార్మినార్, గోల్కొండ కోత రూపంలో ఆనవాళ్ళుగా నిలిచాయని ఆమె వివరించారు.

హైదరాబాద్ చరిత్ర మొత్తాన్నీ ఆమె ఈ వెబినార్ లో పాల్గొన్నవాళ్ళ కళ్లకు కట్టారు. 1591 లో కులీ కుతుబ్ షా ఈ నగరాన్ని స్థాపించి గోల్కొండ ఆవలిదాకా విస్తరించటం గురించి, ఆ తరువాత 1687లో మొఘలాయిల ఆక్రమణ, మొఘల్ గవర్నర్  ఒకటో నిజాం అసఫ్ జాహి సార్వభౌమాధికారం ప్రకటించుకొని అసఫ్ జాహీ సామ్రాజ్యాన్ని స్థాపించటం గురించి వివరించారు. అదే నిజాం పాలనగా గుర్తింపు పొందిందన్నారు. 1769 నుంచి1948 దాకా హైదరాబాద్ వారి రాజధానిగా వెలుగొందిన తీరు వర్ణించారు. భారత స్వాతంత్ర్యం వచ్చేదాకా ఒక సంస్థానంగా ఇక్కడ బ్రిటిష్ రెసిడెన్సీ, కంటోన్మెంట్ ఉన్నాయని కూడా గుర్తు చేశారు.

కుతుబ్ షాహీ, నిజాం పాలననాటి ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడతాయని, చార్మినార్ ఈ నగరానికి గుర్తుగా నిలిచిందని అన్నారు. ఆధునిక యుగం తొలినాళ్లలో దక్కన్ లో మొఘల్ పాలన క్షీణించి నిజాం పాలన ప్రపంచంలోని అనేక ప్రాంతాల నోళలో నానుతూ వచ్చిందని చెప్పారు. స్థానిక, వలస వచ్చిన హస్తకళాకారుల వలన ఒక విశిష్టమైన సంసృతి విరాజిల్లిందని,  ఆ విధంగా ఈ నగరం ప్రాచీన సంస్కృతికి నిలయంగా మారింది. చిత్రకళ, హస్త కళలు, ఆభరణాలు, సాహిత్యం, దుస్తులు ఈనాటికీ ప్రముఖంగా నిలిచాయి. ఆహారం పరంగా హైదరాబాద్ నగరాన్ని యునెస్కో సృజనాత్మక నగరంగా గుర్తించింది.

ఈ సెషన్ లో ఈ దిగువ పేర్కొన్న సాంస్కృతిక ప్రదేశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు:  


1) హైదరాబాద్ లో గోల్కొండ కోట - ఈ భారీ కోట శిథిలాలు నేటికీ గర్వంగా ఆ నాటి వైభవాన్ని చాటుతూ నగర చరిత్ర చాటి చెప్పని గాథలను చెబుతాయి. హైదరాబాద్ లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశమిది. మహమ్మద్ ఖులీ కొత్త నగరపు అవసరాన్ని గుర్తించి చార్మినార్ కేంద్రంగా భాగ్యనగరం ( తన ప్రియురాలి పేరిట ) నిర్మించాడు.

2) చౌమహల్లా పాలెస్: ఒకప్పుడు అసఫ్ జాహీ వంశీయుల కేంద్రస్థానమిది. చౌమహల్లా పాలెస్ ను చార్మినార్, లాడ్ బజార్ సమీపంలో నిర్మించారు. చాలా సంక్లిష్ట నిర్మాణం ఉన్న ఈ పాలెస్ లో నవాబుల దర్పం ఉట్టిపడుతుంది. నిజాముల అధికార పీఠమైన చౌ మహల్లా పాలెస్ సామ్స్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు పొంది యుమెస్కో ఆసియా పసిఫిక్ హెరిటేజ్ మెరిట్ అవార్డు గెలుచుకుంది.

3) చార్మినార్- కులీ కుతుబ్ షా తన రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్ కు మార్చినప్పుడు ఈ నిర్మాణం చేపట్టారు.  నాలుగు మినార్ లు ఉండటం వలన దీనికి చార్ మినార్ అనే పేరు వచ్చింది.

4) పురానా హవేలి - హైదరాబాద్ స్వర్ణ యుగంలో అత్యంత చరిత్ర ప్రాధాన్యమున్న ప్రదేశం ఇది. ఆనాటి నైపుణ్యాన్ని చాటే అద్భుతమైన వస్తువులకు, కళారూపాలకు ఇది నిలయం.  చరిత్ర ప్రేమికులకు ఎంతాగానీ ఆశ్చర్యం కలిగించే అద్భుతమైన నిర్మాణం ఇది.

5) మక్కా మసీదు - పురాతనమ్ అత్రి పెద్ద భారత మసీదులలో ఇదొకటి. హైదరాబాద్ చారిత్రక స్థలాల్లో దీనికీ ప్రత్యేక స్థానముంది. దీన్ని 1693 లో ఔరంగ జేబు పూర్తి చేశాడు. ఇందులో వాడిన ఇటుకలు మక్కా నుమ్చి తెప్పించినట్టు చెబుతారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

6) కుతుబ్ షాహీ సమాధులు - ఇబ్రహీం బాగ్ లో ఉన్న కుతుబ్ షాహీ సమాధులు  కుతుబ్ షాహీ సామ్రాజ్యంలో నిర్మించిన చిన్నా, పెద్ద మసీదులు సమాధుల సమాహారమిది. ఇవన్నీ ఎత్తయిన పీఠం మీద డోమ్ ఆకారంలో నిర్మించిమ్చినవి.చిన్నవి ఒకే అంతస్తుగాని, పెద్దవి రెండస్తులు గాని నిర్మితమయ్యాయి. మొఘల్ సైన్యం ఈ ప్రదేశాన్ని గోల్కొండ కోటను లక్ష్యంగా చెసుకోవటానికి వాడుకుంది. కింది అంతస్తులో మొఘల్ పాలకుల అశ్వశాలగా వాడేవారు.

7) పయగా సమాధులు - హైదరాబాద్ లోని పిసల్  బండ శివార్లలో ఉన్న పయగా సమాధులు పైగా రాజకుటుంబానికి చెందినవి. ప్రస్తుతం అవి శిథిలావస్థలో ఉన్నప్పటికీ వాటి శిల్పకళా నైపుణ్యం మాత్రం ఆకట్టుకుంటుంది. పాలరాయి పలకలు అంత అద్భుతంగా ఉంటాయి. ఈ చారిత్రక ప్రదేశాన్ని అక్కడే నివసించే వారి వారసుల కుటుంబాలే నిర్వహిస్తున్నాయి.
 
8) సాలార్ జంగ్ మ్యూజియం - ఇది హైదరాబాద్ లోని దారుల్ షఫా లో మూసీ నది దక్షిణపు ఒడ్డున 1951 లో ఏర్పాటైంది. సాలార్ జంగ్ కుటుంబం ప్రపంచం నలుమూలలనుంచీ సేకరించిన అరుదైన వస్తువులు ఇందులొ ఉన్నాయి. దక్కన్ చరిత్రలోనే ఇదొక అద్భుత కుటుంబంగా విలసిల్లింది. వారిలో ఐదుగురు నిజాం పాలనలో ప్రధాన మంత్రులుగా పనిచేశారు.

9) వరంగల్లు కోట- ఇది 12వ శతాబ్దం నాటిది అని చెబుతారు.-ఇది కాకతీయ పాలకుల రాజధాని నగరం. ఈ కోటలు నాలుగు అలంకార పూరితమైన ద్వారాలు ఉంటాయి, వాటినే కాకతీయ కళాతోరణం అని పిలుస్తారు.  ఇది శిథిలమైన మహా శివాలయం ద్వారం.

10) కుతుబ్ షాకీ దారు భవనం - ఈ పాలెస్ కూడా వర్తకమార్గంలో ఉంది.  

వాణిజ్య మార్గం చుట్టూ నిర్మాణాలు కట్టటంతో ప్రాధాన్యాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించారు. గోల్కొండ- చార్మినార్ పూల్ ఏ నార్వా కొత్త రాజధానిని కోటతో అనుసంధానం చేస్తుంది.

శ్రీమతి వొట్టేరి జంటనగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ గురించి మాట్లాడుతూ,1798లో రెండో నిజామ్ కూ, బ్రిటిష్ వారికీ మధ్య  అనుబంధ పొత్తు ఒప్పందం సంతకమైన తీరును వర్ణించారు. సుదూర ప్రాంతంలోని చార్మినార్ నుంచి ఉత్తర భాగంలో ఉన్న ఇప్పటి కంటోన్మెంట్ ప్రాంతాన్ని సికింద్రాబాద్ గా పిలవటాన్ని కూడా ప్రస్తావించారి. మూడో నిజాం నవాబ్ సికందర్ ఝా పేరు మీద ఇది సికింద్రాబాద్ అనే పేరు తెచ్చుకుందన్నారు.  యూరోపియన్ శైలిలో చార్మినార్ నిర్మాణం 1908లో ప్రారంభం కాగా, వరద తరువాత 1911 లోప్లేగు వ్యాధి వచ్చిన అనంతరం  1911 దాకా సాగిందన్నారు.
 
పురాతన వారసత్వ భవనాలతోబాటు ఆధునిక నిర్మాణాలు కూడా ఉండగా, వీటికి తోడు లక్క గాజులకు, గ్లాస్ గాజులకు లాడ్ బజార్ ఎంతగానో పేరుగాంచింది. పత్థర్ ఘట్టీ లో ముత్యాలు, ఆభరణాలు, లాడ్ బజార్ లో సంప్రదాయ దుస్తులు, చాటా బజార్ లో కాలిగ్రఫీ ఎంతగానో ప్రసిద్ధి. తినటానికి అనువైన వెండి పొర, జర్దోజీ పనితనం  కూడా ఇక్కడి ప్రత్యేకతను చాటతాయి.
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కాలినడక పర్యటనలు కూడా ఏర్పాటు చేయటాన్ని గుర్తు చేశారు. ఇది రాష్ట్ర సంస్కృతిని, వారసత్వ సంపదను చాటి చెబుతుందన్నారు. హైదరాబాద్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ కూడా అందుబాటులోకి తెచ్చిందన్నారు.

అదనపు డైరెక్టర్ జనరల్ రూపీందర్ బ్రార్ ఈ సమావేశానికి అనుసంధానకర్తగా వ్యవహరించారు. రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో హైదరాబాద్ చేరుకోవటానికి ఉన్న వెసులుబాటును ఆమె వివరించారు. ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం ఐరోపా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేసాలలో అనుసమ్ధానమై ఉందని చెప్పారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ పరంగా పరిశుభ్రత, ఇంధన సామర్థ్యంలోను ఎన్నో అవార్డులు అందుకుందని గుర్తు చేశారు.

మంత్రిత్వ శాఖ అందిస్తున్న టూరిస్ట్ ఫెసిలిటేటర్ సర్టిఫికెట్ కార్యక్రమం గురించి కూడా ఆమె మాట్లాడారు. ఇది దర్శనీయ స్థలాలమీద ఆన్ లైన్ కార్యక్రమం. ఇది యాత్రికులకు గత చరిత్రను, సంస్కృతిని కథ రూపంలో వివరించటానికి బాగా పనికొస్తుంది. దీనివలన పౌరులు స్థానిక సంస్కృతి పట్ల మరింత అవగాహన పెంచుకోవటానికి, సందర్శకులకు ఒక ప్రత్యేక పద్ధతిలో వివరించటానికి పనికొస్తుంది.

ఈ వెబినార్ సెషన్ ను https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured లోను. పర్యాటక మంట్రిత్వశాఖ వెబ్సైట్స్  incredibleindia.org  ,  tourism.gov. in   లోనూ చూడవచ్చు.  హంపీని అన్వేషిద్దాం పేరుతో తర్య్వాత వెబునార్ The next webinar 2020 ఆగస్టు 29 ఉదయం11.00 కు జరుగుతుంది.

***



(Release ID: 1648372) Visitor Counter : 284