రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

మోటారు వాహన పత్రాల చెల్లుబాటు తేదీని ఈ సంవత్సరం డిసెంబరు వరకు పొడిగింపు

प्रविष्टि तिथि: 24 AUG 2020 3:45PM by PIB Hyderabad

మోటారు వాహనాల చట్టం, 1988 మరియు కేంద్ర మోటారు వాహనాల చట్ట నిబంధనలు, 1989 ప్రకారం మోటారు వాహనాల యోగ్యత, రహదారి అనుమతి, అనుమతి పత్రం, నమోదు మరియు ఇందుకు సంబంధించిన ఇతర పత్రాల చెల్లుబాటును 31 డిసెంబర్ 2020 వరకు పొడిగిస్తూ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల చట్టం, 1988 మరియు కేంద్ర మోటారు వాహనాల చట్ట నిబంధనలు, 1989 ప్రకారం వాహన పత్రాల చెల్లుబాటును ముందుగా ఈ సంవత్సరం 30 మార్చి అనంతరం 9 జూన్ వరకు పొడిగించింది.  వాహన యోగ్యత, అన్నిరకాల అనుమతులు, అనుమతి పత్రాలు, నమోదు మరియు సంబంధిత ఇతర పత్రాల చెల్లుబాటును 30 సెప్టెంబర్ 2020 వరకు చెల్లుబాటుగా పరిగణించాలని సూచించింది.

కాగా ప్రస్తుతం కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో 1 ఫిబ్రవరి 2020 నాటికి గడువు తీరే అన్ని పత్రాల గడువును 31 డిసెంబర్ 2020 నాటి వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర  రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ తెలిపింది.  కేంద్ర  రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజానీకానికి రవాణా సంబంధిత సేవల్లో ఏంతో సహాయపడుతుందని ఆశిస్తున్నారు.

***


(रिलीज़ आईडी: 1648213) आगंतुक पटल : 354
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Odia , Tamil , Malayalam