ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో ఒకే రోజు అత్యధిక రికవరీ కేసులు 63,631

ఒకరోజు రికవరీ కేసుల్లో ఇది భారత్ భారీ రికార్డు

ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 22లక్షలు

క్రియాశీలక కేసులకంటే రికవరీ కేసులు 15లక్షలు ఎక్కువ

Posted On: 22 AUG 2020 3:33PM by PIB Hyderabad

    రోజువారీగా నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 10లక్షల 23వేలు దాటిన నాడే కోవిడ్ వైరస్ పై పోరాటంలో  భారత్  మరో రికార్డు నెలకొల్పింది. గత 24గంటల్లో అత్యధికంగా 63వేల 631 మంది కోలుకోవడంతో ఒక రోజు రికార్డయిన రికవరీ కేసుల్లో భారత్ మరో మైలురాయిని దాటినట్టయింది.

  అధిక సంఖ్యలో కోవిడ్-19 రోగులు కోలుకుని, ఆసుపత్రులనుంచి, హోమ్ ఐసొలేషన్ (తక్కువ తీవ్రత కేసులు, ఒక మోస్తరు తీవ్రత కేసులు) నుంచి డిశ్చార్జి కావడంతో వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి శాతం (రికవరీ రేటు) 74.69 శాతానికి చేరుకుంది. దీనితో మరణాల రేటు కూడా తగ్గింది. మరణాల రేటు తాజాగా 1.87 శాతంగా నమోదైంది.

  దేశంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి కేసులు లేదా యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసులే భారీ సంఖ్యలో ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 6,97,330 కాగా, రికవరీ కేసులు వాటికంటే 15లక్షలు ఎక్కువగా రికార్డయ్యాయి. అధిక సంఖ్యలో రికవరీ కేసుల నమోదుతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో యాక్టివ్ కేసుల శాతం ప్రస్తుతం 23.43శాతం మాత్రమే. భారీ స్థాయిలో నిర్ధారణ పరీక్షల ద్వారా త్వరితంగా కేసులను గుర్తించడం, సమగ్రమైన పద్ధతిలో నిఘాతో కాంటాక్ట్. కేసులను పసిగట్టడం, పాజిటివ్ కేసుల విషయంలో సకాలంలో పటిష్టమైన చికిత్స అందించడం తదితర చర్యలతో కరోనా బాధితులు వేగంగా కోలుకోగలుగుతున్నారు. రికవరీ కేసుల సంఖ్య పెరగడం, మరణాల రేటు తగ్గడం..వంటి పరిణామాలు చూసినపుడు, యాక్టివ్ కేసుల విషయంలో భారత్ అనుసరిస్తున్న వ్యూహం సత్ఫలితాలనిస్తోందని తెలుస్తోంది.

 

   భారీ స్థాయిలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, సమగ్రమైన పద్ధతిలో కేసులను గుర్తించడం, ఇంటింటి సర్వే పద్ధతిలో కాంటాక్ట్ కేసులను పసిగట్టడం వంటి చర్యలతో కోవిడ్-19 కేసులను త్వరితంగా గుర్తించడం సాధ్యమైంది. స్వల్ప లక్షణాలు, ఒక మోస్తరు లక్షణాలతో కూడిన కేసులను గృహనిర్బంధంలోనే ఉంచి చికిత్స అందించడం జరిగింది. క్రిటికల్ కేసులు, తీవ్రమైన కేసుల విషయంలో మాత్రం బాధితులను ఆసుపత్రుల్లో చేర్చి, ఉత్తమమైన వైద్య చికిత్సను అందించారు.

   కోవిడ్-19కు సంబంధించిన సాంకేతికపరమైన అంశాలపై అధికారికమైన, తాజా సమాచారం, మార్గదర్శక సూత్రాలు, సలహాలు, సూచనల కోసం https://www.mohfw.gov.in, @MoHFW_INDIA వెబ్ సైట్లను సంప్రదించవచ్చు.

   కోవిడ్-19కు సంబంధించిన సాంకేతికపరమైన సందేహాలను, technicalquery.covid19[at]gov[dot]in అనే వెబ్ సైటుకు, మిగతా సందేహాలను, ప్రశ్నలను ncov2019[at]gov[dot]in, @CovidIndiaSeva  అనే వెబ్ సైట్లకు పంపించుకోవచ్చు.

  కోవిడ్-19పై ఏవైనా సందేహాలుంటే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ నంబరు +91-11-2397 8046కు లేదా, 1075 (టోల్ ఫ్రీ)కు ఫోన్ చేయవచ్చు.

 

   రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్-19 కేసులపై హెల్ప్ లైన్ నంబర్ల జాబితా కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

గ్రాఫ్...హెడ్డింగ్: రోజువారీ రికవరీ కేసులు పెరుగుతున్న తీరు

****



(Release ID: 1647955) Visitor Counter : 199