వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

మన వైద్య సమాజం జాతి గర్వపడేలా చేసింది. ఇండియా నమ్మదగిన భాగస్వామి అని ప్రపంచానికి చాటింది: శ్రీ పీయూష్ గోయల్

సాధ్యత, జాగృతి మరియు లభ్యత నుంచి లభించే శక్తి ద్వారా సాంకేతిక సాధనాలను ఉపయోగించి మన ఆరోగ్య వ్యవస్థ పునరావేశంతో పనిచేసేలా చేయాలి

Posted On: 20 AUG 2020 1:29PM by PIB Hyderabad

మన వైద్య సమాజం జాతి  గర్వపడేలా చేసింది ప్రపంచస్థాయి ఒప్పందం కుదుర్చుకునే వాణిజ్యంలో  ఇండియా నమ్మదగిన భాగస్వామి అని ప్రపంచానికి  చాటిచెప్పిందని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. గురువారం ఇక్కడ  భారత పరిశ్రమల సమాఖ్య (సి ఐ ఐ)  12వ ప్రపంచ మెడిటెక్ సమ్మేళనాన్ని ప్రారంభిస్తూ  ఔషధాల తయారీ పరిశ్రమ పట్టుదలతో శ్రద్ధగా పని చేసి ఇండియాకు,  ప్రపంచ దేశాలకు తగినన్ని మందులను సరఫరా చేయగలిగింది అన్నారు.  "కోవిడ్  19 మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమైన వైద్య ఉపకరణాలను దేశీయంగా  తయారు చేయడం ద్వారా  వైద్య పరికరాల  పరిశ్రమ సేవచేసిందని,  అదే విధంగా మన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది మరియు వైద్య సమాజం నిరంతరం శ్రమించి సామాన్యులకు సేవచేయడమే కాక తద్వారా దేశ క్షేమం, శ్రేయస్సుకు పాటుపడి  జాతి గర్వపడేలా చేశాయని" అన్నారు.  

          కఠినంగా లాక్ డౌన్ అమలు చేయడం ఎలాగో,  సత్వరం కోలుకోవడం ఎలాగో  ఇండియా ప్రపంచానికి చూపిందని మనం ఈరోజు గర్వంగా చెప్పుకోగలమని శ్రీ గోయల్ అన్నారు.   " దేశంలో కోవిడ్ -19 సోకి కోలుకుంటున్న వారి సంఖ్య ప్రోత్సాహకరంగా ఉందని, వ్యాధి సోకినా వారిలో  70% కన్నా ఎక్కువ మంది కోలుకున్నారని,  ఈ కాలం మనందరికీ ఎన్నో కొత్త పాఠాలు నేర్పింది".     

            ప్రధానమంత్రి స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని తమ ప్రసంగంలో ఆత్మనిర్భర్ భారత్ మరియు  వైద్య వృత్తిలో ఉన్న వారి పాత్రను గురించి మాట్లాడారని అన్నారు.   మనకు అందుబాటులో ఉన్న సాంకేతిక సాధనాలను ఉపయోగించి ఆరోగ్య వ్యవస్థను శక్తివంతంగా మార్చాలని ఇందుకు సాధ్యత, జాగృతి మరియు లభ్యత వంటి వాటి నుంచి శక్తిని పొందాలని అన్నారు.  ఔషధాల తయారీ, వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమలు  మరియు వైద్య వృత్తిలో ఉన్న వారు ప్రజల ప్రాణాల సంరక్షణలో స్వావలంబన  సాధనకు గల ప్రాముఖ్యతను గుర్తించి  సాధించాలనే విషయాన్ని గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోగలరని అన్నారు.  


      "నిరంతర శ్రమ వల్ల ఫలితాలు తధ్యం"  అని  యోగానంద చెప్పిన  మాటలను ఉటంకిస్తూ వైద్య మరియు ఔషధాల తయారీ వృత్తిలో ఉన్నవారు కూడా ఇండియాకు స్వావలంబన సాధించాలనే తీర్మానంతో నిరంతరం కట్టుబడి పని చేస్తున్నారని అభినందిస్తూ,  ఆ విధంగా ఆత్మనిర్భర్ భారత్ వాస్తవ రూపం దాల్చడాన్ని నిశ్చయం చేసుకుంటున్నారని అన్నారు.  

 ప్రజలను ఏకం చేయడంతో పాటు దత్తాంశాల క్రోడీకరణ, మదింపు ప్రక్రియ ద్వారా మన ఆరోగ్య సేవల పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచవచ్చని శ్రీ గోయల్ అన్నారు.  రోగులకు సంబంధించిన సమాచారాన్ని వైద్యులకు అందుబాటులోకి తేవడం వల్ల రోగ నిర్ధారణ కచ్చితంగా చేసి రోగులకు సేవలు అందించవచ్చునని అన్నారు.  

     ఔషధాల తయారీ ద్వారా ప్రపంచానికే ఔషధాగారంగా మారిన ఇండియా ఉన్నత ప్రమాణాలు గల వైద్య సంరక్షణ అందించడం ద్వారా ప్రపంచానికే ఆసుపత్రి కాగలదని అన్నారు.  అదే విధంగా వైద్య ఉపకరణాల పరిశ్రమ  అంతర్జాతీయ  ఆసుపత్రులకు వైద్య పరికరాలను  సమకూర్చి ప్రపంచ వాణిజ్యంలో సముచిత స్థానాన్ని పొందగలదని మంత్రి అన్నారు.  

 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  దృష్టి కేంద్రీకరించిన మరో అంశం స్వస్థత కేంద్రాలు.  వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంలో మనకు తరుణోపాయం స్వస్థత కేంద్రాలు.   "యోగ్యంగా ఉండటం మన ప్రభుత్వ మంత్రం" అని ఆయన అన్నారు.   

     దేశ ఆరోగ్య సంరక్షణ సేవలకు ఉజ్జ్వల భవిష్యత్తును కల్పించే విధంగా ప్రధానమంత్రి మనసృష్టి చేశారు.  తద్వారా భారతీయులందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు,  సాధనాలు మరియు సౌకర్యాలు అందుబాటులోకి రాగలవనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు.   


(Release ID: 1647437) Visitor Counter : 252