ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఒకే రోజులో రికార్డు సంఖ్యలో 9 లక్షలు పైబడ్డ కోవిడ్ పరీక్షలు
ప్రతి పదిలక్షల జనాభాకూ పెరుగుతున్న కోవిడ్ పరీక్షలు, ఈరోజు 23,668
Posted On:
20 AUG 2020 1:39PM by PIB Hyderabad
రోజువారీ కోవిడ్ పరీక్షలలో భారత్ ఈ రోజు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మొదటి సారిగా ఈ రోజు 9 లక్షలకు పైగా పరీక్షలు జరిపింది. గడిచిన 24 గంటల్లో 9,18,470 శాంపిల్స్ పరీక్షించారు. దీంతో భారత్ లక్ష్యంగా పెట్టుకున్న పది లక్షల మైలురాయిని త్వరలో దాటే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 3.25 కోట్లు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే ఈ సంఖ్య 3,26,61,252.
పరీక్షలు జరిపే లాబ్ ల నెట్ వర్క్ ను విస్తృతం చేస్తీ, సులభంగా పరీక్షలు జరిపే ఏర్పాట్లు చేయటం వలన ఈ సంఖ్య సాధ్యమైంది. దీంతో ప్రతి పది లక్షల జనాభాలో పరీక్షల సంఖ్య వేగంగా పెరుగుతూ నేడు ఆ సంఖ్య 23668 కు చేరింది. ప్రతి పది లక్షలమందిలో పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది.
ఆ విధంగా వేగంగా పరీక్షలు పెరుగుతూ ఉండగా పాజిటివ్ నిర్థారణలు తగ్గుతూ వస్తున్నాయి. నిజానికి పరీక్షలు పెరిగే కొద్దీ పాజిటివ్ కేసులు పెరగాల్సి ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అనుభవం దృష్ట్యా ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది. సకాలంలో ఐసొలేషన్ కి పంపటం, సమర్థవంతంగా ఆచూకీ తెలుసుకొని చికిత్స అందించటం లాంటి చర్యల వల్ల ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి.
జాతీయ సగటు 8% దిగువకు పడిపోగా, 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనార్హం
పరీక్షల విషయంలో అనుసరించిన కీలకమైన వ్యూహం లాబ్ ల నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తృతం చేయటం. దీంతో ప్రస్తుతం లాబ్ ల సంఖ్య 1494 కి చేరింది. ఇందులో ప్రభుత్వ రంగంలో 977 లాబ్ లు ఉండగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో 517 ఉన్నాయి.
రకరకాల లాబ్ ల వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ : 764 (ప్రభుత్వ: 453 + ప్రైవేట్: 311)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 611(ప్రభుత్వ: 490+ ప్రైవేట్: 121)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 119 (ప్రభుత్వ: 34 + ప్రైవేట్ 85 )
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91
-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
***
(Release ID: 1647388)
Visitor Counter : 286
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam