శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంకుర సంస్థలకు ఒక రూపం వచ్చేలా ఇంక్యూబేషన్ ప్రక్రియను చేపట్టిన ఎన్ఆర్డిసి, ఎన్ఏఎల్

Posted On: 19 AUG 2020 11:16AM by PIB Hyderabad

ప్రధాన స్రవంతిలో వ్యవస్థను ఆవిష్కరించాలంటే ప్రాథమిక దశ, తొలి చొరవ అంకుర కంపెనీల నుండే ప్రారంభం అవుతుంది. సులభతరం విధానాలు, అందించే చేయూత పైనే కార్యాచరణ దృష్టి సారిస్తుంది. పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యం, పొదుగుదల అనేవి అంకుర కంపెనీలలో ముఖ్య అంశం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్డిసి), కౌన్సిల్ అఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సిఎస్ఐఆర్-ఎన్ఏఎల్) సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ఏరోస్పేస్ టెక్నాలజీల రంగంలో స్టార్టప్ లను ప్రోత్సహించడానికి ఇన్నోవేషన్, ఇంక్యూబేషన్ కేంద్రాలను బయటి ప్రైవేట్ రంగం నుండి నిధులు సేకరించడం ద్వారా అభివృద్ధి చేయాలని సంకల్పించాయి. 

ఈ కార్యక్రమం కింద ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రంగంలో స్టార్టప్‌లు ఉత్పత్తి, నమూనాల అభివృద్ధికి, వాటి ధ్రువీకరణకు ఇంక్యుబేట్, మెంటర్డ్ సహకారం అందిస్తాయి. 'ఏరోస్పేస్ ఇంజనీరింగ్ హైటెక్ ప్రాంతంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఎన్‌ఆర్‌డిసి మరియు సిఎస్‌ఐఆర్-ఎన్‌ఎల్ ఒక వినూత్న భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నందున ఇది ఒక చారిత్రక రోజు, ఈ భాగస్వామ్యం పనిచేస్తున్న ఇతర సిఎస్‌ఐఆర్ ప్రయోగశాలలలో ఇన్నోవేషన్ కమ్ ఇంక్యుబేషన్ సెంటర్లను స్థాపించడానికి మార్గం సుగమం చేస్తుంది. ”అని ఎన్ఆర్డిసి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్. పురుషోత్తం అన్నారు. ఈ భాగస్వామ్యం మన దేశ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి సహాయపడుతుందని, ఇది ప్రస్తుత అవసరమని ఆయన తెలిపారు.

ఈ ఒప్పందంపై డాక్టర్ హెచ్. పురుషోత్తం,  సి.ఎస్.ఐ.ఆర్-ఎన్ఏఎల్  డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర జె. జాదవ్ సంతకం చేశారు. సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్, శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన శాఖ  (డిఎస్ఐఆర్) కార్యదర్శి డాక్టర్ శేఖర్ సి మాండే, డిఎస్ఐఆర్ జాయింట్ సెక్రటరీ శ్రీ ఆర్ వైధీశ్వరన్ సమక్షంలో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పందాలను ఇచ్చిపుచ్చుకున్నారు. న్యూ ఢిల్లీలోని సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయంలో సిఎస్ఐఆర్, ఎన్ల్ఏఎల్ కి చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

 

 

*****



(Release ID: 1646927) Visitor Counter : 192