శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 కోసం భారత్-అమెరికా వర్చ్యువల్ నెట్ వర్క్స్ కి అవార్డుల ప్రకటన

Posted On: 18 AUG 2020 10:11AM by PIB Hyderabad

భారత్-అమెరికా వర్చువల్ నెట్‌వర్క్‌ల ద్వారా కోవిడ్-19 వ్యాధికారక, వ్యాధి నిర్వహణలో అత్యాధునిక పరిశోధనలను కొనసాగించడానికి భారతదేశం, అమెరికా పరిశోధకులతో కూడిన ఎనిమిది ఉమ్మడి బృందాలు అవార్డులు అందుకున్నాయి. యాంటీవైరల్ పూతలు, రోగనిరోధక మాడ్యులేషన్, మురుగునీటిలో సార్స్ కోవ్-2 ను ట్రాక్ చేయడం, వ్యాధిని గుర్తించే విధానాలు, రివర్స్ జెనెటిక్స్ వ్యూహాలు, ఔషధ పునర్నిర్మాణం వంటివి వారు అనుసరించే పరిశోధన రంగాలు.

ఇండో-యుఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం (ఐయుఎస్ఎస్టిఎఫ్) రెండు దేశాలకు చెందిన ఎనిమిది ఉమ్మడి బృందాలకు అవార్డులను ప్రకటించింది, ఇందులో భారతదేశం, అమెరికా కు  చెందిన ప్రముఖ కోవిడ్-19 పరిశోధకులు ఉన్నారు. కోవిడ్-19 మహమ్మారి, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను కనుగొనే వైద్య, శాస్త్రీయ సమాజ ప్రయత్నాలకు వర్చువల్ నెట్‌వర్క్‌లు సహకారం అందిస్తున్నాయి.  ఐయుఎస్ఎస్టిఎఫ్ అనేది భారతదేశం, అమెరికా ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూర్చే ఒక స్వయంప్రతిపత్తి ద్వైపాక్షిక సంస్థ. ఇది ప్రభుత్వం, విద్యా, పరిశ్రమల మధ్య గణనీయమైన పరస్పర చర్య ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇన్నోవేషన్లను ప్రోత్సహిస్తుంది. భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ విభాగం,  యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్  దీనికి సంబంధిత నోడల్ విభాగాలుగా ఉన్నాయి.

భారతీయ, యుఎస్ సైన్స్ & టెక్నాలజీ వర్గాల సమిష్టి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవటానికి, రెండు దేశాల శాస్త్రవేత్తల బృందాల మధ్య భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి, ప్రస్తుతం కోవిడ్లో నిమగ్నమైన ఇంజనీర్ల మధ్య భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి ప్రతిపాదనల ఆహ్వానించారు. ప్రతిస్పందనగా ప్రతిపాదనలు సమర్పించిన అత్యుత్తమ జట్లలో ఎనిమిది జట్లు ఉన్నాయి. కోవిడ్ సంబంధిత పరిశోధన మరింత ముందుకు తీసుకెళ్లడానికి, పురోగతిని వేగవంతం చేయడానికి ఇరు దేశాల నుండి ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకోనున్నాయి. 

బృందాలను అభినందిస్తూ, ద్వైపాక్షిక ఐయుఎస్‌టిఎఫ్ సహాధ్యక్షులు యుఎస్-ఇండియా భాగస్వామ్యం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఐయుఎస్టిఎఫ్ ఇండియా సహాధ్యక్షుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, "కోవిడ్ -19 పై ఇచ్చిన ప్రత్యేక పిలుపునకు తక్కువ సమయంలో అధిక స్పందన వచ్చింది. రోగనిర్ధారణ, చికిత్సా విధానాలకు ప్రసారం చేయడానికి సార్స్ కోవ్-2 వైరస్ ప్రవర్తనపై ప్రాథమిక అధ్యయనాలు, భారత్-అమెరికా మధ్య విస్తృత సహకారాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆరోగ్యం, శక్తి, కృత్రిమ మేధస్సు మొదలైన వాటిపై బలమైన సహకారం మా శాఖ ద్వారా అందిస్తున్నాం" అని అన్నారు. 

అమెరికా డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్, స్పేస్ అండ్ హెల్త్ బ్యూరో ఆఫ్ ఓషన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ సైంటిఫిక్ అఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ, ఐయుఎస్టిఎఫ్ యుఎస్ సహాధ్యక్షుడు డాక్టర్ జోనాథన్ మార్గోలిస్ మాట్లాడుతూ "కోవిడ్-19 తో పోరాడటానికి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి ఐయుఎస్‌టిఎఫ్ ద్వారా త్వరగా సమీకరించటానికి అమెరికా-భారత్ కలిసి పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మా ప్రజలు, ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుత మహమ్మారి యొక్క సవాళ్లను పరిష్కరించడానికి సాధనాలను గుర్తించడానికి సైన్స్ మరియు టెక్నాలజీపై ఆధారపడతాయి ” అని తెలిపారు. 

ప్రపంచ సవాళ్లు, వివిధ దేశాల మధ్య సహకారాలు, భాగస్వామ్యాలకు పిలుపునిచ్చాయి, ప్రస్తుత మహమ్మారిని పరిష్కరించడానికి మాత్రమే కాకుండా, ముందుకు వచ్చే సవాళ్లకు కూడా పరిష్కారాలను కనుగొనడానికి ఉత్తమ, మేలైన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలిసి పనిచేయడానికి ఒక భాగస్వామ్య దృష్టి కలిగింది. "శాస్త్రీయ సమాజాలు భౌగోళిక సరిహద్దులలో నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా, ఇండో-యుఎస్ వర్చువల్ నెట్‌వర్క్‌లు పురోగతులను సాధించగలవు, ఈ మహమ్మారిని ఎదుర్కోవటానికి వినూత్న, రూపాంతర పరిష్కారాల అభివృద్ధికి దారితీస్తుంది" అని ఐయుఎస్టిఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నందిని కన్నన్ అన్నారు.

శాస్త్రవేత్తలు, శాస్త్ర సాంకేతిక సంస్థలు, శాస్త్రీయ సమాజాల మధ్య భాగస్వామ్యం ద్వారా భారతదేశం, అమెరికా దీర్ఘకాలిక శాస్త్రీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి ఉత్ప్రేరకంగా పనిచేయడం ఉమ్మడి  ఇండో-యుఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం లక్ష్యం. 

*****



(Release ID: 1646631) Visitor Counter : 221