ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
టీకా నిర్వహణపై దేశీయ వ్యాక్సిన్ తయారీదారులను కలిసిన - జాతీయ నిపుణుల బృందం
Posted On:
17 AUG 2020 7:53PM by PIB Hyderabad
టీకా నిర్వహణపై జాతీయ నిపుణుల బృందం ఈ రోజు ప్రముఖ దేశీయ వ్యాక్సిన్ తయారీదారులైన - సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే; భారత్ బయోటెక్, హైదరాబాద్; జైడస్ కాడిలా, అహ్మదాబాద్; జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్, పూణే; బయోలాజికల్ ఈ, హైదరాబాద్ సంస్థలను కలుసుకుంది.
ఈ సమావేశం పరస్పరం ప్రయోజనకరంగా, ఉత్పత్తిదాయకంగా జరిగింది.
దేశీయ తయారీదారులు అభివృద్ధి చేస్తున్న వివిధ వ్యాక్సిన్ల గురించీ, కేంద్ర ప్రభుత్వం నుండి వారు కోరుకుంటున్న అంచనాల గురించీ వివరాలను, ఈ సమావేశంలో జాతీయ నిపుణుల బృందానికి అందించడం జరిగింది.
*****
(Release ID: 1646540)
Visitor Counter : 237