సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

56వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్న ఐఐఎంసీ

వేడుక సందర్భంగా మాట్లాడిన ఐ&బీ కార్యదర్శి శ్రీ అమిత్‌ ఖరే

మీడియా విద్యార్థుల పరిశ్రమ సంబంధిత శిక్షణ గురించి ప్రముఖంగా ప్రస్తావన

Posted On: 17 AUG 2020 6:12PM by PIB Hyderabad

'ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌' (ఐఐఎంసీ) 56వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. దిల్లీలోని ప్రధాన క్యాంపస్‌తోపాటు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ కార్యక్రమాలు నిర్వహించారు.

    కేంద్ర ఉన్నత విద్య విభాగం కార్యదర్శి, ఐఐఎంసీ ఛైర్మన్‌ శ్రీ అమిత్‌ ఖరే దిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. "నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్ఈపీ)- ఫిలాసఫీ అండ్‌ గైడింగ్‌ ప్రిన్సిపుల్స్‌", దేశంలో కమ్యూనికేషన్‌ విద్య కోసం ఎన్‌ఈపీ ఎలా ఉపయోగకరం అన్న అంశంపై మాట్లాడారు.

    ఎన్‌ఈపీ నేపథ్యంలో.., కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో సంప్రదించి 'జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌' విద్యను ఐఐఎంసీ పునఃపరిశీలించాలని ఖరే సూచించారు. సాంకేతిక ఆధారిత విద్య, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ రంగాల్లోని అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఆన్‌లైన్ కోర్సుల ప్రారంభం, జాతీయ విద్య వేదికల కోసం సమాచారాన్ని రూపొందించడం అంశాలను తన ప్రసంగంలో ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. పరిశోధన, శిక్షణ కోసం ఐసీఎస్‌ఎస్‌ఆర్‌, జేఎన్‌యూ వంటి ప్రముఖ సంస్థలతో ఐఐఎంసీ కలిసి పనిచేయాలని అమిత్‌ ఖరే సూచించారు. 

    ఐఐఎంసీ డీజీ ప్రొ.సంజయ్‌ ద్వివేది ఈ కార్యక్రమ ప్రారంభోపన్యాసం చేయగా, ఏడీజీ కె.సతీష్‌ నంబూద్రిపాద్‌ అమిత్‌ ఖరేకు ధన్యవాద కార్యక్రమం నిర్వహించారు.

***
 



(Release ID: 1646519) Visitor Counter : 123