ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సి.ఐ.ఐ. నిర్వహించిన ప్రజా ఆరోగ్య సదస్సు ప్రారంభ సమావేశంలో ఆన్ లైన్ ద్వారా ప్రసంగించిన - డాక్టర్ హర్ష వర్ధన్.
"మన దేశానికి బలమైన ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను పునః పరిశీలించడానికీ, నిర్మాణాత్మకంగా తిరిగి ఊహించుకోవడానికి, కోవిడ్ మహమ్మారి మనకు అవకాశం ఇచ్చింది."
Posted On:
17 AUG 2020 4:15PM by PIB Hyderabad
రెండు రోజుల సి.ఐ.ఐ. ప్రజారోగ్య సదస్సు ప్రారంభ సమావేశానికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ద్వారా అధ్యక్షత వహించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే తో పాటు, నీతీ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం), డాక్టర్ వినోద్ కె. పాల్ కూడా డిజిటల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ మరియు “టి.బి. లేని పని ప్రదేశాల కోసం సి.ఐ.ఐ. ప్రచారం” అనే అంశాలపై ఆన్ లైన్ ప్రదర్శనను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. అతిధుల సమక్షంలో "సి.ఐ.ఐ. ప్రజా ఆరోగ్య నివేదిక" ను కూడా విడుదల చేశారు.
కోవిడ్ మహమ్మారి మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, సి.ఐ.ఐ. కి ధన్యవాదాలుతెలియజేస్తూ, "మన దేశానికి బలమైన ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను పునః పరిశీలించడానికీ, నిర్మాణాత్మకంగా తిరిగి ఊహించుకోవడానికి, కోవిడ్ మహమ్మారి మనకు అవకాశం ఇచ్చింది." అని ఆయన పేర్కొన్నారు. ఈ సరి కొత్త ఆరోగ్య ప్రమాదాన్నిఎదుర్కోడంలో మరియు నయం చేయడంలో భారతదేశం యొక్క విజయవంతమైన విధానాన్ని ఉదహరిస్తూ, ప్రభుత్వ పథకాలను విస్తృత సామాజిక ఉద్యమాలుగా మార్చగల దేశ సామర్థ్యాన్ని ఆయన ప్రశంసించారు. "మొత్తం ప్రపంచంలోని పోలియో కేసులలో 60 శాతం భారతదేశంలోనే నెలకొన్న సమయం నుండి ఈ రోజున స్మాల్-పాక్సు మరియు పోలియో లను పూర్తిగా నిర్మూలించుకోగలిగిన స్థాయికి చేరుకున్నాము." అని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ నాయకులు మరియు సి.ఐ.ఐ. సహాయంతో "2025 సంవత్సరానికల్లా క్షయ రహిత భారతదేశాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి లక్ష్యం కూడా అదేవిధంగా సాధించబడుతుందని" ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీ ఎన్.సి.టి. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తక్కువ నిధులతో పోలియో నిర్మూలనకు ఒక ప్రచారాన్ని నిర్వహించినప్పుడు, పరిశ్రమలోని ప్రముఖ నాయకుల పూర్తి మద్దతు మరియు ఉత్సాహం లభించిందని డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు "దేశం నుండి క్షయ వ్యాధిని నిర్మూలించడంలో అదే ఉత్సాహం మరియు నిబద్ధత" ను తాను గమనిస్తున్నట్లు ఆయన తెలిపారు.
టి.బి. లేని పని ప్రదేశాలు అనే ప్రచార కార్యక్రమం గురించి డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, "దాదాపు 26.4 లక్షల క్షయవ్యాధి కేసులున్న భారతదేశం ప్రపంచ టి.బి. భారం యొక్క అతి పెద్ద వాటాను కలిగి ఉంది. జీవితాల పరంగా, డబ్బు విషయంలో టి.బి. యొక్క ఆర్థిక భారం చాలా ఎక్కువగా ఉంది. ఇది అపరిశుభ్ర పరిస్థితులలో నివసించేవారిని అసమానంగా ప్రభావితం చేస్తుంది, శరీరంలో కేలరీలు కోల్పోతారు. తద్వారా పనిదినాలు పోగొట్టుకుంటారు”. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందన గురించి ఆయన ప్రత్యేకంగా వివరిస్తూ, "భారతదేశంలో టి.బి. నిర్మూలనకు వనరుల కేటాయింపు గత ఐదేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. 2014 లో అధికారం చేపట్టిన వెంటనే, టి.బి. కేసులను గుర్తించడం కోసం ప్రధానమంత్రి ఒక పెద్ద సర్వే ప్రారంభించారు.” అని పేర్కొన్నారు. టి.బి. యొక్క ప్రతి రోగి తో పాటు, మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ టి.బి. ఉన్నవారికి కూడా ఉచితంగా చికిత్స అందించడం జరుగుతోంది. ఇందుకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. అదే విధంగా, టి.బి. కేసులను గుర్తించే వైద్యులకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు, ఆయన తెలియజేశారు.
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందించడం వల్ల, కాలా-అజార్ మరియు కుష్టు వ్యాధి వంటి వ్యాధులు నిర్మూలించబడి, ప్రసూతి మరణాల రేటు సున్నాకి చేరుకుంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
అట్టడుగునఉన్న ప్రజానీకానికి వైద్య సంరక్షణను అందించడానికి ప్రధానమంత్రి చేసిన ప్రయత్నాలు "గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాల విప్లవాత్మక విస్తరణకు" ఎలా కారణమయ్యాయో, శ్రీ అశ్విని కుమార్ చౌబే, వివరించారు.
"ఇ-సంజీవని టెలి-కన్సల్టేషన్ వేదికపై ఇప్పటికే నమోదు చేసిన 1.5 లక్షల సంప్రదింపులను గమనిస్తే, టెలీ-మెడిసిన్ యొక్క తీవ్రమైన ఉపయోగం స్పష్టంగా తెలుస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.
సి.ఐ.ఐ. ప్రజా ఆరోగ్య మండలి అధ్యక్షుని హోదాలో, అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా మరియు భారతీయ పరిశ్రమల మండలి (సి.ఐ.ఐ), డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్రజిత్ బెనర్జీ కూడా ఆన్ లైన్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*****
(Release ID: 1646495)
Visitor Counter : 227