ఉప రాష్ట్రపతి సచివాలయం
నవ్‌రోజ్ పండుగ సందర్భంగా ప్రజలకు ఉప రాష్ట్రపతి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
16 AUG 2020 10:04AM by PIB Hyderabad
నవ్‌రోజ్ పండుగ సందర్భంగా, ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు తన సందేశం ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
"పార్శీ కొత్త ఏడాదిని సూచించే పవిత్రమైన నవ్‌రోజ్ సందర్భంగా దేశ ప్రజలకు నా శుభాకాంక్షలు".
"భారతదేశ సాంస్కృతిలో పార్శీ సమాజానిది ప్రత్యేక స్థానం. కష్టించేతత్వం, నిబద్ధతతో భారత పార్శీ సమాజం దేశ నిర్మాణంలో వెలకట్టలేని పాత్ర పోషించింది. పునరుద్ధరణ, పునరుజ్జీవానికి ఈ వేడుక సూచిక. ఆలోచనలు, ప్రవర్తనలో మంచిగా ఉండడం, నిజాయితీగా, ధర్మబద్ధంగా నడుచుకోవడమే నవ్‌రోజ్ జరుపుకోవడంలో నిజమైన అర్ధం".
"ప్రస్తుతం, భారతదేశం, ప్రపంచం కొవిడ్‌పై పోరాడుతోంది. నవ్‌రోజ్.., స్నేహితులు, బంధువులు కలిసి జరుపుకునే పండుగ అయినప్పటికీ, ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ఎవరి ఇళ్లలో వారే ఉండి నిరాడంబరంగా జరుపుకుందాం. సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రతను తప్పనిసరిగా పాటిద్దాం. ఈ పండుగ మన జీవితాల్లోకి స్నేహం, శ్రేయస్సు, సంతోషాన్ని తీసుకురావాలి".
****
(రిలీజ్ ఐడి: 1646289)
సందర్శకుల సూచీ సంఖ్య : : 228