రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

173 సరిహద్దు, తీరప్రాంత జిల్లాల్లో భారీ విస్తరణకు సర్వం సిద్ధం చేసిన ఎన్‌సీసీ

Posted On: 16 AUG 2020 9:47AM by PIB Hyderabad

అన్ని సరిహద్దు, తీరప్రాంత జిల్లాల్లోని యువత ఆకాంక్షలు తీర్చేలా, నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌సీసీ) ప్రతిపాదించిన భారీ విస్తరణకు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోదం తెలిపారు. 

    ఆగస్టు 15న, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ ప్రతిపాదనను ప్రకటించారు.

    173 సరిహద్దు, తీరప్రాంత జిల్లాల నుంచి లక్ష మంది క్యాడెట్లను ఎన్‌సీసీలో చేర్చనున్నారు. వీరిలో మూడోవంతు బాలికలను తీసుకుంటారు. ఈ కార్యక్రమం కోసం వెయ్యికి పైగా పాఠశాలలు, కళాశాలలను గుర్తించారు. వాటిని ఎన్‌సీసీతో అనుసంధానిస్తారు. 

    ఈ విస్తరణలో ప్రణాళికలో భాగంగా, ఎంపిక చేసిన క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడానికి 83 ఎన్‌సీసీ యూనిట్లను (సైనిక 53, నావిక 20, వాయుదళ 10) అప్‌గ్రేడ్‌ చేస్తారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఎన్‌సీసీ యూనిట్లకు సైన్యం; తీరప్రాంతాల్లో ఉన్న యూనిట్లకు నావికాదళం; వాయుసేన కేంద్రాలకు దగ్గరగా ఉన్న యూనిట్లకు వాయుసేన శిక్షణ, పాలన సాయాన్ని అందిస్తాయి.

    ఈ కార్యక్రమం ద్వారా యువతకు సైనిక శిక్షణ, క్రమశిక్షణాత్మక జీవనం అందించడం మాత్రమే కాక, సాయుధ దళాల్లో చేరేలా వారిని ప్రోత్సహిస్తారు. రాష్ట్రాల సాయం ఎన్‌సీసీ విస్తరణ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.

 ****



(Release ID: 1646287) Visitor Counter : 208