ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 14 AUG 2020 4:28PM by PIB Hyderabad

ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, తన సందేశం ద్వారా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
 
"ఉత్సాహభరిత సందర్భమైన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. మనం 74వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వతంత్ర్య భారతాన్ని నిర్మించడానికి లెక్కలేనన్ని త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పిస్తున్నా. స్వేచ్ఛ కోసం ప్రాణాలు దారపోసిన త్యాగమూర్తులను కృతజ్ఞతతో స్మరించుకుందాం. ఆ త్యాగమూర్తులు కోరుకున్న సమాజాన్ని నిర్మించడమే వారికి అర్పించే నిజమైన నివాళి. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, కోట్లాది ప్రజల కలలు నిజం చేసే సమైక్య, బలమైన, సుసంపన్న, సమగ్ర, శాంతియుత దేశ నిర్మాణం కోసం మనం పునఃసంకల్పిద్దాం. ఈ స్వాతంత్ర్య దినోత్సవం మన దేశంలో స్నేహం, సామరస్యం, శ్రేయస్సును మరింత
పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నా".

***
 


(रिलीज़ आईडी: 1645861) आगंतुक पटल : 234
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Odia , Malayalam