ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఒకేరోజులో రికార్డు స్థాయిలో 8.5 లక్షల కోవిడ్ పరీక్షలు
పెరుగుదలబాటలో 71.17%గా కోలుకున్నవారి శాతం
పాజిటివ్ కేసులలో మరణాలు 1.95%
Posted On:
14 AUG 2020 3:09PM by PIB Hyderabad
రోజుకు పది లక్షల పరీక్షల లక్ష్యం చేరుకోవాలన్న ఆశయంతో క్రమపద్ధతిలో పరీక్షల లాబ్ ల సంఖ్య పెంచుతూ పోవటంతో భారతదేశం ఈరోజు అత్యధికంగా ఒక్క రోజులోనే అత్యధిక పరీక్షలు జరపటంలో రికార్డులకెక్కింది. గడిచిన 24 గంటలలో రికార్డు స్థాయిలో 8,48,728 కోవిడ్ పరీక్షలు జరిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 2,76,94,416 కు చేరింది.
కోవిడ్-19 నేపథ్యంలో ప్రజారోగ్య సామాజిక చర్యలకు అనుగుణంగా ప్రజారోగ్య విధి విధానాలలో మార్పు పేరిట ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శక పత్రం జారీ చేసింది. అనుమానిత కేసుల విషయంలో సమగ్రమైన నిఘా ఉండాలని సూచించింది. ఏ దేశమైనా ప్రతి పది లక్షలమందిలో రోజుకు 140 పరీక్షలు జరపాల్సిన అవసరముందని సూచించింది.
.మన దేశ సగటు ఇప్పుడు రోజుకు ప్రతి పది లక్షల మందిలో 603 పరీక్షలు జరుగుతుండగా, కేంద్రం తదేక దృష్టితో సాగిస్తున్న కృషి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న తీరు ఫలితంగా వాటిలో 34 ఈ పాటికే లక్ష్యాలను అధిగమించాయి. రాష్ట్రాలు మరింత చురుగ్గా పరీక్షలు చేపట్టాలని కేంద్రం మరోమారు ఆదేశించింది.
"దూకుడుగా పరీక్షించటం, సమగ్రంగా ఆనవాలు పట్టటం, సమర్థవంతమైన చికిత్స అందించటం" అనే త్రిముఖ వ్యూహం ఆశించిన ఫలితాలనిస్తోంది. దేశవ్యాప్తంగా పరీక్షల నెట్ వర్క్ పెంచటం ద్వారా ఎక్కువ పరీక్షలు జరుపుతూ వస్తున్నారు. ఈరోజుకు లాబ్ ల సంఖ్య మొత్తం1451 కి చేరుకోగా అందులో 958 ప్రభుత్వం ఆధ్వర్యంలోను, 493 లాబ్ లు ప్రైవేట్ రంగంలోను ఉన్నాయి.
రకరకాల లాబ్ లు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ : 749 (ప్రభుత్వ: 447 + ప్రైవేట్: 302)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 586 (ప్రభుత్వ: 478 + ప్రైవేట్: 108)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 116 (ప్రభుత్వ: 33 + ప్రైవేట్ 83 )
దూకుడుగా పరీక్షించటం, సమగ్రంగా ఆనవాలు పట్టటం, సమర్థవంతమైన చికిత్స అందించటం కారణంగా కోలుకున్నవారి శాతం బాగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అది 71.17% చేరింది. ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 17.5 లక్షలు దాటింది. కచ్చితంగా చెప్పాలంటే ఈ రోజు అది 17,51,555 కు చేరింది. కోలుకున్నవారి సంఖ్య మొత్తం పాజిటివ్ లలో అలా ఉండగా ఇంకా చికిత్సలో ఉన్నవారి సంఖ్య 6,61,595 గా నమోదైంది. దాదాపు 11 లక్షలమంది ( కచ్చితంగా చెప్పాలంటే 10,89,960 మంది) వారికంటే ఎక్కువగా కోలుకున్నారు
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
***
(Release ID: 1645851)
Visitor Counter : 287
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam