హోం మంత్రిత్వ శాఖ

'పారదర్శక పన్ను-నిజాయితీని గౌరవించడం' ప్లాట్‌ఫాం ప్రారంభం 'నవ భారత్‌' కోసం వేసిన ముఖ్య అడుగు: కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా
దేశ ప్రగతి, అభివృద్ధికి వెన్నెముక వంటి, నిజాయితీగా పన్ను కట్టేవారిని గౌరవించడానికి, సాధికారతకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది: అమిత్‌ షా

ప్రధాని మోదీ సంకల్పించిన 'చిన్న ప్రభుత్వం-పెద్ద పాలన' దిశగా వేసిన మరో అడుగు "పారదర్శక పన్ను ప్లాట్‌ఫాం": అమిత్‌ షా

'పారదర్శక పన్ను-నిజాయితీని గౌరవించడం' ప్లాట్‌ఫాం ప్రారంభం, పన్ను చెల్లింపుదారులకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఇస్తున్న బహుమతి

"ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌, ఫేస్‌లెస్‌ అప్పీల్‌ &టాక్స్‌పేయర్స్‌ ఛార్టర్‌" వంటి సంస్కరణలు మన పన్ను వ్యవస్థను బలోపేతం చేస్తాయి: అమిత్‌ షా

Posted On: 13 AUG 2020 4:06PM by PIB Hyderabad

'పారదర్శక పన్ను-నిజాయితీని గౌరవించడం' ప్లాట్‌ఫాం ప్రారంభం అనేది 'నవ భారత్‌' కోసం వేసిన ముఖ్య అడుగుగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా అభివర్ణించారు. పన్ను చెల్లింపుదారులకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌ ఇస్తున్న బహుమతి అంటూ ట్వీట్ చేశారు. "ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌, ఫేస్‌లెస్‌ అప్పీల్‌ &టాక్స్‌పేయర్స్‌ ఛార్టర్‌" వంటి సంస్కరణలు దేశ పన్ను వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని అమిత్‌ షా పేర్కొన్నారు. 

    దేశ ప్రగతి, అభివృద్ధికి వెన్నెముక వంటి, నిజాయితీగా పన్ను కట్టేవారిని గౌరవించడానికి, వారి సాధికారతకు మోదీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందన్న అమిత్‌ షా...  ప్రధాని సంకల్పించిన 'చిన్న ప్రభుత్వం-పెద్ద పాలన' దిశగా వేసిన మరో అడుగే "పారదర్శక పన్ను ప్లాట్‌ఫాం" అని ట్వీట్‌లో వెల్లడించారు.
 

***(Release ID: 1645538) Visitor Counter : 57