రైల్వే మంత్రిత్వ శాఖ

రైల్వే ఉద్యోగుల ఆన్‌లైన్ పాస్ జనరేషన్, టికెట్ బుకింగ్ కోసం క్రిస్ ద్వారా అభివృద్ధి చేసిన హెచ్ఆర్ఎంఎస్ ప్రాజెక్ట్ కింద ఈ-పాస్ మాడ్యూల్‌ను విడుదల చేసిన రైల్వే బోర్డు చైర్మన్

ఉద్యోగులు ఎక్కడి నుండైనా ఆన్‌లైన్‌లో పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఆన్‌లైన్‌లో ఇ-పాస్ జెనెరేట్ అవుతుంది

రైల్వే అధికారులు అధికారిక పనుల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది, ఇది అధికారుల కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుంది

Posted On: 13 AUG 2020 12:48PM by PIB Hyderabad

రైల్వే బోర్డు ఛైర్మన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా క్రిస్ అభివృద్ధి చేసిన మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ (హెచ్ఆర్ఎంఎస్) ఇ-పాస్ మాడ్యూల్‌ను ప్రారంభించింది.  ఎఫ్సి / రైల్వేలు, అన్ని బోర్డు సభ్యులు, ఐఆర్సిటిసి మేనేజింగ్ డైరెక్టర్, క్రిస్ ఎండి, అందరు జీఎంలు, పిసిపిఓఎస్, పిసిసిఎంఎస్, పిఎఫ్ఏలు, డిఆర్ఎం లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

హెచ్ఆర్ డిజి ఈ-పాస్ మాడ్యూల్ వివిధ అంశాల గురించి దాని దశల అమలు వ్యూహం గురించి వివరించారు. పాస్ జారీ చేసే విధానం ఐఆర్ మాన్యువల్‌ లో ఉంది. ఇప్పటి వరకు రైల్వే ఉద్యోగి పాస్‌లో ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవడానికి కూడా సౌకర్యం లేదు.

హెచ్ఆర్ఎంఎస్ ప్రాజెక్ట్ కింద క్రిస్ - రైల్వే ఉద్యోగుల కోసం ఈ-పాస్ మోడ్యూల్ ను భారతీయ రైల్వేస్ కోసం దశల వారీగా రూపొందిస్తోంది. ఈ సౌకర్యంతో రైల్వే ఉద్యోగులు పాస్ కోసం ఆఫీస్ కి రానవసరం లేదు. ఆన్ లైన్ ద్వారానే ఎక్కడి నుండైనా పొందవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం మొబైల్ లో కూడా చేయవచ్చు. పిఆర్ఎస్/యుటిఎస్ కౌంటర్ల వద్దే కాకుండా వారు టికెట్ బుకింగ్ ని ఇక ఆన్ లైన్ లో చేసుకోవచ్చు. 

భారతీయ రైల్వే యొక్క పూర్తి హెచ్ ఆర్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడానికి హెచ్ఆర్ఎంఎస్ ప్రాజెక్ట్ రూపొందించిన సమగ్ర ప్రణాళిక. మొత్తం 21 మాడ్యూల్స్ హెచ్ఆర్ఎంఎస్ లో ప్రణాళిక చేసారు. గత సంవత్సరం ప్రారంభించిన హెచ్ఆర్ఎంఎస్ ఎంప్లాయీ మాస్టర్, ఇ-సర్వీస్ రికార్డ్ మాడ్యూళ్ళలో సుమారు 97% రైల్వే ఉద్యోగుల ప్రాథమిక డేటా ఎంట్రీ పూర్తయింది. క్రిస్  ఆఫీస్ ఆర్డర్ మాడ్యూల్, హెచ్ఆర్ఎంఎస్ సెటిల్మెంట్ మాడ్యూళ్ళను కూడా త్వరలో ప్రారంభించబోతోంది.

*****



(Release ID: 1645486) Visitor Counter : 151