ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో మూడు కోట్లకు మించి ఎన్-95 మాస్కులను రాష్ట్రాలకు పంపిణీ చేసింది.
1.28 కోట్లకు పైగా పి.పి.ఈ.లు మరియు 10 కోట్ల హెచ్.సి.క్యూ. మాత్రలను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది
Posted On:
13 AUG 2020 10:23AM by PIB Hyderabad
కోవిద్-19 యొక్క నియంత్రణ మరియు నిర్వహణ కోసం రాష్ట్రలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్విరామంగా కృషి చేస్తుండగా, హమ్మారిని కట్టడి చేయడానికీ, దాని సమర్థవంతమైన నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది.
కోవిడ్-19 సదుపాయాలను పెంచడంతో పాటు, వారి ప్రయత్నాలకు అనుబంధంగా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం వైద్య సామాగ్రిని ఉచితంగా అందిస్తోంది. భారత ప్రభుత్వం సరఫరా చేసే చాలా ఉత్పత్తులు ప్రారంభంలో మన దేశంలో తయారు చేయబడలేదు. అయితే, మహమ్మారి కారణంగా పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ విదేశీ మార్కెట్లలో వాటి కొరతకు దారితీసింది.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ); జౌళి మంత్రిత్వ శాఖ; ఫార్మాస్యూటికల్స్ మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగం (డి.పి.ఐ.ఐ.టి); రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ. మరియు ఇతరుల సంయుక్త కృషితో, కోవిడ్ సమయంలో పి.పి.ఈ. లు, ఎన్-95 మాస్కులు, వెంటిలేటర్లు మొదలైన అత్యవసరమైన వైద్య పరికరాలు తయారుచేసి, సరఫరా చేయడానికి దేశీయ పరిశ్రమ వర్గాలను ప్రోత్సహించడం జరిగింది. ఫలితంగా, ‘ఆత్మనీభర్ భారత్’ మరియు ‘మేక్ ఇన్ ఇండియా’ కోసం సంకల్పం బలపడింది. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన సామాగ్రిలో చాలా భాగం దేశీయంగా తయారైనవే ఉన్నాయి.
2020 మర్చి, 11వ తేదీ నుండి ఇప్పటివరకు, కేంద్ర ప్రభుత్వం 3.04 కోట్లకు పైగా ఎన్-95 మాస్కులను, 1.28 కోట్లకు పైగా పి.పి.ఈ. పరికరాలను రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు / కేంద్ర సంస్థలకు ఉచితంగా పంపిణీ చేసింది. వీటితో పాటు, 10.83 కోట్లకు పైగా హెచ్.సి.క్యూ. మాత్రలను కూడా వారికి పంపిణీ చేయడం జరిగింది.
వీటికి అదనంగా, 22,533 ‘మేక్ ఇన్ ఇండియా’ వెంటిలేటర్లను వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు / కేంద్ర సంస్థలకు పంపిణీ చేయడం జరిగింది. వాటిని నెలకొల్పి, పనిచేసే విధంగా చూసే బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం వహిస్తోంది.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు : technicalquery.covid19[at]gov[dot]in ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న
ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు : ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva . కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన
ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు. వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
*****
(Release ID: 1645483)
Visitor Counter : 211
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam