ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 56,110 మంది కోలుకున్నారు

దూసుకుపోతున్న భారత్ రికవరీ రేటు: 70%కి పెరుగుదల

భారత్ లో ఎప్పుడు జరగని విధంగా ఒక్క రోజు లోనే 7,33,449 మందికి పరీక్షలు

Posted On: 12 AUG 2020 2:58PM by PIB Hyderabad

గత 24 గంటల్లో 56,110 మంది అత్యధికంగా రికవరీ అయినట్టు నమోదు అయింది. కీలకమైన రోగుల ప్రామాణిక క్లినికల్ మేనేజ్‌మెంట్‌తో పాటు సమర్థవంతమైన నియంత్రణ వ్యూహం, కదన కుతూహలంతో ముందుకు పోవడం, సమగ్ర పరీక్షలను విజయవంతంగా అమలు చేయడం, సంపూర్ణ ప్రామాణిక సంరక్షణ విధానం ఆధారంగా చేపట్టిన చర్యల వల్ల రికవరీ శాతం గణనీయంగా పెరిగింది. 

కేంద్రం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మధ్య నిరంతర సమన్వయ చర్యలు కూడా ఈ ఫలితాలను పెంచడానికి దోహదపడ్డాయి. జులై మొదటి వారంలో కోలుకున్న కేసులు 15000 ఉంటే, ఆగష్టు మొదటి వారంలో ఆ సంఖ్యా 50,000 కి పెరిగింది.

WhatsApp Image 2020-08-12 at 11.35.47.jpeg

కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ, ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అవుతున్న వారు, ఇళ్లలో ఐసొలేషన్ నుండి కోలుకుంటాన్నవారి సంఖ్య ఇప్పటి వరకు 16,39,599 మందికి చేరుకుంది.  రికవరీ రేటు అత్యధిక స్థాయిలో 70.38 శాతంగా నమోదయింది. 

క్రియాత్మకంగా ఉన్న కోవిడ్-19 కేసులు కన్నా రికవరీ అవుతున్న కేసులు 10 లక్షలు ఎక్కువగా ఉండడం గమనించదగ్గ అంశం. 

ఆసుపత్రులలో మెరుగైన, సమర్థవంతమైన క్లినికల్ చికిత్సపై దృష్టి పెట్టడం, రోగులను సత్వర, సకాలంలో చికిత్స కోసం తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ల నాన్-ఇన్వాసివ్, మెరుగైన, సమన్వయ సేవలను ఉపయోగించడం వలన కోవిడ్-19 రోగుల ఒడిదొడుకులు లేని సమర్థవంతమైన రోగి నిర్వహణకు అవకాశం కలిగింది. ఫలితంగా, ప్రపంచ సగటుతో పోల్చినప్పుడు మరణాల సంఖ్య (సిఎఫ్ఆర్) తక్కువగా ఉంది. ఇది ప్రస్తుతం 1.98% వద్ద ఉంది.

పరీక్షించడం, వ్యాధిని ఛేదించడం, చికిత్స చేయడం ...  ఈ త్రిముఖ వ్యూహంతో భారత్ అనురిస్తున్న విధానం వల్ల గత 24 గంటల్లో అత్యధిక స్థాయిలో 7,33,449 పరీక్షలు చేయగలిగే సామర్థ్యం పెరిగింది. వెరసి ఇప్పటి వరకు 2.6 కోట్ల పరీక్షలు దేశవ్యాప్తంగా జరిగాయి. సగటున మిలియన్ మందికి గాను 18,852 మందికి పరీక్షలు జరుగుతున్నాయన్నది తాజా లెక్క. 

శ్రేణివారీ, పరిణామ క్రమంలో ప్రతిస్పందన ఫలితంగా దేశంలో పరీక్షా వ్యాప్తి క్రమంగా విస్తరించింది. ఈ వ్యూహాన్ని కొనసాగించడానికి, దేశంలో టెస్టింగ్ ల్యాబ్ నెట్‌వర్క్ నిరంతరం బలోపేతం అవుతుంది.  నేటికి దేశంలో 1421 ల్యాబ్‌లు ఉన్నాయి; ప్రభుత్వ రంగంలో 944 ల్యాబ్‌లు, 477 ప్రైవేట్ ల్యాబ్‌లు. వీటిలో... 

• రియల్ టైమ్ ఆర్టి పీసీఆర్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 724 (ప్రభుత్వం: 431 + ప్రైవేట్: 293)
• ట్రూనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 584 (ప్రభుత్వం: 481 + ప్రైవేట్: 103) 

• సీబీనాట్ ఆధారిత పరీక్షా ప్రయోగశాలలు: 113 (ప్రభుత్వం: 32 + ప్రైవేట్: 81)

కోవిడ్-19 కి సంబంధించి కచ్చితమైన, తాజా సమాచారం కోసం, సాంకేతిక పరమైన సమస్యలు, మార్గదర్శకాలు, సలహాల కోసం  https://www.mohfw.gov.in/ and @MoHFW_INDIA. అనే వెబ్ సైట్ ను తరుచు వీక్షించండి. 

సాంకేతికపరమైన సమస్యల పరిష్కారానికి technicalquery.covid19[at]gov[dot]in మెయిల్ పంపవచ్చు. ఇతర సమస్యల కోసం ncov2019[at]gov[dot]in  @CovidIndiaSeva ని చేరుకోవచ్చు. 

హెల్ప్ లైన్ నెంబర్ :  +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ). 

కోవిడ్-19 పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వివరాల కోసం వీక్షించాల్సిన వెబ్ సైట్ :  https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf.

****


(Release ID: 1645405) Visitor Counter : 238