హోం మంత్రిత్వ శాఖ

"యూనియన్‌ హోం మినిస్టర్స్‌ మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్", 2020

Posted On: 12 AUG 2020 12:31PM by PIB Hyderabad

2020వ సంవత్సరానికి, "యూనియన్‌ హోం మినిస్టర్స్‌ మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్" పురస్కారాలను 121 మంది పోలీసు సిబ్బందికి ప్రదానం చేశారు. నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రమాణాలను ప్రోత్సహించేందుకు, అత్యుత్తమ పరిశోధన చేసిన పోలీసులను జాతీయ స్థాయిలో గుర్తించేందుకు ఈ అవార్డును 2018లో ఏర్పాటు చేశారు. 

    పురస్కారాలు స్వీకరించినవారిలో.., సీబీఐ నుంచి 15 మంది, మహారాష్ట్ర పోలీసులు 10 మంది, మధ్యప్రదేశ్‌ పోలీసులు 10 మంది, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు 8 మంది, కేరళ పోలీసులు ఏడుగురు, పశ్చిమ బెంగాల్‌ పోలీసులు ఏడుగురు ఉన్నారు. మిగిలినవారు మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు. ఈ 121 మందిలో 21 మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు.

అవార్డులు అందుకున్నవారి జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 

***


(Release ID: 1645290)