ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోలుకున్నవారు 16 లక్షలు, కోలుకున్నవారి శాతం దాదాపు 70 పాజిటివ్ లలో మరణాలు 2% లోపే
Posted On:
11 AUG 2020 2:03PM by PIB Hyderabad
సమర్థవంతమైన నిరోధక చర్యలు, సమగ్రంగా పరీక్షల సంఖ్య బాగా పెంచటం, ప్రామాణికమైన చికిత్సా పద్ధతులు విజయవంతంగా అమలు చేయటం వల్ల కోవిడ్ బాధితులలో కోలుకున్నవారి శాతం ఈరోజుకు దాదాపు 70% కు చేరింది. ఇలా ఎక్కువమంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతూనో ఇళ్లలో ఐసొలేషన్ నుంచి బయటికి రావటమో జరుగుతూ ఉండటంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 15,83,489 కు చేరింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకున్నవారే 47,746 మంది నమోదయ్యారు.
ప్రస్తుతం కరోనా వైరస్ సోకి చికిత్సలో ఉన్నవారి సంఖ్య 6,39,929 గా నమోదైంది. అంటే, మొత్తం పాజిటివ్ నిర్థారణ అయినవారిలో 28.21% మాత్రమే. వీళ్ళందరికీ చికిత్స జరుగుతోంది. అలా కోలుకున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారికీ, డిశ్చార్జ్ అయినవారికీ మధ్య అంతరం బాగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఆ అంతరం దాదాపు 9.5 లక్షలకు చేరింది. " పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు " అనే త్రిముఖ వ్యూహం ఫలితంగా ఆశించిన ఫలితాలు అందుతున్నాయి. చికిత్సలో ఉన్నవారి కంటే కోలుకున్నవారి శాతం ఎక్కువగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం.
ఆస్పత్రులలో ప్రామాణిక చికిత్సావిధానాల మీద దృష్టి కేంద్రీకరించటం, సకాలంలో చికిత్స అందేలా చూడటానికి ఆంబులెన్స్ ల సేవలు సద్వినియోగం చేసుకుంటూ బాధితుల తరలింపు, చికిత్స ఫలితంగా కోలుకునేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. పాజిటివ్ గా తేలినవారిలో మరణాల సంఖ్య కూడా బాగా తగ్గుముఖం పట్టింది. ప్రపంచ సగటు కంటే బాగా తగ్గుతూ 2 శాతానికి దిగువన ఈరోజు 1.99% గా నమోదైంది.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
***
(Release ID: 1645036)
Visitor Counter : 311
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil