పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
మనుషులకు-ఏనుగులకు మధ్య ఘర్షణను నివారించేందుకు గట్టి, శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్
ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్బంగా , మనుషులు-ఏనుగుల ఘర్షణ నియంత్రణ పద్ధతులపై అత్యుత్తమ విధానాల సంకలనం విడుదల
Posted On:
10 AUG 2020 3:34PM by PIB Hyderabad
“మనుషులకు- జంతువులు మధ్య పెరుగుతున్న ఘర్షణను నివారించేందుకు జంతువులకు అడవులలోనే ఆహారం, నీటిని అందించే కృషి పెద్దఎత్తున సాగుతున్నద”ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈమాటలన్నారు. అటవీ సిబ్బంది సామర్ధ్యాల పెంపు, శిక్షణ అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు.
“మనుషులకు, జంతువులకు మధ్య ఘర్షణను నియంత్రించడానికి, అటు మనుషులు, ఇటు ఏనుగుల విలువైన ప్రాణాలు కోల్పోకుండా చూడడానికి మనుషులు, ఏనుగులు కలసి జీవించే పరిస్థితులను పటిష్టం చేయడం ముఖ్యం” అని ప్రకాష్ జవడేకర్ అన్నారు. భారతదేశంలో మానవులు- ఏనుగుల ఘర్షణను నియంత్రించేందుకు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలపై పుస్తకాన్నివిడుదల చేస్తూ ఆయన ఈ మాటలన్నారు.
ఈ పుస్తకంలో ఎలిఫెంట్ రేంజ్‌కలిగిన రాష్ట్రాలు కనిపెట్టి విజయవంతంగా చేపట్టిన వివిధ యాజమాన్య పద్ధతులను సచిత్ర రూపంలో ఈ బుక్‌లెట్‌లో పొందుపరిచారు. ఇది మనుషులు- ఏనుగుల మధ్య ఘర్షణను నిలువరించేందుకు ప్రత్యేక నివారణా చర్యలకింద చేపట్టడానికి అనువైన అత్యుత్తమ విధానాలకు ఒక రెఫరెన్సు మాన్యువల్‌గా ఈ పుస్తకం పనికి వస్తుంది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ శాఖ సహాయ మంత్రి శ్రీ బాబుల్ సుప్రియో, దేశంలో ఏనుగుల సంఖ్య పెరుగుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఏనుగులను రక్షించాలని, ఏనుగులు-మనుషుల ఘర్షణ సమస్యను గట్టిగాఎదుర్కోవాలని చెప్పారు. అమాయక జంతువులను చంపడాన్ని ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని, మనుషులు- ఏనుగుల ఘర్షణను నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్నదని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీ ప్రకాష్ జవడేకర్, శ్రీ సుప్రియో లు, పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులతో కలిసి, మనుషులు- ఏనుగుల ఘర్షణపై ఒక పోర్టల్ బీటా వర్షన్‌ను ప్రారంభించారు.మనుషులు- ఏనుగుల ఘర్షణకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకు రూపొందించిన పోర్టల్ సురక్ష్య ఉపకరించనుంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు ఈ ఘర్షణను నివారించేందుకు చర్యలు తీసుకుంటారు. డాటా కలక్షన్ ప్రోటోకాల్స్ రూపొందించడానికి, డాటా ట్రాన్స్‌మిషన్ కు, డాటా విజువలైజేషన్ ఉపకరణాలు రూపొందించడానికి , ఏనుగులు - మనుషుల ఘర్షణను నిలువరించేందుకు తీసుకోవలసిన విధానపరమైన నిర్ణయాల రూపకల్పనకు, పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైన కార్యాచరణకు ఇది ఉపయోగపడనుంది. ప్రస్తుతం పోర్టల్ బీటా వర్షన్ , డాటా టెస్టింగ్‌కు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దీనిని దేశవ్యాప్తంగా తీసుకురానున్నారు. ఈ సంవత్సరం ఆఖరుకు దీనిని తీసుకువస్తారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రతిసంవత్సరం ఆగస్టు 12న జరుపుకునే అంతర్జాతీయ కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణ, వాటిని కాపాడే ఉద్దేశంతో దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవ లక్ష్యం, ఏనుగుల సంరక్షణపై ప్రజలలో అవగాహన పెంచడంతోపాటు, అడవులలో, బందీగా ఉన్న ఏనుగుల సంరక్షణకు మరింత మెరుగైన చర్యలు తీసుకోవడానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికి ఇది వీలు కలిగిస్తుంది.
ముప్పు కలిగిన జీవులకు సంబంధించి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్‌లొ , ఆసియాలోని ఏనుగులు, అంతరిస్తున్న జంతువుల జాబితా కింద ఉన్నాయి. ఇండియా మినహా చాలావరకు ఎలిఫెంట్ రేంజ్ దేశాల విషయంలో ఏనుగుల సంఖ్య బాగా తగ్గి పోయింది వాటి ఆవాసం తరిగి పోవడం, అక్రమ రవాణా కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా 50,000-60,000 వరకు ఏసియన్ ఏనుగులు ఉన్నట్టు అంచనా. ఇందులో 60 శాతం పైగా ఏనుగులు ఇండియాలోనే ఉన్నాయి.
2020 ఫిబ్రవరిలో గుజరాత్ లోని గాంధీనగర్‌లొ ముగిసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సిఎంఎస్ 13 సదస్సులో భారతీయ ఏనుగులను ,అపెండిక్స్-1 జాబితా కింద చేర్చారు. ఏనుగు భారతదేశపు సహజ వారసత్వ జంతువు. ఏనుగుల సంరక్షణకు సంబంధించి అవగాహన పెంచేందుకు ఏనుగుల దినోత్సవాన్ని భారతదేశం కూడా జరుపుకుంటోంది.
పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి , డిజి,ఫారెస్ట్, డాక్టర్ సంజయ్ కుమార్, ఏడిజి వైల్డ్‌లైఫ్ శ్రీ సౌమిత్ర దాస్‌గుప్త, ఐజిఎఫ్, డైరక్టర్‌ప్రాజెక్ట్ ఎలిఫెండ్ శ్రీ నోయల్ థామస్, పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ కు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. రాష్ట్రాల అటవీ శాఖలు, ఇతర స్టేక్ హోల్డర్ ఆర్గనైజేషన్లు ఈ వర్చువల్ కార్యక్రమంలొ పాల్గొన్నారు.
మానవులు, ఏనుగుల ఘర్షణను ఎదుర్కోవడంలో ఇండియా అనుసరిస్తున్న అత్యుత్తమ పద్ధతుల కొసం ఇక్కడ క్లిక్ చేయండి..
***
(Release ID: 1644891)
Visitor Counter : 393