రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఎరువుల రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు
పలు చర్యలు తీసుకున్న ఎన్.డి.ఎ ప్రభుత్వం: శ్రీడి.వి.సదానంద గౌడ
Posted On:
10 AUG 2020 10:25AM by PIB Hyderabad
రైతులకు సేవలు అందిస్తూ, ఎరువుల రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్.డి.ఎ ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ తెలిపారు. వ్యవసాయోత్పత్తిని నిలబెట్టడానికి, పోషక ఎరువులను సమర్ధంగా వినియోగించడంపై రైతులకు అవగాహన కలిగించేందుకు, ఎరువుల వినియోగం విషయంలొ వచ్చిన కొత్త పరిణామాలను రైతులకు తెలియజేసేందుకు ఎరువుల విభాగం, వ్యవసాయ సహకార, రైతు సంక్షేమం, వ్యవసాయ పరిశోధన అభివృద్ధి , విద్య విభాగాలు సంయుక్తంగా ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు.

ఎరువులు , ఎరువుల సాంకేతికత విషయంలో పరిశోధనలను , నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, ఎరువుల విభాగం కింద ఉన్న సిపిఎస్ఇలు ప్రత్యేకంగా ఒక మేధోమథన వ్యవస్థ “ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫర్టిలైజర్ , ఫర్టిలైజర్ టెక్నాలజీ రీసెర్చి (ఐసిఎఫ్ఎఫ్‌టిఆర్)” ను ఏర్పాటు చేశాయన్నారు. ఈ కౌన్సిల్‌ను సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 1860 కింద 2019 ఆగస్టు 19 న రిజిస్టర్ చేశారు. ఈ కౌన్సిల్ ఎరువుల రంగంలో పరిశోధన, అభివృద్ధిని చేపడుతుంది, ప్రోత్సహిస్తుంది. అలాగే ఎరువుల రంగంలో , ఎరువుల తయారీ సాంకేతిక పరిజ్ఞానంలో , ముడి సరుకు ఉపయోగంలో, ఉత్పత్తుల ఆవిష్కరణలో,వివిధ సంస్థల భాగస్వామ్యం, పరిశోధన సంస్థల సహకారంతో, ఎరువుల పరిశ్రమ, ఇతర సంబంధిత పక్షాలతో కలిసి పరిశోధన , అభివృద్ధిని చేపడుతుంది. ఇప్పటి వరకు జనరల్ కౌన్సిల్ రెండు సమావేశాలు నిర్వహించింది. ఎక్జిక్యుటివ్ కౌన్సిల్ మూడు సమావేశాలు నిర్వహించింది.

****
.
(Release ID: 1644764)
Visitor Counter : 219