వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతుల సంక్షేమం కోసం ఆత్మనిర్భర్ భారత్ పథకం/కృషి క్రింద వివిధ కార్యక్రమాలను చేపట్టనున్న వ్యవసాయ యాంత్రీకరణ మరియు సాంకేతిక విభాగాలు

2020-21 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యవసాయ యాంత్రీకరణ కోసం రు.553 కోట్లు మరియు వరి గడ్డిని మండించడాన్ని నివారించేందు కోసం వ్యవసాయ వ్యర్థాల యాజమాన్య పథకం క్రింద రు.548.20 కోట్ల మంజూరు

వివిధ భాషల్లో “సిహెచ్సి-ఫాం మెషినరీ” అనే మొబైల్ ఆప్ అభివృద్ధి; వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాల నిరంతరాయ సరఫరా కోసం వివిధ ఏర్పాట్లు మరియు కోవిడ్ -19 లాక్డౌన్ సందర్భంగా వ్యవసాయ కూలీల వలస ప్రభావాన్ని నివారించేందుకు చర్యలు

Posted On: 08 AUG 2020 1:02PM by PIB Hyderabad

వ్యవసాయ రంగంలో  సుస్థిరంగా ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన వ్యసాయ పనిముట్లు మరియు వ్యవసాయ సంబంధిత అవసరాలను సమయానుకూలంగా అందించడం వలన నష్టాలను తగ్గించడంతోపాటు ఖరీదైన వ్యసాయ అవసరాల యాజమాన్యానికి వ్యవసాయ యాంత్రీకరణ కీలకమైన అంశం. వ్యవసాయ యాంత్రీకరణ వలన సహజ వనరులను  మరింత సమర్థంగా వినియోగించుకుంటూ ఉత్పాదకతను పెంచడం మరియు వ్యవసాయంలో ఉన్న కష్టమైన పనులను తగ్గించడం చేయవచ్చు. #ఆత్మనిర్భర్ కృషి  అనే హ్యాష్ ట్యాగ్ క్రింద కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ యాంత్రీకరణ మరియు సాంకేతిక విభాగం వారు తీసుకున్న చర్యలు:

దేశంలో వ్యవసాయ యాంత్రీకరణను మరింత ప్రోత్సహించడానికి  వ్యవసాయ యాంత్రీకరణ ఉప-లక్ష్యం(సబ్-మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్)(ఎస్ఎంఏఎం)  క్రింద ప్రభుత్వం 2014 ఏప్రిల్ నుండి వివిధ కార్యక్రమాలను చేపట్టింది. ఈ పథకానికి కేంద్రం 2020-21 బడ్జెట్లో రు.1033 కోట్లు కేటాయించగా అందులో రు.553 కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు మంజూరు చేసింది.

ఉత్తర భారతంలో వరి గడ్డిని మండించడం  ఆ ప్రాంతంలో తీవ్ర పర్యావరణ కాలుష్యానికి కారణమవుతోంది.  హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల్లో వరి పంట కోత అనంతరం రబి సాగుకు మధ్య వ్యవధి చాలా తక్కువగా(2-3 వారాలు) మాత్రమే ఉండడం వలన ఆ ప్రాంత రైతులు వరి గడ్డిని తగలబెట్టి పంట క్షేత్రాలను తదుపరి పంటకు తయారు చేసుకుంటారు.  ఈ ప్రాంత రైతులను వరి గడ్డిని మండించడకుండా నివారించేందుకు  కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వారు 2018లో వ్యవసాయ వ్యర్థాల యాజమాన్యం(సిఆర్ఎం)ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ యంత్రాల అద్దెకు ఇచ్చే కేంద్రాల(సిహెచ్సి)ను ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో రైతులు ఈ యంత్రాలను సామూహికంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తీసుకునేందుకు రాయితీ ఇవ్వబడుతుంది.. 2018-19 & 2019-20 సంవత్సరాలకు గాను పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ మరియు భారత రాజధాని ప్రాంతాలకు రు.1178.47 కోట్లు మంజూరు చేయబడ్డాయి.  2020-21 సంవత్సరంలో వ్యవసాయ కార్యక్రమాలను సరైన సమయంలో చేపట్టేందుకు వీలుగా బడ్జెట్లో రు.600 కోట్లు కేటాయించగా అందులో రు.548.20 కోట్లు విడుదల చేయబడ్డాయి.

రైతుల స్వగ్రామాల్లో వారికి వ్యవసాయ యంత్రాలను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ యంత్రాల అద్దె సేవా కేంద్రలను ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా వివిధ భాషల్లో పనిచేసే మొబైల్ ఆప్ సిహెచ్సి-ఫాం మెషిరీని అభివృద్ధి చేసింది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ. ఖరీదైన వ్యవసాయ యంత్రాల కొనుగోలు చేయలేని చిన్న మరియు సన్నకారు రైతులకు బాడుగకు అందించేందు కొరకు ఈ ఆప్ అభివృద్ధి చేయబడింది. ఈ ఆప్ ను మరింత అభివృద్ధి చేసి ఫామ్స్-ఆప్ (ఫాం మెషినరీ సొల్యూషన్స్-ఆప్) వ్యవసాయ యంత్రాల పరిష్కార-ఆప్ గా మార్చబడింది. ఇది రైతులకు మరింత సహాయకారి  మరియు దీని పరిధి కూడా విస్తృతంచేయబడింది.

విశ్వమహమ్మారి కోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా అదే విధంగా భారత దేశ రైతాంగాన్ని కూడా అతలాకుతలం చేసింది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వ్యవసాయ రంగాన్ని మరియు వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలను చేర్చడాని కొవిడ్-19 మూలంగా విధించిన లాక్డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఫలితంగా వ్యసాయ కూలీలందరూ తమ తమ స్వస్థలాలకు పయనమవ్వడం వలన కూలీల కొరత తీవ్రతరమైంది. ఈ  కొరతను అధిగమించేందుకు మరియు రబీలో అదనులో వ్యవసాయ పనులు చేపట్టేందుకు వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలను అతరాయం లేకుండా అందించబడుతాయి. అందుకొరకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వారు కేంద్ర హోం శాఖ, భారత ప్రభుత్వం వారి సమన్వయంతో వ్యవసాయ యంత్రాల రంగంలోని కార్యక్రమాలకు  ఈ క్రింది సడలింపులను చేపట్టింది.  

·         లాక్డౌన్ సమయంలో రైతులు మరియు రైతు కూలీలు  వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులను చేసుకునేందుకు అనుకూలంగా మార్గదర్శకాలు.

·         వ్యవసాయ యంత్రాలకు సంబంధించి కస్టం హైరింగ్ కేంద్రాల(సిహెచ్సి)ల కార్యక్రమాల నిర్వహణకు సడలింపులు.

·         వ్యవసాయ యంత్రాలు మరియు వాటి విడిభాగాల దుకాణాలు(సరఫరా చేయు దుకాణాలు కూడా) మరియు వాటిని బాగు చేయు దుకాణాలు తెరచి ఉంచేందుకు అనుమతి.

·         వ్యవసాయ/ఉద్యానవన సంబంధిత పంటలను కోయడానికి మరియు విత్తుకోవడానికి వరికోత యంత్రాలు మరియు ఇతర యంత్రాలను అంతర్రాష్ట్రీయంగా  మరియు రాష్ట్రంలోపల తరలించుకునేందుకు సడలింపు ఇవ్వబడింది.

·         ప్రభుత్వ రాయితీ కార్యక్రమం క్రింద పరీక్ష సంబంధిత కార్యక్రమాలు అనగా పరీక్ష నమూనాల ఎంపిక, పరీక్ష ఫలితాల తేదీ ముగిసిన అనంతరం తదుపరి పరీక్షల నిర్వహణ, సిఎంవిఆర్, సిఓపి  తాజా సమాచారాన్ని పొందుపరచడం మరియు  ఆమోదించిన ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, కంబైన్ హార్వెస్టర్లు మరయు ఇతర సెల్ఫె-ప్రొపెల్డ్ వ్యవసాయ పనిముట్లకు 31.12.2020 తేదీ వరకు సడలింపు. సవరించిన బిఐఎస్ ప్రామాణికత ఐఎస్ 12207-2019 ప్రకారం ట్రాక్టర్ల పరీక్ష మరియు 51 రకాల వ్యవసాయ పనిముట్లు మరియు క్రొత్త సాంకేతికతో తయారైన ప్రత్యేక పరికరాలకు తరువాత చెల్లించేందుకు అవసరమైన అమలు కార్యక్రమాలను 31.12.2020 వరకు సడలింపు.

·         లాక్డౌన్ విధింపు  మరియు క్వారెంటైన్ చర్యల కారణంగా జిల్లాలు మరియు రాష్ట్ర సరిహద్దులను మూసివేయడం వలన  కంబైన్ హార్వెస్టర్ మరియు ఇతర వ్యవసాయ యంత్రాల తరలిపుకు అవరోధం ఏర్పడింది. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వారి ఎం&టి విభాగం వారి సమయానుకూల చర్యల వలన మరియు రాష్ట్ర నోడల్ అధికారులు, జిల్లా పరిపాలనాధికారులు మరియు వ్యవసాయ యంత్రాల తయారీదారుల సమన్వయంతో వ్యవసాయ యంత్రాలను స్వేచ్ఛగా తరలించుటకు అవకాశం కలిగింది.

పనిని వెతుక్కుంటూ వివిధ పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లిన వలస కూలీలపై విశ్వమహమ్మారి కొవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉంది. వీరందరూ  లాక్డౌన్ కారణంగా భారీగా తమ స్వగ్రామాలకు తరలి వెళ్ళిపోయారు. వీరి జీవనం కొరకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వీరి సహాయార్థం వారికి ఉపాధి కల్పించేందు వారి వారి స్వస్థలాల్లో వ్యవసాయ యంత్రాలను నడిపేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాన్ని  ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్/కృషి క్రింద చేపట్టింది. ఇందులో భాగంగా  మధ్య ప్రదేశ్లోని బుండి మరియు హర్యానాలోని హిసార్లో వ్యవసాయ యంత్రాల శిక్షణ మరియు పరీక్ష సంస్థల(ఎఫ్ఎంటిటిఐలు) ద్వారా 8 రకాల గుర్తించిన పనులకు అర్హత ఆధారంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. మధ్య ప్రదేశ్ బుండిలోని సిఎఫ్ఎంటిటిఐలో 56 మంది శిక్షణార్థులతో ఇప్పటికే ఈ శిక్షణ కార్యక్రమం మొదలైంది, కాగా 68 మంది శిక్షణార్థులు రాజస్థాన్లో మరియు ఉత్తర్ ప్రదేశ్ హిసార్లోని ఎన్ఆర్ఎఫ్ఎంటిటిఐలో కూడా శిక్షణ పొందుతున్నారు. సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్(ఎస్ఎంఏఎం)ల ద్వారా వలస కూలీలకు అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను ఏర్పరచి వాటిని సంస్థాగతం చేయడం ఎంతో కీలకమైన కార్యక్రమం. ఈ మార్గదర్శకాల వివరాలు http://farmech.dac.gov.in/ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి.

 

***



(Release ID: 1644426) Visitor Counter : 367