ప్రధాన మంత్రి కార్యాలయం
ఇడుక్కి లోని రాజమాలై లో కొండచరియలు విరిగిపడ్డ కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి; బాధితుల కు అనుగ్రహపూర్వక చెల్లింపు ను ప్రకటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 AUG 2020 7:30PM by PIB Hyderabad
ఇడుక్కి లోని రాజమాలై లో కొండచరియలు విరిగిపడటం తో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తంచేశారు. ‘‘ఇడుక్కి లోని రాజమాలై లో ఒక కొండచరియ విరిగిపడ్డ కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం బాధపెట్టింది. ఈ దు:ఖ ఘడియలో, నేను ఆప్తుల ను కోల్పోయిన వారి యొక్క శోకం లో పాలుపంచుకొంటున్నాను. క్షతగాత్రులు శీఘ్రం గా కోలుకొందురుగాక. పాలనయంత్రాంగం మరియు ఎన్ డిఆర్ఎఫ్ ఘటన స్థలం లో అవసరమైన విధుల ను నిర్వర్తిస్తూ, బాధితుల కు సహాయాన్ని అందిస్తున్నాయి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
కొండచరియలు విరిగిపడ్డ కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వారి యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి తలా 2 లక్షల రూపాయల వంతున మరియు గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున అనుగ్రహపూర్వక చెల్లింపు సంగతి ని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
***
(रिलीज़ आईडी: 1644329)
आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam