ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రికవరీ రేటు దాదాపు 68 శాతం కొత్త గరిష్ట స్థాయిని చేరుకుంది

కేసు మరణాల రేటు (సి.ఎఫ్.ఆర్) క్రమంగా తగ్గుతూ, ఈ రోజు 2.05 శాతం వద్ద నిలిచింది.

Posted On: 07 AUG 2020 12:20PM by PIB Hyderabad

కోవిడ్-19 నిర్వహణ మార్గంలో భారతదేశం రెండు ముఖ్యమైన విజయాలు సాధిస్తూ కొనసాగుతోంది. ఒకటి, కోవిడ్-19 చికిత్స పొందుతున్న రోగులలో రికవరీ రేటు నిరంతరం పెరుగుతోంది. రెండవది, కేసు మరణాల రేటు, ప్రపంచ సగటు కంటే చాలా తక్కువగా నమోదౌతోంది.  కోవిడ్-19 చికిత్స పొందుతున్న రోగులలో రికవరీ రేటు అత్యధికంగా 68 శాతానికి చేరుకోగా, కేసు మరణాల రేటు అత్యల్పంగా 2.05 శాతానికి తగ్గింది.   భారతదేశంలో కోలుకున్న రోగుల సంఖ్య మరియు చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య మధ్య వ్యత్యాసం మరింత ఎక్కువగా అంటే 7.7 లక్షలకు పైగా పెరగడానికి ఈ రెండు సమిష్టిగా దోహదం చేశాయి. 

గత 24 గంటల్లో, 49,769 మంది రోగులు కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 13,78,105 కి పెరిగింది. 

 

recovered.jpg

కేంద్రం జారీ చేసిన వైద్య చికిత్స విధి విధానాలలో పొందుపరిచిన ప్రామాణిక సంరక్షణ ద్వారా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలతో పాటు ఆసుపత్రిలో చేరిన రోగులకు సమర్థవంతమైన చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వడంతో, రికవరీ రేటులో మెరుగుదలను సమర్థవంతంగా నిర్ధారించింది.  గడచిన 2 వారాల్లో, సగటున కోలుకున్న కేసులు (7 రోజుల సరాసరి) సుమారు 26,000 కేసుల నుండి 44,000 కేసులకు పెరిగాయి.

active.jpg

కేంద్రీకృత మరియు సమన్వయ నియంత్రణ ద్వారా కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల నిరంతర ప్రయత్నాలు,  భారీ సంఖ్యలో పరీక్షలతో పాటు పర్యవేక్షణతో కూడిన ఐసోలేషన్,  సమర్థవంతమైన చికిత్స వంటి చర్యలు, చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య గణనీయంగా తగ్గడానికీ, చికిత్స అనంతరం కోలుకున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరగడానికీ, దోహదపడ్డాయి. 

 

daily rise.jpg

రోజువారీ కొత్తగా కోలుకుంటున్న రోగుల సంఖ్యలో కూడా గణనీయమైన, నిరంతర పెరుగుదల నమోదౌతోంది. 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలు,

సలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం

 వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

 https://www.mohfw.gov.in/   మరియు  @MoHFW_INDIA.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను

దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు 

 technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న

 మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  

 ncov2019[at]gov[dot]in   మరియు   @CovidIndiaSeva .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనా,

ఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన 

ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  

లేదా  1075  టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు. 

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన

కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి :

 https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

 

****



(Release ID: 1644044) Visitor Counter : 214