సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఈనెల 7వ తేదీ నుంచి తొలి ఆన్‌లైన్‌ దేశభక్తి చిత్రోత్సవం

Posted On: 06 AUG 2020 6:06PM by PIB Hyderabad

జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ), తొలిసారిగా ఆన్‌లైన్‌లో దేశభక్తి చిత్రోత్సవం నిర్వహిస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవాల్లో ఈ చిత్రోత్సవం
ఒక భాగం. ఇది ఈనెల 7వ తేదీన ప్రారంభమై, 21వ తేదీ వరకు సాగుతుంది. స్వాతంత్ర్య సమరయోధుల ధీరోదాత్త గాథలను ఈ చిత్రోత్సవం ప్రదర్శిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల్లో పండుగ, దేశభక్తి భావాన్ని పెంచడం దీని లక్ష్యం.

www.cinemasofindia.com వెబ్‌సైట్‌లో అధిక నాణ్యత గల చిత్రాలను ప్రతిరోజూ ప్రదర్శిస్తారు. ఉచితంగా చూడవచ్చు.

 

 

హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, బెంగాలీ, గుజరాతీ, మళయాళంలో విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను ప్రదర్శిస్తారు. జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ), నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఐఐ), చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియా (సిఎఫ్‌ఎస్‌ఐ), ఫిల్మ్స్ డివిజన్‌ సేకరణల్లోని చిత్రాలను ప్రదర్శిస్తారు.

సర్ రిచర్డ్ అటెన్‌బరో చేతుల్లో రూపుదిద్దుకున్న 'గాంధీ' (1982) చిత్రం తొలిసారిగా ప్రదర్శితమవుతోంది. దృష్టి, వినికిడి లోపాలు ఉన్నవారు కూడా ఆనందించవచ్చు.

ఈ చిత్రాల లింకులను, ఎంఐబీ వెబ్‌సైట్‌ mib.gov.in లో, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, మైగవ్‌ కు చెందిన సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచుతారు. విదేశాల్లోని భారత కార్యాలయాలకు పంపేందుకు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా ఈ లింకులను షేర్‌ చేస్తారు.

చిత్రోత్సవంలో ప్రదర్శించే చిత్రాలు:

Independence Day Film Festival 2020 - Film List

Sl.No.

Name of the Film

Language

Year

Director

1

Gandhi (Accessible)

Hindi

1982

Sir Richard Attenborough

2

Gandhi

Hindi

1982

Sir Richard Attenborough

3

Chittagong

Hindi

2012

Bedabrata Pain

4

The Legend Of Bhagat Singh

Hindi

2002

RajkumarSantoshi

5

Tango Charlie

Hindi

2005

Mani Shankar

6

Khakhee

Hindi

2004

RajkumarSantoshi

7

Gandhi Se Mahatma Tak

Hindi

1996

ShyamBenegal

8

Qayamat – City Under Threat

Hindi

2003

Harry Baweja

9

Batallion 609

Hindi

2019

BrijeshBatuknathTripathi

10

PehlaAadmi

Hindi

1950

Bimal Roy

11

Life of Netaji Subhash Chandra Bose

Hindi

2004

Live Footage/NFAI

12

Bapu Ne KahaTha (Gandhiji’s Saying)

Hindi

1962

Vijay Bhatt

13

AbhiKal Hi Ki Baat Hai (Not So Long Ago)

Hindi

1970

Clement Baptista

14

HedaHoda (The Blind Camel)

Hindi

2003

Vinod Ganatra

15

ChotaSipahi (The Little Soldier)

Hindi/English

2004

JayshreeKanal& A S Kanal

16

The Making of the Mahatma

English

1996

ShyamBenegal

17

VeeraPandiyaKattabomman

Tamil

1959

B. RamakrishnaiahPanthulu

18

Roja

Tamil

1992

Mani Ratnam

19

Andhra Kesari

Tamil

1983

Vijaychander

20

1971- Beyond Borders

Malayalam

2017

Major Ravi

21

VandaeMaatharam

Malayalam

2010

T. Aravind

22

Uttarayanam

Malayalam

1974

G.Aravindan

23

UdayerPathey (Towards the Light)

Bengali

1944

Bimal Roy

24

42/Forty-two/Biyallish

Bengali

1949

Hemen Gupta

25

Subhash Chandra

Bengali

1966

Piyush Bose

26

HagaluVesha

Kannada

2000

Baraguru
Ramachandrappa

27

Harun Arun

Gujarati

2009

Vinod Ganatra

28

Senani Sane Guruji

Marathi

1995

Ramesh Deo

29

Spread The Light of Freedom (HarDil Main JagayenRashtraJyot)

Musical

1996

<span style="box-sizing:bor

 

 

***



(Release ID: 1643897) Visitor Counter : 116