ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వరుసగా రెండో రోజు, గడచిన 24 గంటలలో దేశంలో 6 లక్షలకుపైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు
మొత్తంగా 2.14 కోట్లకుపైగా నమూనాల పరీక్ష
ప్రతి మిలియన్ (టిపిఎం)కు పరీక్షలు 15568 కి పెంపు
Posted On:
05 AUG 2020 3:43PM by PIB Hyderabad
మన దేశం ఈరోజు రెండో రోజు కూడా 6 లక్షలకు పైగా కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షల నిర్వహణకు సంకల్పం చెప్పుకున్నాయి. కోవిడ్ చికిత్స లేదా హోం ఐసొలేషన్ కోసం ప్రాథమిక దశలో కేసుల గుర్తింపునకు పరీక్షలు నిర్వహించడం మౌలిక చర్యగా ఇవి చేపట్టాయి. దీనితో దేశంలో కోవిడ్ పరీక్షలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా క్రమంగా టెస్టింగ్ నెట్ వర్కును విస్తరించడం జరిగింది. గత 24 గంటలలో 6,19,652 పరీక్షలు నిర్వహించగా , ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 2,14,84,402 కు చేరింది. ప్రతి పదిలక్షలకు జరుగుతున్న పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగి 15,568 కి చేరింది.
సమగ్ర టెస్ట్, ట్రాక్, ట్రీట్ వ్యూహం ప్రకారం , దేశంలో పరీక్షల ల్యాబ్ సదుపాయాల నెట్‌వర్కును నిరంతరం బలోపేతం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1366 లేబరెటరీలు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. . ఇందులో 920 ల్యాబ్‌లు ప్రభుత్వ రంగంలోని వి కాగా 446 ప్రైవేటు రంగంలోనివి. ఇందులో
-రియల్ టైమ్ ఆర్‌టి పిసిఆర్ ఆధారిత టెస్టింగ్ ల్యాబ్‌లు : 696 ( ప్రభుత్వం: 421+ ప్రైవేటు 275)
-ట్రూనాట్ ఆధారిత పరీక్షా లేబరెటరీలు : 561 ( ప్రభుత్వ 467 + ప్రైవేటు 94)
-సిబిఎన్ఎఎటి ఆధారిత పరీక్షా లేబరెటరీలు :109 ( ప్రభుత్వ 32 + ప్రైవేటు 77)
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in ., @CovidIndiaSeva కు పంపవచ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
(Release ID: 1643601)
Visitor Counter : 284
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam