వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

మొత్తం 44.08లక్షల మెట్రిక్ టన్నులు పి.ఎం.జి.కె.ఎ.వై-2 కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకూ అందిన ఆహార ధాన్యాలు

జూలైలో 47.38కోట్లమంది లబ్ధిదారులకు
23.69లక్షల మెట్రిక్ టన్నుల పంపిణీ

Posted On: 04 AUG 2020 9:22PM by PIB Hyderabad

ఆహార ధాన్యాల మొత్తం నిల్వ:

   భారత ఆహార సంస్థ (ఎఫ్.సి..) వద్ద ప్రస్తుతం 759.41 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. ఇందులో 242.87లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 516.54మెట్రిక్ టన్నుల గోధుమలు ఉన్నాయి. 2020 సంవత్సరం ఆగస్టు 3 వెల్లడించిన తన నివేదికలో ఎఫ్.సి.. వివరాలు తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్..), ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పి.ఎం.జి.కె..వై.), ఇతర సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి నెలకు దాదాపు 95లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయి.

   దేశంలో లాక్ డౌన్ అమలులోకి వచ్చినప్పటినుంచి దాదాపు 139.97 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను 4,999 రెయిల్ ర్యాకుల ద్వారా రవాణా చేశారు. 2020 సంవత్సరం జూన్ 30వరకూ  మొత్తం 285.07 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు రవాణా చేయగా, ఈశాన్య రాష్ట్రాలకు 13.89 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు రవాణా అయ్యాయి. జూలై 1నుంచి  47.71లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు 1,704 రైల్ ర్యాకుల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అయ్యాయి. రైలు మార్గం ద్వారానే కాకుండా, రోడ్లు, జలమార్గాలు ద్వారా కూడా ఆహార ధాన్యాల రవాణా జరిగింది. జూలై 1నుంచి మొత్తం 91.02లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రవాణా చేశారు. జూలై 1నుంచి 3.92 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఈశాన్య రాష్ట్రాలకు రవాణా అయ్యాయి.

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన-1

ఆహారధాన్యాలు (బియ్యం/గోధుమలు):

  పి.ఎం.జి.కె..వై-1 కింద 2020 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను మొత్తం 119.5లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయి. ఇందులో 104.3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 15.2లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు ఉన్నాయి. ఇప్పటికే, 101.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 15.01లక్షల మెట్రిక్ టన్నుల గోధులను ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నాయి. అంటే,..మొత్తం 117.08లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నాయి.  2020 ఏప్రిల్ నెలలో 37.43 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు (అంటే 94శాతం ధాన్యాలు) 74.86 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ అయ్యాయి. మే నెలలో మొత్తం 37.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు (94శాతం) 74.82 కోట్ల మందికి పంపిణీ అయ్యాయి. ఇక, జూన్ నెలలో 36.19 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు (91శాతం) 72.38 కోట్ల మందికి పంపిణీ అయ్యాయి. (జూన్ నెలకు సంబంధించిన పంపిణీ ఇంకా కొనసాగుతోంది). మూడు నెలల్లో సగటున 93శాతం ఆహార ధాన్యాల పంపిణీ జరిగింది.

పప్పులు:

   మూడు నెలలకు మొత్తం 5.87లక్షల మెట్రిక్ టన్నుల పప్పులు అవసరం కాగా, ఇప్పటివరకూ, 5.83లక్షల మెట్రిక్ టన్నుల పప్పులను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించారు. 5.80లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరగా, 5.21లక్షల మెట్రిక్ టన్నుల పప్పులను పంపిణీ చేశారు. 2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో 18.74కోట్ల కుటుంబాలకు, మే నెలలో 18.72కోట్ల కుటుంబాలకు, జూన్ నెలలో 14.53కోట్ల కుటుంబాలకు పప్పుల పంపిణీ జరిగింది. (జూన్ నెల పంపిణీ ఇంకా కొనసాగుతోంది) మూడు నెలల్లో సగటున మొత్తం పప్పుల పంపిణీ దాదాపు 89శాతంగా ఉంది.

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన-2: 2020 సంవత్సరం జూలై 1నుంచి         ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన 2 దశ ప్రారంభమైంది. 2020 నవంబర్ వరకూ ఇది కొనసాగుతుంది. కాలంలో మొత్తం 201లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను 81కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 19.4కోట్ల కుటుంబాలకు 12లక్షల మెట్రిక్ టన్నుల శనగ పప్పును పంపిణీ చేస్తారు.

 

ఆహార ధాన్యాలు(బియ్యం/గోధుమలు):

  ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన 2 దశ కింద వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత   ప్రాంతాలకు పంపిణీ చేయడానికి మొత్తం 201.08లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించారు. 2020 జూలైనుంచి నవంబరు వరకూ 5నెలల్లో పంపిణీకి వీటిని కేటాయించారు. వీటిలో 91.14లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 109.94లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయి. వీటిలో మొత్తం 44.08లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తీసుకుని, అందులో 23.80లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పంపిణీ చేశాయి. 2020 జూలై నెలలో మొత్తం 23.69లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను (అంటే 59శాతం) 47.38 కోట్లమంది లబ్ధిదారులకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పంపిణీ చేశాయి. (జూలై నెల పంపిణీ ఇంకా కొనసాగుతోంది). పి.ఎం.జి.కె..వై 2 దశ కింద పంపిణీకి సంబంధించి వందశాతం ఆర్థిక భారాన్ని,.. అంటే దాదాపు76,062 కోట్ల రూపాయల భారాన్ని భారత ప్రభుత్వమే భరిస్తోందినాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గోధుమలను, 15రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలకు బియ్యాన్నిమిగిలిన 17రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు బియ్యం, గోధుమలను కేటాయించారు.

 

శనగపప్పు:

  రాబోయే 5 నెలల్లో పంపిణీకి మొత్తం 12లక్షల మెట్రిక్ టన్నుల శనగపప్పు అవసరమవుతుంది. మొత్తం 1.09లక్షల మెట్రిక్ టన్నుల శనగపప్పును పంపించగా, అందులో 50,576మెట్రిక్ టన్నుల శనగ పప్పు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చేరింది. పంపిణీకి సంబంధించిన వందశాతం ఆర్థిక భారాన్ని అంటే,..దాదాపు 6,849కోట్ల రూపాయల భారాన్ని భారత ప్రభుత్వమే భరిస్తోంది. ఆగస్టు 3 తేదీ సమాచారం ప్రకారం మొత్తం 10.28లక్షల మెట్రిక్ టన్నుల పప్పుల నిల్వ అందుబాటులో ఉంది. ఇందులో 5.84లక్షల మెట్రిక్ టన్నుల కంది పప్పు, 1.13లక్షల మెట్రిక్ టన్నుల పెసరప్పు, 2.12లక్షల మెట్రిక్ టన్నుల మినప్పప్పు, 1.28లక్షల మెట్రిక్ టన్నుల శనగ పప్పు, 27వేల టన్నుల మెట్రిక్ టన్నుల ఎర్ర కందిపప్పు ఉన్నాయి. మద్దతు ధర పథకం (పి.ఎస్.ఎస్.) కింద  దాదాపు 21.55లక్షల మెట్రిక్ టన్నుల శనగపప్పు, ధరల స్థిరీకరణ నిధి (పి.ఎస్.ఎఫ్) కింద దాదాపు 1.28లక్షల మెట్రిక్ టన్నుల శనగపప్పు నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

 

వలస కూలీలకు ఆహార ధాన్యాల పంపిణీ: (ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ)

  ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కింద 8లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 8కోట్ల మంది వలస కూలీలకు, జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి, ఆయా రాష్ట్రాల ప్రజా పంపిణీ పథకం కార్డుల పరిధిలోకి రానివారికి ప్యాకేజీ కింద ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. వలస కూలీలందరికీ ఒక్కొక్కరికి 5కిలో గ్రాముల చొప్పున ఆహార ధాన్యాలను మే, జూన్ నెలలకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 6.39లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తీసుకున్నాయి. 2.46లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు పంపిణీ చేశాయి. మే నెలలో 2.42లక్షల మెట్రిక్ టన్నులు, జూన్ నెలలో 2.51లక్షల మెట్రిక్ టన్నులు లబ్ధిదారులకు పంపిణీ అయ్యాయి

  39వేల మెట్రిక్ టన్నుల శనగపప్పును కోటీ 96లక్షల మంది వలస కూలీలకు పంపిణీ చేయడానికి కూడా భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన దాదాపు 8కోట్ల మంది వలస కూలీలకు, జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి, లేదా ఆయా రాష్ట్రాల ప్రజాపంపిణీ పథకం కార్డుల పరిధిలోకి రాని కుటుంబాలకు మే, జూన్ నెలలకు గాను కిలో గ్రాము చొప్పున పప్పులు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు పప్పుల పంపిణీ జరుగుతోంది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు దాదా 33,745మెట్రిక్ టన్నుల శనగపప్పును పంపించారు, మొత్తం 33,388 మెట్రిక్ టన్నుల శనగ పప్పును వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నాయి. 5,526 మెట్రిక్ టన్నుల శనగ పప్పును రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపిణీ చేశాయి.

  పథకం కింద పంపిణీకి సంబంధించి వంద శాతం ఆర్థిక భారాన్ని భారత ప్రభుత్వమే భరిస్తోందిఅంటే ఆహార ధాన్యాల పంపిణీకి ఖర్చయ్యే దాదాపు 3,109కోట్ల రూపాయలను, పప్పుల పంపిణీకి అయ్యే దాదాపు 280కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం భరిస్తోంది.

ఆహార ధాన్యాల సేకరణ: 2020 ఆగస్టు 3 తేదీ  సమాచారం ప్రకారం మొత్తం 389.77 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు (ఆర్.ఎం.ఎస్.2020-21), 752.58 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (కె.ఎం.ఎస్. 2019-20) సేకరించారు.

 

ఒక దేశం ఒకే రేషన్ కార్డు:

2020 సంవత్సరం ఆగస్టు 1వరకూ అందిన సమాచారం ప్రకారం ఒక దేశం ఒకే రేషన్ కార్డు పథకం పరిధిలోకి మరో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేరాయి. మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, జమ్ము కాశ్మీర్ పథకం పరిధిలోకి చేరాయి. దీనితో మొత్తం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒక దేశం ఒకే రేషన్ కార్డు పథకం పరిధిలోకి చేరినట్టయింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, దామన్, డయ్యూ (దాద్రా నాగర్ హవేలీ), గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, త్రిపుర పథకం పరిధిలోకి వచ్చాయి.

 2021 సంవత్సరం మార్చి నెలాఖరు నాటికి కింది పట్టికలోని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఒక దేశం ఒకే రేషన్ కార్డు పరిధిలో చేర్చబోతున్నారు.

 

వరుస నంబరు

రాష్ట్రం పేరు

పోస్ (ePoS) శాతం

రేషన్ కార్డుల ఆధార్ సీడింగ్ శాతం

పథకంలో చేరే అవకాశం ఉన్న తేదీ

1

అండమాన్ నికోబార్

 

96%

98%

ఆగస్టు 1, 2020

2

చత్తీస్ గఢ్

 

98%

98%

ఆగస్టు 31, 2020

3

తమిళనాడు

 

100%

100%

అక్టోబరు 1, 2020

4

లఢక్

 

100%

91%

అక్టోబరు 1, 2020

5

ఢిల్లీ

 

0%

100%

అక్టోబరు 1, 2020

6

మేఘాలయ

 

0%

1%

డిసెంబరు 1, 2020

7

పశ్చిమ బెంగాల్

 

96%

80%

జనవరి 1, 2021

8

అరుణాచల్ ప్రదేశ్

 

1%

57%

జనవరి 1, 2021

9

అస్సాం

 

0%

0%

 

10

లక్షద్వీప్

 

100%

100%

 

11

పుదుచ్చేరి

 

0%

100% (DBT)

DBT

12

చండీగఢ్

0%

99% (DBT)

DBT

 

****

 

 

 



(Release ID: 1643450) Visitor Counter : 162