ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గత 24 గంటల్లో భారతదేశంలో 6.6 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించడం జరిగింది.
దేశంలోని 28 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో రోజుకు / మిలియన్ జనాభాకు / సగటున 140 కంటే ఎక్కువగా నమూనాలను పరీక్షించడం జరుగుతోంది.
దేశంలోని 28 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో పాజిటివ్ కేసుల రేటు 10 శాతం కంటే తక్కువగా ఉంది.
Posted On:
04 AUG 2020 7:53PM by PIB Hyderabad
కోవిడ్-19 నిర్ధారణ కోసం గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,61,892 నమూనాలను పరీక్షించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన మొత్తం నమూనాల సంఖ్య 2,08,64,750 కి చేరింది. అదేవిధంగా, సగటున మిలియన్ జనాభాకు నిర్వహించిన పరీక్షల (టి.పి.ఎం) సంఖ్య 15,119 కు చేరింది.
కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల సంయుక్త మరియు కేంద్రీకృత ప్రయత్నాల ఫలితంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులను ముందస్తుగా గుర్తించడం, వారిని ఐసోలేషన్ లో ఉంచడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా పరీక్షలు వేగవంతమయ్యాయి. ఐ.సి.ఎం.ఆర్. పరీక్షా వ్యూహం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతూ భారతదేశంలో క్రమంగా పరీక్షల సంఖ్య పెరగడానికి దోహదపడింది.
“కోవిడ్-19 నేపథ్యంలో, "ప్రజారోగ్యం మరియు సామాజిక చర్యలను సర్దుబాటు చేయడానికి ప్రజారోగ్య లక్షణాలు” అనే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, మార్గదర్శకాలను జారీ చేస్తూ, అనుమానాస్పద కేసుల కోసం సమగ్ర నిఘా ఉంచాలని సూచించింది. దేశంలో రోజుకు / మిలియన్ జనాభాకు / సగటున 140 పరీక్షలు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
భారతదేశంలో రోజుకు / మిలియన్ జనాభాకు / సగటున 479 పరీక్షలు నిర్వహిస్తుండగా, దేశంలోని 28 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన రోజుకు / మిలియన్ జనాభాకు / సగటున 140 కంటే ఎక్కువగా నమూనాలను పరీక్షించడం జరుగుతోంది.
"టెస్ట్, ట్రాక్, ట్రీట్" అంటే పరీక్షించడం, వ్యాప్తిని గుర్తించడం, చికిత్సనందించడం అనే వ్యూహానికి అనుగుణంగా, కోవిడ్-19 పరీక్షల యొక్క పాజిటివ్ కేసుల రేటును తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ప్రస్తుతం భారతదేశంలో సరాసరి పాజిటివ్ కేసుల రేటు 8.89 శాతంగా ఉంది. దేశంలోని 28 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో పాజిటివ్ కేసుల రేటు 10 శాతం కంటే తక్కువగా ఉంది. ఇది పరీక్షా వ్యూహం సరైన మార్గంలో పయనిస్తోందన్న విషయాన్ని సూచిస్తోంది. పాజిటివ్ కేసుల రేటును మరింత మెరుగుపరచి, 5 శాతానికి తీసుకురావాలని, కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
రోజూ 10 లక్షల పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో, పరీక్ష సామర్థ్యాన్ని నిరంతరం పెంచడం జరుగుతోంది. దేశంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షా కేంద్రాల సామర్ధ్యం ప్రభుత్వ రంగంలో 917 ప్రయోగశాలలు, ప్రయివేటు రంగంలో 439 ప్రయోగశాలలతో మొత్తం 1,356 ప్రయోగశాలలతో నిరంతరం బలోపేతమవుతోంది.
ఆ ప్రయోగశాలల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
* రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్. ఆధారిత
పరీక్షా ప్రయోగశాలలు : 691 (ప్రభుత్వ: 420 + ప్రయివేటు: 271)
* ట్రూ-నాట్ ఆధారిత
పరీక్షా ప్రయోగశాలలు : 558 (ప్రభుత్వ : 465 + ప్రయివేటు : 93 )
* సి.బి-నాట్ ఆధారిత
పరీక్షా ప్రయోగశాలలు : 107 (ప్రభుత్వ : 32 + ప్రయివేటు : 75)
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు,
సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం
ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి :
https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను
దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
technicalquery.covid19[at]gov[dot]in
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న
ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు :
ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా,
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన
ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046
లేదా 1075 టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు.
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన
కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
*****
(Release ID: 1643424)
Visitor Counter : 347