సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఖాదీ సిల్కు మాస్కుల "గిఫ్ట్ బాక్సు" ను ప్రారంభించిన - మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ.

Posted On: 01 AUG 2020 2:23PM by PIB Hyderabad

మీరు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రత్యేకమైన ఖాదీ సిల్కు ఫేస్ మాస్కులతో ఉన్న ఆకర్షణీయమైన "గిఫ్టు బాక్సు" ను బహుమతిగా ఇవ్వవచ్చు.  ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) అభివృద్ధి చేసిన ఈ "గిఫ్ట్ బాక్సు" ‌ను ఎం.ఎస్.‌ఎం.ఇ. శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ నిన్న ప్రారంభించారు.  ఈ "గిఫ్టు బాక్సు" లో వివిధ రంగులు మరియు ప్రింట్లలో చేతితో తయారు చేసిన నాలుగు సిల్కు మాస్కులు ఉంటాయి.  నల్లని రంగుపై పైకి ఉబ్బిన బంగారు అక్షరాలు ముద్రించి, అందంగా రూపొందించిన చేతితో తయారు చేసిన కాగితపు పెట్టెలో మాస్కులను ప్యాకింగ్ చేశారు. 

 

ఈ "గిఫ్టు బాక్సు" పండుగల స్ఫూర్తిని జరుపుకునేందుకు తగిన ఉత్పత్తి అని, భద్రతను కూడా నిర్ధారిస్తుందని పేర్కొంటూ , ఈ ప్రయత్నాన్ని శ్రీ గడ్కరీ ప్రశంసించారు.  కరోనా మహమ్మారి యొక్క అత్యంత కష్ట సమయంలో కళాకారులకు స్థిరమైన జీవనోపాధి కల్పించిందని కె.వి.ఐ.సి. యొక్క మాస్కు తయారీ కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు.

 

సిల్కు మాస్కు గిఫ్టు బాక్సులు ఒక్కొక్కటీ కేవలం 500 రూపాయల ధరకు, ఇప్పుడు ఢిల్లీ ఎన్.‌సి.ఆర్.‌లోని అన్ని కె.వి.ఐ.సి. విక్రయకేంద్రాల్లోనూ అందుబాటులో ఉంటాయి. 

విదేశీ మార్కెట్ ‌ను ఆకర్షించాలనే ఆలోచనతో, ఈ "గిఫ్టు బాక్సు" ను ప్రారంభించడం జరిగిందని, కె.వి.ఐ.సి. చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా తెలియజేశారు.  ఈ పండుగ సీజన్లో తమ ప్రియమైనవారి కోసం సరసమైన ధరలో బహుమతుల కోసం వెతుకుతున్న భారతీయ జనాభాకు ఇది అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. 

ఈ "గిఫ్టు బోక్సు" ల్లో ఒక ప్రింటు చేసిన సిల్కు మాస్కుతో పాటు, ఆకర్షణీయమైన ముదురు రంగుల్లో మరో మూడు మాస్కులు ఉంటాయి.  చర్మానికి-అనుకూలంగా, శుభ్రపరచుకోడానికి వీలుగా, తిరిగి ఉపయోగించుకోడానికి అనువుగా, జీవ-శైధిల్యత కు అనుకూలంగా మూడు పొరలతో ఈ సిల్కు మాస్కులను తయారుచేశారు.   ఈ సిల్కు మాస్కులు మూడు మడతలు కలిగి ఉంటాయి. సర్దుబాటు చేయగల చెవి ఉచ్చులతో పాటు ఆకర్షణీయమైన పూసలను కూడా ఈ మాస్కులకు అమర్చారు.  ఈ మాస్కు, 100 శాతం ఖాదీ నూలు వస్త్రంతో లోపలి రెండు పొరలు, సిల్కు వస్త్రంతో ఒక పై పొరను కలిగి ఉంది.

 

*****



(Release ID: 1642882) Visitor Counter : 203