రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ద్విచక్ర వాహన హెల్మెట్లకూ బీఐఎస్ ధ్రువీకరణ అమలుపై ప్రజా సూచనలను ఆహ్వానించిన ఎంఆర్‌టీహెచ్

Posted On: 01 AUG 2020 1:16PM by PIB Hyderabad

ద్విచక్ర వాహన చోద‌కుల రక్షణ నిమ‌త్తం మెరుగైన‌ హెల్మెట్లను తీసుకురావడానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఆర్‌టీహెచ్) ఒక‌ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ (బీఐఎస్‌) 2016, ప్రకారం హెల్మెట్లకు బీఐఎస్‌ ధ్రువీకరణ విధానాన్ని అమ‌లుల్లోకి తేవాలి స‌ర్కారు యోచిస్తోంది. దీనికి సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనివ‌ల్ల భారత దేశంలో ద్విచక్ర వాహన చోద‌కుల‌కు బీఐఎస్ సర్టిఫికేట్ క‌లిగి ఉన్న హెల్మెట్లను మాత్రమే తయారు చేసి విక్రయించడానికి వీల‌వుతుంది. ఫ‌లితంగా ద్విచక్ర వాహన హెల్మెట్ల నాణ్యతను మెరుగ‌వుతుంది మరియు రహదారి భద్రతా దృష్టాంతాన్ని మెరుగుపరుస్తుంది. ద్విచక్ర వాహనాలతో కూడిన ప్రాణాంతక గాయాలను తగ్గించడంలో దోహ‌దం చేస్తుంది. ఈ విషయంలో సూచనలు లేదా వ్యాఖ్యలను నోటిఫికేష‌న్ జారీ అయిన తేదీ నుంచి ముప్పై రోజులలోపు జాయింట్ సెక్రటరీ (ఎంవిఎల్), రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, రవాణా భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ-110001 (ఇమెయిల్: jspb-morth[at]gov[dot]in) పంపవచ్చు.

***



(Release ID: 1642868) Visitor Counter : 133