ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై మంత్రుల బృందం (జి.ఓ.ఎం) 19వ సమావేశానికి అధ్యక్షత వహించిన - డాక్టర్ హర్ష వర్ధన్.

ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ కేసు మరణాల రేటులో ఒకటిగా భారతదేశంలో ఉంది, ఇది క్రమంగా తగ్గుతోంది: డాక్టర్ హర్ష వర్ధన్

గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,42,588 కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు జరిగాయి.

Posted On: 31 JUL 2020 3:38PM by PIB Hyderabad

కోవిడ్-19 పై ఉన్నత స్థాయి మంత్రుల బృందం (జి.ఓ.ఎం) 19వ సమావేశానికి కేంద్ర ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు ఇక్కడ వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధ్యక్షత వహించారు.  ఈ సమావేశంలో  విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్;  పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పురి;  నౌకాయాన శాఖ సహాయ (స్వతంత్ర), రసాయనాలుఎరువుల శాఖ మంత్రి శ్రీ మనసుఖ్ లాల్ మాండవీయ;  కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే;  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ తదితరులు పాల్గొన్నారు

భారతదేశంలో కోవిడ్-19 యొక్క ప్రస్తుత స్థితిని ఈ సందర్భంగా మంత్రుల బృందానికి వివరించడం జరిగింది.  ఈ సందర్భంగా డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, "భారతదేశం ఒక మిలియన్ రికవరీల మైలురాయిని సాధించింది, ప్రస్తుతం రికవరీ రేటు 64.54 శాతంగా నమోదయ్యింది.  ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో క్రియాశీల కేసులు కేవలం 33.27 శాతం లేదా మొత్తం పాజిటివ్ కేసులలో సుమారు మూడో వంతు మాత్రమే అన్న విషయం స్పష్టమౌతోంది.  భారతదేశం యొక్క కేసు మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతోంది, ప్రస్తుతం ఇది 2.18 శాతంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యల్పంగా ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది. ” అని పేర్కొన్నారు. 

భారతదేశంలో చికిత్స పొందుతున్న కేసుల తీవ్రతపై డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, "మొత్తం క్రియాశీల కేసులలో, 0.28 శాతం మంది రోగులు మాత్రమే వెంటిలేటర్లలో ఉన్నారు, 1.61 శాతం మంది రోగులు ఐ.సి.యులో చికిత్స తీసుకుంటున్నారు మరియు 2.32 శాతం మంది మాత్రమే ఆక్సిజన్ అందించవలసిన పరిస్థితిలో ఉన్నారు". అని వివరించారు.  భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న పరీక్షా సామర్థ్యం గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి వివరిస్తూ, దేశవ్యాప్తంగా మొత్తం 1,331 ప్రయోగశాలల నెట్ వర్కు ద్వారా (911- ప్రభుత్వ ప్రయోగశాలలు మరియు 420- ప్రైవేట్ ప్రయోగశాలలతో), గత 24 గంటల్లో దేశంలో  రికార్డు స్థాయిలో 6,42,588 పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేశారు. దీంతో, దేశవ్యాప్తంగా నిర్వహించిన మొత్తం కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 1.88 కోట్ల కంటే ఎక్కువగా నమోదయ్యింది. 

పి.పి.ఈ.లు, మాస్కులు, వెంటిలేటర్లతో పాటు, హెచ్.‌సి.క్యూ. వంటి ఔషధాల తయారీకి వివిధ రంగాల్లో దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం గురించి కూడా మంత్రుల బృందానికి తెలియజేశారు.  ఇక, ఆరోగ్య పరిరక్షణ పరికరాల విషయానికొస్తే, మొత్తం 268.25 లక్షల ఎన్-95 మాస్కులు, 120.40 లక్షల పి.పి.ఈ.లతో పాటు 1083.77 లక్షల హెచ్.‌సి.క్యూ. మాత్రలను వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పంపిణీ చేశారు.

జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్.‌సి.డి.సి) డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె. సింగ్, అత్యధిక కేసుల భారం ఎక్కువగా ఉన్న 10 దేశాలలో రోజువారీ కేసులు, మరణాలు మరియు వృద్ధి రేటుపై ప్రపంచ దేశాలలో ఉన్న పరిస్థితిని వివరించారు.  భారతదేశం మొత్తం మీద రికవరీ రేటు 64.54 శాతంగా ఉంది.  ఢిల్లీలో అత్యధిక రికవరీ రేటు 89.08 శాతంగా నమోదు కాగా, 79.82 శాతంతో హర్యానా తర్వాతి స్థానంలో ఉన్నట్లు ఆయన మంత్రుల బృందానికి వివరించారు.  కర్ణాటక లో అత్యల్ప రికవరీ రేటు 39.36 శాతంగా ఉంది.  గ్రామీణ మరియు పట్టణ భారతదేశంలోని కంటైన్మెంటు జోన్లలో స్థానికత మరియు క్రియాశీల కేసులతో పాటు ధృవీకరించబడిన కేసుల పంపిణీ గురించి మంత్రుల బృందానికి తెలియజేశారు. మొదటి 12 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు (మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తెలంగాణా, బీహార్, రాజస్థాన్ మరియు అస్సాం) లలో నమోదైన వృద్ధి రేటు వివరాలను ఎన్.‌సి.డి.సి. డైరెక్టర్  ప్రభుత్వానికి వివరించారు.  రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో పరీక్షలు మరియు పరీక్షల సానుకూలత రేటు; మరియు మొదటి స్థానంలో ఉన్న 20 జిల్లాలు మరియు కంటైన్మెంట్ జోన్లలో చురుకైన కేసులు మరియు మరణాల వివరాలు కూడా మంత్రుల బృందానికి తెలియజేశారు. 

భారీ సంఖ్యలో కేసులు నమోదైన జిల్లాలు / నగరాలతో పాటు పూణే, థానే, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న మరణాలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఎత్తి చూపారు.  కంటైన్మెంట్ జోన్లలో సమర్థవంతమైన నిర్వహణ కోసం - వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో కఠినమైన నియంత్రణ;  విస్తృతమైన రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు;  తీవ్రమైన, వేగవంతమైన ఇంటింటి శోధన;  అనుమానితులకు  / ధృవీకరించిన కేసులకు మరిన్ని ఐసోలేషన్ సౌకర్యాలు; ప్రామాణిక చికిత్సా నిర్వహణ విధివిధానాలతో పాటు ఆక్సిజన్ సౌకర్యం మరియు వెంటిలేటర్లు ఉన్న పడకల సంఖ్య పెంపు మరియు ప్రణాళికాబద్ధమైన సెరో-సర్వేల ద్వారా వాస్తవ భారాన్ని అంచనా వేయడం వంటి తీసుకోవలసిన చర్యల ద్వారా వ్యూహాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.  లక్ష్యంగా ఉన్న ఐ.ఈ.సి. ప్రచారాల ద్వారా జాన్ చేతన మరియు జాన్ భగీదరి (సమాజ ప్రమేయం) వంటి వాటిని ముందుకు వెళ్ళే మార్గాలుగా సూచించారు.

స్థానిక వ్యాప్తిని పరిమితం చేయడం; కేసులను ప్రారంభ దశలోనే గుర్తించడం; సాంకేతిక పరిజ్ఞానంతో కాంటాక్ట్ ట్రేసింగ్‌ను బలోపేతం చేయడం; మరియు సమాజాన్ని భాగస్వామ్యం చేయడం వంటి ప్రయత్నాలతో, అధిక భారం ఉన్న ప్రాంతాల నుండి ఓ మాదిరి కేసుల భారం ఉన్న జిల్లాలు / నగరాల్లోకి, వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడంపై దృష్టి పెట్టాలి. 

తక్కువ భారం ఉన్న జిల్లాల విషయానికొస్తే, ఇతర ప్రాంతాల నుండి జనాభాలో సంక్రమణను నివారించడానికి - విష జ్వరం వంటి అనారోగ్యం (ఐ.ఎల్.ఐ) / తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (ఎస్.ఏ.ఆర్.ఐ) నిఘా మరియు లక్ష్య పరీక్షలను బలోపేతం చేయడం; స్థానిక పరిపాలన (> 15-20 పరిచయాలు / కేసు) నిర్దేశించాల్సిన లక్ష్యాలతో కఠినమైన కాంటాక్టులను జాడ కనుగొనడం; మరియు అధిక ప్రమాద జనాభా యొక్క ముందస్తు గుర్తింపు వంటి చర్యలు లక్ష్యంగా చేపట్టాలి. 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎగుమతి పరిమితి / నిషేధానికి గురైన వివిధ వస్తువులు మరియు వాటి ప్రస్తుత స్థితి గురించి డి.జి.ఎఫ్.‌టి. శ్రీ అమిత్ యాదవ్, మంత్రుల బృందానికి వివరించారు. విమానాశ్రయాలలో అనుసరిస్తున్న విధివిధానాలు మరియు విదేశాలనుండి వచ్చే ప్రయాణీకుల పరీక్షలను మెరుగుపరచడానికి తీసుకోవలసిన చర్యలపై మంత్రుల బృందం చర్చించింది.

ఈ సమావేశంలో - ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీమతి ప్రీతి సుడాన్;  ఓ.ఎస్.డి. (ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ) శ్రీ రాజేష్ భూషణ్;  ఫార్మా కార్యదర్శి శ్రీ పి.డి.వాఘేలా;   పౌరవిమానయాన శాఖ కార్యదర్శి శ్రీ ప్రదీప్ సింగ్ ఖరోలా;   వాణిజ్యశాఖ కార్యదర్శి శ్రీ అనూప్ వాధ్వాన్;  జౌళి శాఖ కార్యదర్శి శ్రీ రవి కపూర్;  ఐ.సి.ఎం.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవడి.జి.హెచ్.ఎస్. కు చెందిన డాక్టర్ రాజీవ్ గార్గ్;  ఏ.ఎఫ్.ఎం.ఎస్. డైరెక్టర్ జనరల్ లెఫ్టనెంట్ జనరల్ అనూప్ బెనర్జీ;  ఎం.ఈ.ఏ. అదనపు కార్యదర్శి శ్రీ దమ్ము రవి;  మంత్రివర్గ సచివాలయం అదనపు కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్;  హోమ్ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్;  ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా తో పాటు,  ఐ.టి.బి.పి., డి.జి.ఎఫ్.టి., ఎం.ఈ.ఏ. ప్రతినిధులు, మరియు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర సీనియర్ ప్రభుత్వాధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు 

*****


(Release ID: 1642722) Visitor Counter : 317