వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతులకు ఆదాయం పెంచడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వ్యవసాయ రంగంలో స్టార్ట్ అప్ లను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం : కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కంపోనెంట్ లో భాగంగా ఇన్నోవేషన్, ఔత్సాహిక వ్యవసాయ పరిశ్రమల కింద అంకుర సంస్థలకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిధుల సహాయం

మొదటి దశలో వ్యవసాయ శుద్ధి, ఫుడ్ టెక్నాలజీ, అదనపు విలువలను జోడించే 112 అంకుర సంస్థలకు రూ.1185.90 లక్షల ఆర్ధిక సహాయం

Posted On: 31 JUL 2020 12:05PM by PIB Hyderabad

వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. రైతులకు అవకాశాలను కల్పించడం, యువతకు ఉపాధి కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడటానికి, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నొక్కిచెప్పినట్లుగా, వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం, అనుబంధ రంగాల ద్వారా స్టార్టప్, ఔత్సాహిక వ్యవసాయ పరిశ్రమలను (అగ్రిప్రెనియర్‌షిప్) ప్రోత్సహించడంపై దృష్టి పెట్టింది. అందువల్ల రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద, ఇన్నోవేషన్, అగ్రిప్రెనియర్‌షిప్ కంపోనెంట్ పై ప్రచారం జరిగింది. 2020-21 సంవత్సరానికి, మొదటి దశలో, వ్యవసాయ ప్రాసెసింగ్, ఫుడ్ టెక్నాలజీ, విలువ జోడించే రంగంలో మొత్తం 112 స్టార్టప్‌లకు రూ. 1185.90 లక్షలు ఆర్ధిక సహాయం అందించనున్నారు, ఇది రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. ఈ ఫండ్ వాయిదాలలో విడుదల చేస్తారు.  

భారతదేశంలో వ్యవసాయ పరిశోధన, విస్తరణ, విద్య పురోగతిని సమీక్షిస్తున్నప్పుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ వెలువరించిన ఆలోచనలను మంత్రి శ్రీ తోమర్ గుర్తు చేశారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణ, వినియోగాన్ని నిర్ధారించడానికి స్టార్టప్‌లు, అగ్రి-ఎంటర్‌ప్రీనియర్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారని శ్రీ తోమర్ పేర్కొన్నారు. రైతులకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు సమాచారం అందించడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. గుర్తించిన సమస్యలను పరిష్కరించడానికి, వ్యవసాయ కార్యకలాపాల్లో వెట్టిని తగ్గించగల సాధనాలు, పరికరాల రూపకల్పన అవసరాలను తీర్చడానికి సంవత్సరానికి రెండుసార్లు హాకథాన్‌లను నిర్వహించవచ్చని ఆయన ఆదేశించారు.

 వ్యవసాయంలో పోటీతత్వాన్ని పెంచడం, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలకు హ్యాండ్‌హోల్డింగ్ అందించడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తొందరగా అవలంబించాల్సిన అవసరాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి నొక్కి చెప్పారు. యువత వ్యవసాయం వైపు ఆకర్షించడం, ఈ రంగాన్ని చైతన్యం చేయడం ముఖ్యమని తెలిపారు. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలను పెంచడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలకు అనుగుణంగా, వ్యవసాయం, అనుబంధ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉన్న రాష్ట్ర కృషి వికాస్ యోజన (ఆర్కెవివై) ను పునరుద్ధరించారు. 

పునరుద్దరణ పథకం కింద, ఇంక్యుబేషన్ పర్యావరణ వ్యవస్థకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఇన్నోవేషన్, అగ్రిప్రెనియర్‌షిప్, స్టార్టప్‌లను ప్రోత్సహించడం ఒక భాగం. డిఎసి, ఎఫ్డబ్ల్యూ 5 నాలెడ్జ్ పార్ట్‌నర్స్ (కెపి) లను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా, 24 ఆర్కెవివై-రాఫ్టార్ అగ్రిబిజినెస్ ఇంక్యుబేటర్స్ (ఆర్-ఎబిఐ) ను దేశవ్యాప్తంగా ప్రకటన ఇచ్చి కఠినమైన ఎంపిక ప్రక్రియ తర్వాత ఎంపిక చేసింది.

వ్యవసాయ-ప్రాసెసింగ్, ఫుడ్ టెక్నాలజీ, విలువ జోడించే రంగాల నుండి వివిధ నాలెడ్జ్ పార్టనర్లను అగ్రిబిజినెస్ ఇంక్యుబేటర్లచే ఎంపిక చేసిన 112 స్టార్టప్‌లకు మొదటి దశలో రూ. 1185.90 లక్షల నిధులను ఇస్తారు. ఈ ఫండ్ వాయిదాలలో విడుదల చేస్తారు. ఈ స్టార్టప్‌లకు రెండు నెలలు భారతదేశం అంతటా వ్యాపించిన 29 అగ్రిబిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్లలో (కెపిలు,రాబిలు) శిక్షణ ఇచ్చారు. ఈ స్టార్టప్‌లు యువతకు ఉపాధి కల్పిస్తాయి. అంతేకాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా, వారికి అవకాశాలను కల్పించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదం చేస్తారు. అగ్రి-ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మరిన్ని వివరాల కోసం, ఆర్‌కెవివై వెబ్‌సైట్:  https://rkvy.nic.in  ని సందర్శించవచ్చు  

*****(Release ID: 1642593) Visitor Counter : 215