ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో కోటీ 77లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు ప్రతి పది లక్షలకు 12858 కు పెరుగుదల
Posted On:
29 JUL 2020 4:40PM by PIB Hyderabad
కోవిడ్ నివారణ, చికిత్స విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా తదేక దృష్టితో తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తున్నాయి. పరీక్షల ద్వారా బాధితులను సకాలంలో గుర్తించి చికిత్స అందించటం వల్ల కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లో 4,08,855 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పుడు ప్రతి పది లక్షలకు చేస్తున్న పరీక్షలు 12,858 కు పెరగగా మొత్తం ఇప్పటిదాకా జరిపిన పరీక్షల సంఖ్య కోటీ77లక్షలు దాటింది.
దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెరగటంలో కీలకమైన పాత్ర పోషించింది పెరుగుతున్న లాబ్ ల నెట్ వర్క్ అన్నది నిజం. నేటివరకూ దేశంలో ఉన్న లాబ్ ల సంఖ్య 1316 కాగా అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 906 , ప్రైవేట్ ఆధ్వర్యంలో 410 ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ : 675 (ప్రభుత్వ: 411 + ప్రైవేట్: 264)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 537 (ప్రభుత్వ: 465 + ప్రైవేట్: 72)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 104 (ప్రభుత్వ: 30 + ప్రైవేట్74 )
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ "భారత్ లో కోవిడ్-19 మహమ్మారి - పొగాకు వాడకం" అనే డాక్యుమెంట్ ను విడుదలచేసింది. https://www.mohfw.gov.in/pdf/COVID19PandemicandTobaccoUseinIndia.pdf లో దానిని చూడవచ్చు.
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.
కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్ +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf చూడండి
***
(Release ID: 1642134)
Visitor Counter : 230