రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
కోస్టల్ షిప్పింగ్ ద్వారా ఎరువులను తరలించడం ప్రారంభించిన ఫాక్ట్
ఇలూర్‌నుంచి తొలి బ్యాచ్ 560 మెట్రిక్‌టన్నుల అమ్మోనియం సల్ఫేట్ తరలింపు ప్రారంభం
పశ్చిమబెంగాల్‌లోని రైతులకు పంపిణీ చేసేందుకు మొత్తం 20 కంటైనర్ల అమ్మొనియా సల్ఫేట్‌ను రవాణా.
Posted On:
29 JUL 2020 3:51PM by PIB Hyderabad
రసాయనాలు,ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ , ద ఫర్టిలైజర్సు,కెమికల్సు ట్రావెన్‌కూర్ లిమిటెడ్ (ఎఫ్.ఎ.సి.టి) ఎరువులను తూర్పు, పశ్చిమ తీరానికి పంపడానికి కొత్త రవాణా సాధనంగా కోస్తా నౌకా రవాణాను ఉపయోగిస్తున్నది.
ఫాక్ట్ కంపెనీ సిఎండి శ్రీ కిషోర్ రుంగ్తా, కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ డాక్టర్ బీన, ఐఎఎస్, సంయుక్తంగా తొలి బ్యాచ్ కింద 560 మెట్రిక్ టన్నుల అమ్మోనియా సల్ఫేట్ కంటైనర్ల రవాణాను ఈలూర్ లోని ఫ్యాక్ట్ ఉదగమండలం కాంప్లెక్స్‌లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో జెండా ఊపి ప్రారంభించారు.ఎస్.ఎస్.ఎల్ విశాఖపట్నం పేరుతో గల నౌక ఈ సరకును తీసుకుని 30 జూలై కొచ్చిన్ పోర్టునుంచి బయలుదేరనుంది.
మొత్తం 20 కంటైనర్ల అల్యూమినియం సల్ఫేట్‌ను పశ్చిమ బెంగాల్‌లోని రైతులకు పంపిణీ చేసేందుకు ఆరాష్ట్రంలోని హల్దియా పోర్టుకు తరలిస్తారు.

ఫాక్ట్‌కు ఈ విషయంలో కొచ్చిన్ పోర్టు ట్రస్ట్ నుంచి మంచి మద్దతు లభిస్తోంది. కోస్టల్ షిప్పింగ్ ద్వారా సరకు రవాణా అయిన తర్వాత వాటిని నిర్దేశిత గమ్యస్థానాలకు రైలు ద్వారా చేరుస్తారు.
కొచ్చిన్ పోర్టు ట్రస్టు డిప్యూటీ ఛైర్మన్ శ్రీ ఎ.కె.మెహెరా, ట్రాఫిక్ మేనేజర్ విపిన్ ఆర్ మెనోత్, సిపిటికి సలహాదారు గౌతమ్ గుప్త, ఫాక్ట్ ఛీఫ్ జనరల్ మేనేజర్ ( మార్కెటింగ్) అనిల్ రాఘవన్‌లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సముద్ర మార్గంలొ ఎరువులను రవాణా చేయడం వల్ల రైళ్లు, రోడ్డు రవాణాపై చాలావరకు ఒత్తిడి తగ్గుతుందని వారు చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఈ భారం బాగా తగ్గుతుందన్నారు. కోస్టల్ షిప్పింగ్ కోస్తా తీరప్రాంత రాష్ట్రాల రైతులకు రెగ్యులర్ సరఫరాలు చేయడానికి కూడా బాగా ఉపయొగపడుతుంది
***
(Release ID: 1642126)
Visitor Counter : 214