గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గిరిజన వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి డిజిటైజేషన్ కు చర్యలు ప్రారంభించిన
గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ట్రైఫెడ్
ట్రైఫెడ్ గిరిజనుల దగ్గర నుంచి అమ్ముడుపోని ఒక లక్ష ఐటమ్‌లను కొని వాటిని డిస్కౌంట్ ఆఫర్‌తో ఆన్‌లైన్‌లో మార్కెట్ చేయనుంది.
Posted On:
28 JUL 2020 12:31PM by PIB Hyderabad
గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ట్రైఫెడ్ (TRIFED) గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అవసరమైన డిజిటైజేషన్‌కు చర్యలు ప్రారంభించింది. జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాలూ ఆన్‌లైన్‌కు మారినందున గిరిజన వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకుంది.ఈ చర్యద్వారా గ్రామ ఆధారిత గిరిజన ఉత్పత్తిదారులను, హస్తకళాకారులను ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన, అంతర్జాతీయ ప్రమాణాలుకలిగిన ఈ- ప్లాట్‌ఫాం ద్వారా జాతీయ అంతర్జాతీయ మార్కెట్‌లతో అనుసంధానం చేయనుంది.గిరిజన వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే ఈ వ్యూహం ఉద్దేశం.
ట్రైఫెడ్ డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా , గిరిజనులకు సంబంధించిన సమాచారం అంతటినీ, అంటే వన ధన్ యోజన, విలేజ్ హాట్స్, గిడ్డంగులు వీటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తుంది. ఈ డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా అన్ని గిరిజన క్లస్టర్లను గుర్తించి, వాటిని జిఐఎస్ టెక్నాలజీతో మాపింగ్ చేయడంవల్ల , ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ అభియాన్ కింద వీరికి ప్రయోజనం కలగనుంది.
ప్రస్తుత సంక్షోభ సమయంలో స్థానిక ఉత్పత్తులకు మద్దతు పలికే‘ గో ఓకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని, గో ఓకల్ ఫర్ లోకల్, గో ట్రైబల్- మేరా మన్ మేరా ధన్ మేరా ఉదయం’గా మార్చడం జరిగింది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలు, వాటి అమలుతోపాటు గిరిజనులకు ఉపయోగపడే విధంగా ట్రైఫెడ్ మున్నెన్నడూ లేనటువంటి అదనపు చర్యలు తీసుకుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇవి వారికి ఎంతో ఉపశమనం కలిగించేవిగా ఉన్నాయి. ట్రైఫెడ్ ఇటీవలి నెలలలో చేపట్టిన కీలక చర్యలు గిరిజనులకు ఉపాధి, జీవనోపాధిని ప్రస్తుత సంక్షుభిత సమయంలో కల్పించగలిగాయి.
కోవిడ్ మహమ్మారి ఆకస్మికంగా విరుచుకుపడడం, ఆ వెంటనే లాక్‌డౌన్ కారణంగా గిరిజన హస్తకళాకారుల వద్ద సుమారు 100 కోట్ల రూపాయల విలువగల ఉత్పత్తులు అమ్ముడుపోకుండా ఉండిపోయాయి. ఈ ఉత్పత్తులు అన్నీ అమ్మడానికి, వీటిని అమ్మగా వచ్చిన సొమ్ము గిరిజన కుటుంబాలకు అందజేయడానికి ట్రైఫెడ్ గిరిజనుల నుంచి సుమారు లక్ష ఐటమ్‌లను కొనుగోలు చేసింది. వీటిని పెద్ద ఎత్తున ఆన్‌లైన్ ద్వారా చెప్పుకోదగిన రాయితీతొ మార్కెట్ చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.. ట్రైబ్స్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా , ఇతర రిటైల్ ప్లాట్‌ఫాం లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జిఇఎం ల ద్వారా వీటిని అమ్మాలని నిర్ణయించింది.
కోవడ్ మహమ్మారి వ్యాప్తి మొదలై ఇప్పటికి నాలుగునెలలు అయింది. ఇది ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజల జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది, ఇంకా చూపుతోంది. ప్రజలు తమ జీవితాలను, జీవనోపాధిని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ,కరోనాపరిస్థితులపై పోరాటం చేస్తున్న ట్రైఫెడ్ పోరాట యోధులు గిరిజన ప్రజలను తిరిగి ప్రధానస్రవంతి అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు తమ కృషిని మరింత ముందుకు తీసుకుపోతున్నారు.
(Release ID: 1641817)
Visitor Counter : 215