గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఉన్నత్ భారత్ అభియాన్ (యుబిఏ) కోసం ఐఐటీతో అవగాహనా ఒప్పందం పై సంతకం చేసిన ట్రైఫెడ్

గిరిజనుల జీవనోపాధి మెరుగుపరచడానికి వారిలో నైపుణ్య అభివృద్ధికి ట్రైఫెడ్ తో కలిసి పనిచేయనున్న2600పైగా సంస్థలు

కొత్త ప్రాసెసింగ్ టెక్నాలజీలు, వినూత్న ఉత్పత్తులు, మెంటర్‌షిప్, పరివర్తన కలిగించే డిజిటల్ వ్యవస్థల అమలుతో
గిరిజనులలో మార్పు తెచ్చేలా ఎంఓయు వీలు కల్పిస్తుంది

Posted On: 25 JUL 2020 4:25PM by PIB Hyderabad

గిరిజన ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్న ముఖ్య సంస్థలలో ఒకటిగా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద పని చేస్తున్న ట్రైఫెడ్ గిరిజన ప్రజలను ప్రధాన స్రవంతి అభివృద్ధి వైపు తీసుకురావడానికి ముందుకు సాగుతోంది. కొనసాగుతున్న కార్యక్రమాల అమలుతో పాటు ట్రైఫెడ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన జాతీయ కార్యక్రమం అయిన ఉన్నత్ భారత్ అభియాన్ (యుబిఎ) కోసం ఐఐటి ఢిల్లీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

ఈ భాగస్వామ్యానికి తుదిరూపు ఇచ్చి లాంఛనప్రాయంగా చేయడానికి, ఢిల్లీ ఐఐటిలో నిన్న ట్రైఫెడ్,  ఐఐటీ ఢిల్లీ (యుబిఎ తరపున, జాతీయ సమన్వయ సంస్థగా), విజ్ఞాన భారతి (విభా- స్వదేశీ సైన్స్ ఉద్యమం) మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ట్రైఫెడ్ వన్ ధన్ కార్యక్రమం కింద గిరిజన ఔత్సాహిక పారిశ్రమికవేత్తలు ఇప్పుడు ఉన్నత్ భారత్ అభియాన్ (యుబిఎ) క్రింద ఉన్న 2600 పైగా  విద్యా, పరిశోధనా సంస్థల మొత్తం నెట్‌వర్క్ నైపుణ్యాన్ని వినియోగించుకోగలుగుతారు.

 

ఐ.ఐ.టి. , స్వచ్ఛంద సంస్థలు, ఇతర వాటాదారులు, అలాగే పాల్గొనే ఇతర సంస్థలు, ముఖ్యంగా, ఈ భాగస్వామ్యం వాన్ ధన్ యోజన కింద స్థాపించిన వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా జీవనోపాధిని పెంపొందించడానికి సహాయపడుతుంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, జిల్లా పరిపాలన, స్థానిక పంచాయతీ రాజ్ సంస్థలు (పిఆర్ఐ), స్వచ్ఛంద సంస్థలు, ఇతర వాటాదారులు, అలాగే పాల్గొనే ఇతర సంస్థల మధ్య సమిష్ఠి సహకారం ద్వారా గిరిజన జీవనోపాధిని, ఆదాయ ఉత్పత్తి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ట్రైఫెడ్ కృషి చేస్తుంది. 

"గిరిజన జీవనోపాధి కోసం నైపుణ్య అభివృద్ధి" లక్ష్యంగా వివిధ మంత్రిత్వ శాఖలతో తాము చురుకుగా పనిచేస్తున్నామని ట్రైఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రవీర్ కృష్ణన్ తెలిపారు. చిన్న తరహా అటవీ ఉత్పత్తుల వరకే పరిమితం కాకుండా వ్యవసాయం, ఉద్యానవన, పూల పెంపకం, ఔషధ, సుగంధ మొక్కల నుండి వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా గిరిజనులకు "ఏడాదంతా ఆదాయాన్ని సంపాదించే అవకాశాన్ని" కల్పించడం చాలా ముఖ్యం అని ఆయన తెలిపారు. ఐఐటి ఢిల్లీ వంటి జాతీయ ప్రాముఖ్యత గల సంస్థలతో సమిష్ఠి భాగస్వామ్యం గిరిజన ప్రయోజనాలకు ఉపయోగపడే తమ మిషన్‌లో కీలకమైనదని, ఎందుకంటే ఎంహెచ్‌ఆర్‌డి ప్రధాన కార్యక్రమం అయిన ఉన్నత్ భారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా ఉన్న విద్యా, పరిశోధనా సంస్థల పెద్ద నెట్‌వర్క్‌ను మేము ప్రభావితం చేయవచ్చని ట్రైఫెడ్ ఎండి అన్నారు. 

ఐఐటి అనేక విధాలుగా సమాజంతో అనుసంధానం అయ్యే దిశగా పనిచేస్తోందని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ శ్రీ వి.రాంగోపాల్ రావు తెలిపారు. తమ అధ్యాపకులను, విద్యార్థులను నిజమైన సమస్యలు ఉన్న ప్రదేశాలలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము, ఇది ఆసుపత్రులలో పనిచేస్తున్నా, గ్రామాలలో పనిచేస్తున్నా, లేదా పరిశ్రమలో అయినా. ఆ విధంగానే వారు సమస్యలను గుర్తించగలరు, క్యాంపస్‌లో అందుబాటులో ఉన్న వనరులను పరిష్కారాలను అభివృద్ధి చేయగలరు. అందువల్ల భాగస్వామ్యం అనేది తెలివైన వ్యక్తులు వాస్తవ సమస్యలను సరైన రీతిలో పరిష్కరించడానికి ఇది  ఒక అవకాశం అని ఐఐటీ డైరెక్టర్ చెప్పారు. 

స్వదేశీ స్ఫూర్తితో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాచీన పరంపర నుండి పొందిన అపారమైన జ్ఞానాన్ని భవిష్యత్ కి అందించే లక్ష్యంతో, స్వయం సమృద్ధి భారత్ గా మన దేశాన్ని రూపొందించేందుకు ఒక శాస్త్ర విజ్ఞాన ఉద్యమంగా పనిచేస్తున్నది విజ్ఞాన భారతి (విభా). అటువంటి సంస్థతో ట్రైఫెడ్, ఐఐటీ ఢిల్లీ కలిసి భాగస్వామ్యం కావడం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది.  విభా తన స్థానికి చాఫ్టర్లతో కలిసి దీనిలోని వాటాదారుల సమిష్ఠి సహకారంతో వన్ ధన్ యోజన (విడివై) ని మరింత పటిష్టం చేయడానికి ప్రణాళిక రూపొందిస్తుంది. గిరిజన సమూహాలకు, ట్రైఫెడ్, యుబిఏ కి అవసరమైన కీలక సమాచారాన్ని సమీకరించి అందిస్తుంది విభా. వన్ ధన్ యోజనతో పని చేస్తున్న గిరిజన లబ్ధిదారులు టెక్4సేవ సమాచార ఈఆర్పి పోర్టల్(సిఎస్ఐఆర్-యుబిఏ-విభా) నుండి తగు ప్రయోజనం పొందుతారు. మూలాలలో గుర్తించిన సమస్యలకు సుస్థిరత కలిగించే పరిష్కారాలకు సృజనాత్మక సాంకేతిక మార్గాలను సమ్మిళితం చేసి నలుగురికి ఉపయోగపడేలా అందుబాటులోకి తేవడానికి ఈ పోర్టల్ చొరవ చూపుతుంది. 

చిన్న అటవీ ఉత్పత్తులు (ఎంఎఫ్పిలు)ని ఇంకా అభివృద్ధి చేసే తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతిక పరిష్కారాలు ఇప్పటీకే కొందరు వన్ ధన్ లబ్ధిదారుల వద్ద అందుబాటులో ఉన్నాయి, వాటిని కూడా ఈ వ్యవస్థలోకి అనుసంధానం చేస్తారు.  చిన్న అటవీ ఉత్పత్తులను బ్రాండింగ్, మార్కెటింగ్ చేయడానికి 300 గిరిజనులు సభ్యులుగా ఉన్న వన్ ధన్ కేంద్రాలను ట్రైఫెడ్ ఇప్పటికే దేశవావ్యాప్తంగా నడుపుతోంది. ఇవి అడవుల్లో వివిధ ఉత్పత్తులను సమీకరించే వారి జీవనోపాథికి చక్కటి దారులను వేస్తోంది. అందుకు తగ్గ శిక్షణ, ఉత్పత్తుల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ లో కూడా లబ్దిదారులకు ప్రయోజనం చేరేలా ట్రైఫెడ్ కృషి చేస్తోంది. 22 రాష్ట్రాల్లో 18000 స్వయం సహాయక బృందాలకు, 3.6 లక్షల మంది గిరిజన సంగ్రాహకర్తలకు అనేక ఉపాధి అవకాశాలు అంది వచ్చేలా చేస్తోంది ట్రైఫెడ్. 

ఉన్నత్ భారత్ అభియాన్ (యుబిఏ) సమ్మిళిత భారత్ రూపకల్పన దిశగా శాస్త్ర విజ్ఞాన విశ్వవిద్యాలయాల నుండి ప్రయోజనం పొందడానికి గ్రామీణ భారత్ లో పరివర్తన తేవడానికి ఉద్దేశించినది. https://unnatbharatabhiyan.gov.in/index#network

ఉన్నత్ భారత్ అభియాన్ కిందకు అనేక ప్రతిష్ఠాత్మక విద్య సంస్థలు వచ్చి పని చేస్తున్నాయి. 

వాటిలో ఐఐటిలు, ఎన్‌ఐటిలు, డిఎస్‌టి, డిబిటి, ఐసిఎఆర్, ఐసిఎంఆర్, ఎంజిఐఆర్ఐ సిఎస్‌ఐఆర్ ప్రయోగశాలలు, ఇస్రో, డిఆర్‌డిఓ, రక్షణ ప్రయోగశాలలు, బార్క్ మొదలైనవి, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ (ఎన్జిఓలు, పిఆర్‌ఐలు & యుఎల్‌బిలు, ఇతర సామజిక సంస్థలు), సిఎస్ఆర్ చేతన కార్పొరేట్లు ఉన్నాయి. ప్రస్తుతం, యుబిఎ నెట్‌వర్క్‌లో 44 రీజినల్ కోఆర్డినేటింగ్ ఇనిస్టిట్యూట్‌లు (ఆర్‌సిఐలు) ఉన్నాయి, వీటిలో 13 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ గ్రూప్స్ (సెగ్స్), స్పెసిఫిక్ ఎక్స్‌పర్ట్స్ అడ్వైజర్స్, 2600కి పైగా పార్టిసిపేటింగ్ ఇనిస్టిట్యూట్స్ (పిఐలు) సామర్థ్యాలను పెంపొందించడానికి, పరిష్కార అన్వేషకులకు కనెక్ట్ అవ్వడానికి. గిరిజన సంఘాలు కూడా ఈ వ్యవస్తలో పనిచేస్తున్నాయి. 

***


(Release ID: 1641283) Visitor Counter : 344