చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు రూ.220 కోట్ల మినహాయింపును ఐటీఏటీ అనుమతి

Posted On: 25 JUL 2020 12:36PM by PIB Hyderabad

టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు పెద్ద ఉపశమనం క‌లిగించేలా  ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) తీర్పును వెల్ల‌డించింది.
కమిషనర్ ఆదాయపు పన్ను (సీఐటీ) అప్పీల్‌కు వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌పై ట్రస్ట్‌కు అనుకూలంగా జస్టిస్ పీపీ భట్‌ అధ్య‌క్ష‌త‌న గ‌ల ధర్మాసనం జులై 24న తన‌ తీర్పును వెలువ‌రించింది. టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు దాదాపు రూ.220 కోట్లకు పైగా ఆదాయ‌పు పన్నును సీఐటీ విధించింది. తాజాగా స‌ద‌రు డిమాండ్‌కు ఎలాంటి కనీస చెల్లింపు చేయాల్సిన అవ‌స‌రం లేకుండానే ఐటీఏటీ ప‌న్ను డిమాండ్‌ను నిలిపివేసింది.
వివాదానికి ముంగిపు ప‌లికిన ఐటీఏటీ..
2011-12 మరియు 2012-13 సంవత్సరాలకు సంబంధించిన పన్ను చెల్లింపుల‌కు సంబంధించిన‌ది ఈ కేసు. ఆయా ఆర్థిక సంవ‌త్స‌రాల‌లో సంస్థ  అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థులకు ప్ర‌తిభ స్కాలర్‌షిప్‌లను అందించడానికి గాను ఒక‌ ఎండోమెంట్ ఫండ్‌ను రూపొందించడం మరియు హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో టాటా హాల్ అని పేరు పెట్టబడిన ఎగ్జిక్యూటివ్‌ భ‌వ‌నం నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడానికి ట్రస్ట్ ఖర్చు చేసిన డబ్బు అంశం ఇందులో పొందుప‌ర‌చ‌బ‌డి ఉంది. ఇది 2011-12లో రూ.197.79 కోట్లు, 2012-13లో రూ. 25.37 కోట్ల సొమ్మును విరాళంగా ఇచ్చింది. లోక్‌సభకు చెందిన పబ్లిక్ అకౌంట్ కమిటీ (పీఏసీ) 2018లో ఈ విషయ‌మై విచారణ కోర‌డంతో ఈ అంశంపై వివాదం ప్రారంభమైంది. ప్రత్యక్ష పన్నుల సంఘం మంజూరు చేసిన మినహాయింపు ఐ-టీ చట్టాన్ని ఇది ఉల్లంఘిస్తోందని నమ్ముతున్న‌ట్టుగా.. పీఏసీ న‌మ్ముతోంద‌ని  అభిప్రాయ‌ప‌డ‌డంతో వివాదం మొద‌లైంది. ఈ విషయానికి ముంగిపు ప‌లికిన ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్.. శుక్రవారం అన్ని ఇతర విజ్ఞప్తుల‌ను "అన్వయించబడినవి, విద్యా విషయక మరియు ప్రభావవంతం కానివి" అని పేర్కొంది. "మేము ఈ ప‌న్ను సమస్యను మదింపుదారునికి అనుకూలంగా నిర్ణయించాము మరియు ఈ విజ్ఞప్తిని అనుమతించాము. అందువల్ల, మేము మదింపుదారుడి అభ్యర్ధనను సమర్థిస్తాము మరియు మినహాయింపు దావాను అనుమతించని ఫలితాన్ని తొలగిస్తున్నాము" అని ఇది తెలిపింది. అప్పీలేట్ ట్రైబ్యునల్ తన ఉత్తర్వులో ఇలా పేర్కొంది, “… ఇది పూర్తిగా నివారించదగిన వ్యాజ్యం, న్యాయపరమైన ఫోరమ్‌ల ముందు తీవ్రమైన వ్యాజ్యాన్ని అడ్డుకోవడమే కాక, మన ముందు ఉన్న మదింపుదారుడి వంటి దాతృత్వ సంస్థల యొక్క అరుదైన వనరులను ఇత‌రాల‌కు మళ్ళించేలా చేస్తుంది. ఈ ప‌రిణామం పెద్దగా సమాజానికి మంచిది కాదు.” ట్రైబ్యునల్ భారత ప్రభుత్వపు ప్రశంసనీయమైన పని చేసింద‌ని విశ్వ‌సిస్తోంది. స్థూల స్థాయిలో ఇటువంటి ముందుచూపు క‌లిగిన విధానాలను అనుసరించి క్షేత్ర‌స్థాయిలో ఇలాంటి ప్ర‌త్యేక వివక్త పరిస్థితులను మూసివేయ‌డం స‌బ‌బు కాదు. సంబంధిత అధికారుల‌ను ఇలాంటి విష‌యాల‌పై త‌గిన అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా ఇలాంటి సంఘ‌ట‌న‌లు కనిష్ఠీక‌రించాలి అని ఐటీఏటీ అభిప్రాయ‌ప‌డింది. "పన్ను పరిపాలన వ్య‌వ‌స్థ‌లోని ప్రతిస్థాయిలో న్యాయమైన విధానాన్ని అవలంబించడం ద్వారా పన్ను చెల్లింపుదారుల‌కు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయాల్సిన‌ అవ‌స‌రం ఎంతైనా ఉంది" అని ఐటీఏటీ అభిప్రాయ‌ప‌డింది.

అప్పీలేట్ ట్రైబ్యునల్ యొక్క వివరణాత్మక తీర్పును ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు
 


 

****



(Release ID: 1641186) Visitor Counter : 217