ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ మహమ్మారిపై పోరులో సంప్రదాయ వైద్యంపై ఉపబృందం ఏర్పాటు

షాంఘాయ్ సహకార సంఘం ఆరోగ్య మంత్రుల
సమావేశంలో డాక్టర్ హర్షవర్ధన్ ప్రతిపాదన.

సంప్రదాయ వైద్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యూహానికి తగినట్టుగా, షాంఘాయ్ సహకార సంఘం ఆరోగ్యమంత్రుల సమావేశాల పరిధిలో

ఉపబృందం ఏర్పాటు కావాలని సూచన
కోవిడ్ కట్టడికి భారత్ అనుసరించే వ్యూహాన్ని
వివరించిన కేంద్ర ఆరోగ్య మంత్రి

Posted On: 24 JUL 2020 4:33PM by PIB Hyderabad

    షాంఘాయ్ సహకార సంఘం (ఎస్.సి..) ఆధ్వర్యంలో రోజు జరిగిన ఆరోగ్య మంత్రుల డిజిటల్ సమావేశంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రోజు పాలుపంచుకున్నారు. న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్ లో జరిగిన భేటీలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన సహయంతో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. రష్యా సమాఖ్య ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురష్కో అధ్యక్షతలో జరిగిన సమావేశంలో,.. కోవిడ్ వైరస్ కట్టడిపై ప్రధానంగా చర్చించారు.

  సమావేశం ప్రారంభం సందర్భంగా, డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, కోవిడ్-19 వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారికి తమ సంతాపాన్ని వ్యక్తంచేశారు. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రాణాంతమైన వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు తీసుకునే చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఎలా స్వయంగా పర్యవేక్షించారో హర్షవరధన్ సమావేశంలో వివరించారు. కోవిడ్ నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు, క్రియాశీలక వ్యూహాలు తదితర అంశాలను ప్రధాని స్వయంగా పర్యవేక్షించారని చెప్పారు.

   కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. కోవిడ్ వైరస్ నియంత్రణకు ప్రభుత్వం దశలవారీగా, క్రమబద్ధంగా చర్యలు తీసుకుందని, ప్రయాణాలకు సంబంధించి ముందుజాగ్రత్తగా సూచనలు చేయడం, ప్రవేశ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు, సమూహాల ప్రాతిపదికగా నిఘా నిర్వహణ, కేసుల పెరుగదలకు తగినట్టుగా లేబరేటరీల, ఆసుపత్రుల సామర్థ్యాన్ని పెంచడంవ్యాధి ప్రబలే అంశాలుకలిగే నష్టాలపై సాంకేతికపరమైన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు విడుదల చేయడం వంటి చర్యలను ప్రభుత్వం దశలవారీగా చేపట్టినట్టు వివరించారు. వరుసగా విధించిన లాక్ డౌన్ల కారణంగా,..వ్యాధికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన్ని తెలుసుకునేందుకు, లేబరేటరీలు - ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు, ఔషధపరంగా, ఔషధేతరంగా తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలు కలిగిందని మంత్రి చెప్పారు.

  మనదేశంలో ఇప్పటివరకూ 12.5లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయని, 30వేలమందికిపైగా మరణించారని చెప్పారు. దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు 864చొప్పున మాత్రమే కేసులు నమోదయ్యాయని, ప్రతి పదిలక్షల జనాభాకు 21మంది కంటే తక్కువగానే మరణించారని మంత్రి అన్నారు. ప్రపంచంలో అతితక్కువ ఇన్ఫెక్షన్ రేటు, మరణాల రేటు నమోదైన దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. కోవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయిన వారు 63.45శాతం కాగా, మరణాల రేటు 2.3శాతమేనని, లాక్ డౌన్ విధించినందునే ఇది సాధ్యమైందని కేంద్రమంత్రి చెప్పారు.

  లాక్ డౌన్ సమయంలోనూ, తర్వాత కూడా దేశంలో కోవిడ్ పరీక్షల నిర్వహణా సామర్థ్యాన్ని, ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను పెంచుకునేందుకు గట్టి కృషి జరిగిందని మంత్రి చెప్పారు.  “వ్యక్తిగత రక్షణ పరికర వ్యవస్థ ( పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్-పి.పి..)లకు సంబంధించి ఇదివరరకు దేశంలో ఒక్క ఉత్పత్తి సంస్థకూడా లేదు. అయితే, గత కొన్ని నెలల కాలంలో దేశం పి.పి.. తయారీలో స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంది. ఇపుడు నాణ్యమైన పి.పి..లను ఇతర దేశాలకు ఎగుమతి చేయగలిగే స్థాయికి ఎదిగింది. కృత్రిమ శ్వాస పరికరాలైన వెంటిలేటర్లు, ఆక్సిజన్ అందించే ఏర్పాట్ల విషయంలో స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా సాధించింది. వీటికి సంబంధించి డిమాండ్.కు సరఫరాకు మధ్య అంతరాన్ని తగ్గించే స్థాయికి దేశం చేరుకుందిఅని కేంద్రమంత్రి వివరించారు.

  కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (.టి.)ని దేశం సృజనాత్మక రీతిలో వినియోగించిందని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. కోవిడ్ వ్యాధి ఉనికి, వ్యాప్తిని గుర్తించేందుకు .టి. ఆధారంగా పనిచేసే ఆరోగ్యసేతు యాప్.ను, ఇటిహాస్ (ITIHAS) పేరిట ట్రాకింగ్ టెక్నాలజీని ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించిందన్నారు.  అలాగే, కోవిడ్ పరీక్షలకోసం ఆర్.టి.- పి.సి.ఆర్. యాప్ ను, ఆసుపత్రిలో చేరిన కోవిడ్ రోగులపై సమాచారం, ఆసుపత్రిలో పడకల సామర్థ్యం, వంటి అంశాలను ఒకే ఒక కోవిడ్ పోర్టల్ తో పర్యవేక్షించేందుకు ఫెసిలిటీ యాప్ ను కూడా ప్రభుత్వం వినియోగంచిందని కేంద్రమంత్రి వివరించారు

   కోవిడ్-19 సంక్షోభ సమయంలో ప్రజల రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచడంలో భారతీయ సంప్రదాయ వైద్య విధానం ఎంత కీకలపాత్ర పోషించిందో డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. సంప్రదాయ వైద్యచికిత్సపై తగిన సహకారం అందించే సంస్థాగతమైన యంత్రాగమేదీ ప్రస్తుతం షాంఘాయ్ సహకార సంఘానికి అందుబాటులో లేదని మంత్రి చెప్పారు.  2014-23 కాలానికి  ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన వ్యూహానికి కావలసిన అవసరాల తీర్చగలిగే శక్తి సంప్రదాయ వైద్యానికే ఉందన్నారు. మహమ్మారి వైరస్ వ్యాప్తిని కట్టడిలో ఎస్.సి.. దేశాలు పరస్పర సహకారం అందించుకునేందుకు అంగీకరిస్తూ,.. 2018లో క్వింగ్దావో శిఖరాగ్ర సమావేశంలో కుదిరిన ఉమ్మడి ప్రకటనను సమర్థంగా అమలు చేసేందుకు కూడా సంప్రదాయ వైద్యం ఎంతో దోహదపడుతుందన్నారుఎస్.సి.. సభ్యదేశాల్లో ఇలాంటి సంప్రదాయ వైద్యం విస్తృతంగా పాటిస్తున్నప్పటికీ, ఉమ్మడి ప్రకటన మాత్రం ఆశించినట్టుగా అమలుకాలేదన్నారుఅందువల్ల, ఎస్.సి.. పరిధిలో ప్రస్తుతం జరిగే ఆరోగ్యమంత్రుల సమావేశాల నేపథ్యంలో సంప్రదాయ వైద్యంపై కొత్త ఉప బృందాన్ని ఏర్పాటు చేయాలని డాక్టర్ హర్షవర్ధన్ ప్రతిపాదించారు.

  కోవిడ్ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత క్లిష్ట సమయంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు సభ్యదేశాలన్నీ మందుకు రావాలని, ఆరోగ్య, ఆర్థిక రంగాలపై కోవిడ్ దుష్ప్రభావాన్ని తగ్గించేందుకు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ముందువరుసలో నిలిచి పోరాడుతున్న సిబ్బందికి మంత్రి హర్షవర్ధన్ అభినందనలు తెలిపారు.  “మానవాళికి అండగా నిలవడంలో వారు భగవంతుడి కంటే తక్కువైనవారేమీ కాదని పేర్కొంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

****


(Release ID: 1641007) Visitor Counter : 254