ఆర్థిక మంత్రిత్వ శాఖ
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను ముందుకు తీసుకువెళ్లేందుకు నిధుల కొరతను ఎదుర్కొంటున్న రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు సంబంధించి, స్పెషల్ విండో సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
-81 ప్రాజెక్టులకు 8,767 కోట్ల రూపాయలు మంజూరు, దీనివల్ల దేశవ్యాప్తంగా 60 వేల ఇళ్లనిర్మాణం పూర్తిచేసేందుకు వీలు.
- స్పెషల్ విండో ద్వారా నిర్మాణరంగంలో కార్యకలాపాలకు ప్రోత్సాహం, దీనితో నైపుణ్యంగల, పాక్షిక నైపుణ్యాల గల కార్మికులకు దక్కనున్న ఉపాధి అవకాశాలు
Posted On:
23 JUL 2020 7:45PM by PIB Hyderabad
చౌక, మధ్యాదాయ ఇళ్ల స్పెషల్ విండో (ఎస్.డబ్ల్యు.ఎ.ఎం.ఐ.హెచ్ -స్వామిహ్) పనితీరుకు సంబంధించి కేంద్ర ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మాలా సీతారామన్ ఈరోజు, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శులు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజ్‌మెంట్ బృందం, ఎస్.బి.ఐ కాపిటల్ మార్కెట్ లిమిటెడ్, ఎస్‌బిఐ కాప్స్ వెంచర్స్‌లిమిటెడ్ (ఎస్.వి.ఎల్) తో సమీక్ష నిర్వహించారు. ఈ ఫండ్ ఇప్పటివరకు 8,767 కోట్ల రూపాయల పెట్టుబడితో 81 ప్రాజెక్టులను ఆమోదించింది.
స్వామిహ్ పెట్టుబడి ఫండ్-1 విధానపరమైన ప్రకటన నుంచి ఆచరణాత్మక కార్యక్రమంగా క్షేత్రస్థాయిలో పురోగతి సాధిస్తోంది. ఇది 81 ప్రాజెక్టులను ఆమోదించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 60,000 ఇళ్ళ నిర్మాణం పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టులు నేషనల్ కాపిటల్ రీజియన్-ఎన్.సి.ఆర్, ఎం.ఎం.ఆర్, బెంగళూరు, చెన్నై, పూణె, వంటి భారీ నగరాలలో విస్తరించి ఉన్నాయి.అలాగే ద్వితీయ శ్రేణి ప్రాంతాలైన కర్నాల్, పానిపట్, లక్నో, సూరత్, డెహ్రాడూన్, కోట, నాగపూర్, జైపూర్, నాశిక్, వైజాగ్, చండీఘడ్ (అనుబంధం-1) లకు కూడా విస్తరించాయి. ఈప్రాజెక్టులలో 18 ప్రాజెక్టులకు సంబంధించినపెట్టుబడులకు తుది క్లియరెన్సులు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన 7 రెసిడెన్షియల్ ప్రాజెక్టుల చెల్లింపులు వివిధ దశలలో ఉన్నాయి.(అనుబంధం-2). 353నిధుల కొరత గల ప్రాజెక్టులకు సంబంధించిన దరఖాస్తులు సహాయం కోసం పరిశీలనలో ఉన్నాయి. స్పెషల్ విండో ద్వారా ఈ నిర్మాణ స్థలాలలో కార్యకలాపాలు ప్రారంభమైతే, నైపుణ్యంకలిగిన, పాక్షిక నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదనంగా, ఈ ఫండ్ దీర్ఘకాలికంగా నిలిచిపోయిన ప్రాజెక్టులకు సంబంధించి 15 ఏల మంది ఇళ్ల కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే చర్యల విషయాన్ని చురుకుగా పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టు ముందు పరిష్కారానికి ఉన్నాయి.
స్పెషల్ విండో పనితీరును సమీక్షిస్తూ కేంద్ర ఆర్థికమంత్రి శ్రీ మతి నిర్మలా సీతారామన్ , దీని కృషిని అభినందించారు. పెట్టుబడి ఖర్చును 12 శాతానికి తగ్గించేందుకు ఫండ్ చూపిన చొరవ కారణంగా , స్పెషల్ విండో కింద నిధులు పొందేందుకు అర్హత ఉన్న ప్రాజెక్టులసంఖ్య పెరిగింది.ప్రస్తుత రుణదాతలు పాల్గొనేలా స్పెషల్ విండో వేగవంతం చేసిన చర్యలను ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అభినందించారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఎన్.బి.ఎఫ్.సిలు, హెచ్.ఎఫ్.సిలు స్పెషల్ విండోను ఒక స్టేక్‌హోల్డర్‌గా చూడాలని, నిదుల కొరతను ఎదుర్కొంటున్న ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేసేందుకు మద్దతునివ్వాలని సూచించారు.
వివిధ నిర్మాణ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు, నిధులను జాగ్రత్తగా ప్రాజెక్టు ప్రగతికి అనుగుణంగా ఖర్చుచేసేందుకు నియంత్రణ ఏర్పాట్లను ఫండ్ ఏర్పాటు చేసిన విషయాన్ని అధికారుల బృందం ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువచ్చింది. ఈ చర్యలు ఈ రంగంలో మరింత పారదర్శకత, ప్రాజెక్టుకు నగదు సరఫరాలో జవాబుదారిత్వం పెంచడంతోపాటు నిధుల మళ్ళింపు జరగకుండా చూస్తాయి.
సమీక్షాసమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి, ఆర్థిక వ్యవహారాల విభాగాన్ని, స్వామిహ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ -1 పనితీరును సన్నిహితంగా గమనించాల్సిందిగా సూచించారు. పెట్టుబడి నిధుల కొరతను ఎదుర్కొంటున్న ప్రాజెక్టుల సమస్యను పరిష్కరించేందుకు ఈ ఫండ్ ఉద్దేశించినదని, ఈ ప్రక్రియలో ఎదురయ్యే అవరోధాలను తొలగించాల్సిందిగా వారికి ఆమె సూచించారు. ఈ ప్రాజెక్టులు సత్వరం పూర్తి అయ్యేందుకు కృషి చేయాలని , ఇందుకు సంబంధించి చిట్టచివరి స్థాయి ఫండింగ్ కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ ఫండ్ ద్వారా సమకూరిన అవకాశం ద్వారా , ప్రస్తుత ప్రాజెక్టు ఫైనాన్సియర్ల మద్దతుతో ఇళ్లకొనుగోలుదారులకు తక్షణ ఉపశమనం కలిగించే లక్ష్యం దిశగా కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ స్పెషల్ విండో మున్నెన్నడూ లేని తరహా లోనిదని, ఈ చొరవ రియల్ ఎస్టేట్ రంగానికి అద్భుతమైన మద్దతు నిస్తున్నదని ఆమె అన్నారు. ఆర్జకంగా సంక్షుభిత సమయంలోనూ ఈరంగం తిరిగి కోలుకోవడానికి ఇది అద్భుత అవకాశమని ఆమె అన్నారు.
*****
(Release ID: 1640826)
Visitor Counter : 167