వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పీఎంజీకేఏవై-2 కింద మొత్తం 19.32 ఎల్‌ఎమ్‌టి ఆహారధాన్యాలను పొందిన రాష్ట్రాలు/యూటీలు
Posted On:
22 JUL 2020 6:37PM by PIB Hyderabad
ఆత్మనిర్భర భారత్ అభియాన్ కింద మే నెలలో 2.40 కోట్ల లబ్దిదారులకు, 2020 జూన్ లో 2.47 కోట్ల లబ్దిదారులకు 2,43,092 ఎంటీ ఆహారధాన్యాల పంపిణీ, అలాగే 11,678 ఎమ్‌టి శెనగలను పంపిణీ చేసిన రాష్ట్రాలు, యూటీలు
మొత్తం ఆహార ధాన్యాల నిల్వలు:
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2020 జులై 21నాటి నివేదిక ప్రకారం, ఎఫ్‌సిఐలో ప్రస్తుతం 253.28 ఎల్‌ఎమ్‌టి బియ్యం, 531.05 ఎల్‌ఎమ్‌టి గోధుమలు ఉన్నాయి. అందువల్ల, మొత్తం 784.33 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యం నిల్వ అందుబాటులో ఉంది (ప్రస్తుతం జరుగుతున్న గోధుమలు, వరి కొనుగోలును మినహాయించి, ఇవి ఇంకా గోడౌన్‌కు చేరుకోలేదు). ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ, పీఎంజీకేఏవై, ఇతర సంక్షేమ పథకాల కింద నెలకు సుమారు 95 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు అవసరం.
లాక్ డౌన్ అయినప్పటి నుండి, సుమారు 139.97 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు 4999 రైలు రేకుల ద్వారా తీసుకుని రవాణా చేశారు, మొత్తం 285.07 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు 2020 జూన్ 30 వరకు రవాణా అయ్యాయి. జూలై 1, 2020 నుండి 26.69 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు 953 రైలు రేకుల ద్వారా రవాణా చేశారు. రైలు మార్గం కాకుండా, రోడ్లు, జలమార్గాల ద్వారా కూడా రవాణా జరిగింది. జూలై 1, 2020 నుండి మొత్తం 50.91 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు రవాణా చేశారు. 2020 జూలై 1 నుండి మొత్తం 1.63 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు ఈశాన్య రాష్ట్రాలకు రవాణా చేశారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన-1
ఆహారధాన్యాలు(బియ్యం/గోధుమలు)
పీఎంజీకేఏవై కింద, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు మొత్తం 119.5 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు (104.3 ఎల్‌ఎమ్‌టి బియ్యం మరియు 15.2 ఎల్‌ఎమ్‌టి గోధుమలు) అవసరమయ్యాయి, వీటిలో 101.51 ఎల్‌ఎమ్‌టి బియ్యం, 15.01 ఎల్‌ఎమ్‌టి గోధుమలను వివిధ రాష్ట్రాలు, యుటిలు ఇప్పటికే తీసుకున్నాయి. మొత్తం 117.08 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు తీసుకున్నాయి. 2020 ఏప్రిల్ నెలలో 37.43 ఎల్‌ఎమ్‌టి (94%) ఆహార ధాన్యాలు 74.86 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు, 2020 మేలో మొత్తం 37.41 ఎల్‌ఎమ్‌టి (94%) ఆహార ధాన్యాలు 74.82 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేసారు, 2020 జూన్ లో 36.19 72.38 కోట్ల మంది లబ్ధిదారులకు ఎల్‌ఎమ్‌టి (91%) ఆహార ధాన్యాలు పంపిణీ అయ్యాయి, (జూన్ నెల పంపిణీ ఇంకా ఉంది). మూడు నెలల్లో మొత్తం సగటు పంపిణీ 93 శాతం.
పప్పుధాన్యాలు:
పప్పుధాన్యాల విషయానికొస్తే, మూడు నెలల మొత్తం అవసరం 5.87 ఎల్‌ఎమ్‌టి. ఇప్పటివరకు, 5.83 ఎల్‌ఎమ్‌టి పప్పులు రాష్ట్రాలు / యుటిలకు పంపిణీ అయ్యాయి, 5.79 ఎల్‌ఎమ్‌టి రాష్ట్రాలు / యుటిలకు చేరుకోగా, 4.89 ఎల్‌ఎమ్‌టి పప్పుధాన్యాలు పంపిణీ అయ్యాయి.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన-2
ఆహారధాన్యాలు(బియ్యం/గోధుమలు)
2020 జులై 01 నుండి ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన-2 ప్రారంభమైంది, ఇది నవంబర్ 2020 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో, 81 కోట్ల మంది లబ్ధిదారులకు మొత్తం 201 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు, అలాగే మొత్తం 12 ఎల్‌ఎమ్‌టి శెనగలు 19.4 కోట్ల కుటుంబాలకు పంపిణీ చేస్తారు.
జూలై నుండి నవంబర్ 2020 వరకు 5 నెలల కాలానికి మొత్తం 201.08 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు రాష్ట్రాలు, యుటిలకు కేటాయించారు. ఇందులో 91.14 ఎల్‌ఎమ్‌టి గోధుమలు, 109.94 ఎల్‌ఎమ్‌టి బియ్యం ఉన్నాయి. మొత్తం 19.32 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు వివిధ రాష్ట్రాలు, యుటిలు తీసుకున్నాయి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వంద శాతం సుమారు రూ. 76,062 కోట్లు భరిస్తుంది. 4 రాష్ట్రాలు, యుటిలకు గోధుమలు మాత్రమే కేటాయించారు, 15 రాష్ట్రాలు / యుటిలకు బియ్యం కేటాయించారు. మిగిలిన 17 రాష్ట్రాలు / యుటిలకు బియ్యం, గోధుమలు కేటాయించారు.
పప్పుధాన్యాలు:
పప్పుధాన్యాల విషయానికొస్తే, వచ్చే ఐదు నెలల మొత్తం అవసరం 12 ఎల్‌ఎమ్‌టి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సుమారు రూ .6849 కోట్ల 100% ఆర్థిక భారాన్ని భరిస్తుంది. 15.7.2020 నాటికి మొత్తం 10.38 ఎల్‌ఎమ్‌టి పప్పులు (కందిపప్పు-5.48 ఎల్‌ఎమ్‌టి, పెసర-1.13 ఎల్‌ఎమ్‌టి, మినుము-2.19 ఎల్‌ఎమ్‌టి, శెనగ-1.30 ఎల్‌ఎమ్‌టి, కందులు-0.27 ఎల్‌ఎమ్‌టి) నిల్వలు లభిస్తాయి. పిఎస్‌ఎస్ స్టాక్‌లో సుమారు 22.52 ఎల్‌ఎమ్‌టి శెనగ, పిఎస్‌ఎఫ్ స్టాక్‌లో 1.30 ఎల్‌ఎమ్‌టి శెనగ అందుబాటులో ఉన్నాయి.
వలస కార్మికులకు ఆహారధాన్యాల పంపిణీ (ఆత్మనిర్భర భారత్ ప్యాకేజి)
ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ, రాష్ట్ర ప్రభుత్వ పిడిఎస్ కార్డుల పరిధిలోకి రాని 8 కోట్ల మంది వలస కూలీలు, ఒకే చోట చిక్కుకున్న అవసరమైన కుటుంబాలకు 8 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి వ్యక్తికి 5 కిలోల ఆహార ధాన్యాన్ని మే, జూన్ నెలల్లో ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాలు, యుటిలు 6.39 ఎల్ఎంటి ఆహార ధాన్యాలను తీసుకున్నాయి. రాష్ట్రాలు, యుటిలు 2,43,092 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను (మే నెలలో 2.40 కోట్లు, జూన్ నెలలో 2.47 కోట్లు) లబ్ధిదారులకు పంపిణీ చేశాయి.
1.96 కోట్ల వలస కుటుంబాలకు 39,000 మెట్రిక్ టన్నుల శెనగను భారత ప్రభుత్వం ఆమోదించింది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకం పిడిఎస్ కార్డుల పరిధిలో కానీ రాని 8 కోట్ల మంది వలస కూలీలు, వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న నిరుపేద కుటుంబాలకు మే, జూన్ నెలలకు ఒక కుటుంబానికి 1 కిలో పప్పును ఉచితంగా ఇస్తారు. పప్పు కేటాయింపు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా జరుగుతోంది. సుమారు 33,745 మెట్రిక్ టన్నుల శెనగను రాష్ట్రాలు, యుటిలకు పంపించారు. మొత్తం 33,378 మెట్రిక్ టన్నుల శెనగను వివిధ రాష్ట్రాలు, యుటిలు తీసుకున్నాయి. మొత్తం 11,678 మెట్రిక్ టన్నులను రాష్ట్రాలు, యుటిలు పంపిణీ చేశాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 100% ఆర్థిక భారాన్ని ఆహార ధాన్యానికి సుమారు రూ. 3,109 కోట్లు, పప్పులకు రూ .280 కోట్లు భరిస్తుంది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లబ్ధిదారులకు కేటాయించిన మిగిలిన ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ సమయం 2020 ఆగస్టు 31 వరకు పొడిగించారు.
ఆహార ధాన్యాల సేకరణ:
21.07.2020 నాటికి మొత్తం 389.74 ఎల్‌ఎమ్‌టి గోధుమలు (ఆర్‌ఎంఎస్ 2020-21), 751.10 ఎల్‌ఎమ్‌టి బియ్యం (కెఎంఎస్ 2019-20) సేకరించారు.
ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్:
01 జూన్ 2020 నాటికి, 20 రాష్ట్రాలు / యుటిలలో ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్ పథకం ప్రారంభం అయింది, అవి - ఆంధ్రప్రదేశ్, బీహార్, డామన్ & డయ్యు (దాద్రా మరియు నగర్ హవేలి), గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ , కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, త్రిపుర. 2021 మార్చి 31 నాటికి మిగిలిన రాష్ట్రాలన్నీ ఈ పథకం కిందకు రానున్నాయి, ఈ పథకం భారతదేశం అంతటా పనిచేస్తుంది.
వరుస
సంఖ్య
|
రాష్ట్రం
|
ఈపోస్
%
|
రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానం %
|
పథకంలో చేరే తేదీ అంచనా
|
1
|
Andaman and Nicobar
|
96%
|
98%
|
1st August 2020
|
2
|
Manipur
|
61%
|
83%
|
1st August 2020
|
3
|
Nagaland
|
96%
|
73%
|
1st August 2020
|
4
|
Jammu and Kashmir
|
99%
|
100%
|
Scheme will implement in some districts on 1st August 2020 and in remaining districts from 1st November,2020
|
5
|
Chhattisgarh
|
98%
|
98%
|
31st August 2020
|
6
|
Uttarakhand
|
77%
|
95%
|
1st September 2020
|
7
|
Tamil Nadu
|
100%
|
100%
|
1st October 2020
|
8
|
Ladakh
|
100%
|
91%
|
1st October 2020
|
9
|
Delhi
|
0%
|
100%
|
1st October 2020
|
10
|
Meghalaya
|
0%
|
1%
|
1st December 2020
|
11
|
West Bengal
|
96%
|
80%
|
1st January 2021
|
12
|
Arunachal Pradesh
|
1%
|
57%
|
1st January 2021
|
13
|
Assam
|
0%
|
0%
|
|
14
|
Lakshadweep
|
100%
|
100% (DBT)
|
|
15
|
Puducherry
|
0%
|
100% (DBT)
|
DBT
|
16
|
Chandīgarh
|
0%
|
99%(DBT)
|
DBT
|
****
(Release ID: 1640505)
Visitor Counter : 291