ప్రధాన మంత్రి కార్యాలయం

మణిపుర్ నీటి సరఫరా పరియోజన కు 2020 వ సంవత్సరం జూలై 23వ తేదీ న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

Posted On: 22 JUL 2020 11:34AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మణిపుర్ నీటి సరఫరా పరియోజన కు 2020 వ సంవత్సరం జూలై 23వ తేదీ న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.  మణిపుర్ గవర్నరు, ముఖ్యమంత్రి మరియు ఆయన మంత్రివర్గ సహచరులు, ఎంపీ లు, ఇంకా ఎమ్మెల్యే లు ఇమ్ఫాల్ నుండి ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే అవకాశం ఉంది.  

2024 వ సంవత్సరానికల్లా దేశం లోని ప్రతి గ్రామీణ కుటుంబానికి నాణ్యమైన, సురక్షితమైన త్రాగునీటి ని తగినంత గా సమకూర్చడం కోసం ‘‘ఇంటింటికీ జలం’’ అనే ఆదర్శవాక్యం తో జల్ జీవన్ మిశన్ ను భారత ప్రభుత్వం మొదలుపెట్టింది.  ఈ కార్యక్రమం లో భాగం గా జల వనరుల స్థాయి ని పరిరక్షించే చర్యల ను కూడా అనివార్యం గా అమలుపరచడం జరుగుతుంది.  ఆ చర్యల లో వాన నీటి సంచయం, జల సంరక్షణ, గ్రే వాటర్ మేనిజ్ మెంట్ ద్వారా రీచార్జి మరియు పునర్ వినియోగం వంటి చర్య లు భాగం గా ఉండబోతున్నాయి.

జల్ జీవన్ మిశన్ అనేది జలం పట్ల సాముదాయిక దృష్టికోణం మీద ఆధారపడుతుంది.  దీని లో  సమాచారాన్ని విస్తృతం గా అందించడం, విద్య ఇంకా కమ్యూనికేశన్ అనేవి కీలకమైన అంశాలు గా ఉన్నాయి.  ఇది జలం కోసం జన ఆందోళన తరహా వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దీని ని ప్రతి ఒక్కరి ప్రాథమ్యం గా మార్చదలుస్తున్నది. 

భారతదేశం లో రమారమి 19 కోట్ల కుటుంబాలు ఉన్నాయి.  వాటి లో 24 శాతం కుటుంబాల వద్దే తాజానీటి గృహ‌ కొళాయి కనెక్శన్ (ఎఫ్ హెచ్ టిసి)లు ఉన్నాయి.  స్థానిక సముదాయాలు, పంచాయతీ రాజ్ సంస్థ లు, రాష్ట్ర ప్రభుత్వాలు సహా అన్ని భాగస్వామ్య పక్షాల సహభాగిత్వం ద్వారా   14, 33, 21,049 పరివారాల కు ఎఫ్ హెచ్ టిసిల ను అందించాలన్నది ఈ మిశన్ యొక్క ధ్యేయం గా ఉన్నది.
  
భారత ప్రభుత్వం 1, 42,749 కుటుంబాలు నివసిస్తున్న 1,185 బస్తీల కు ఎఫ్ హెచ్ టిసిల ను అందించడం కోసం మణిపుర్ కు జల్ జీవన్ మిశన్ లో భాగం గా నిధుల ను సమకూర్చింది.  డిపార్ట్ మెంట్ ఫార్ డివెలప్ మెంట్ ఆఫ్ నార్థ్ ఈస్టర్న్ రీజియన్ నుండి స్వీకరించే నిధులు సహా అదనపు వనరుల ద్వారా సైతం నిధుల ను పుచ్చుకొని  మిగతా కుటుంబాల కు కూడా కు ఎఫ్ హెచ్ టిసిల ను ఇవ్వాలని మణిపుర్ ప్రభుత్వం ప్రణాళిక ను సిద్ధం చేసింది. 

మణిపుర్ లోని గ్రేటర్ ఇమ్ఫాల్ ప్లానింగ్ ఏరియా, 25 పట్టణాలు మరియు 1,731 గ్రామీణ బస్తీల లోని మిగతా కుటుంబాల కు ఎఫ్ హెచ్ టిసి ల ను అందుబాటు లోకి తీసుకు వచ్చేటట్టు వెలుపలి నుండి నిధులు అందే ప్రాజెక్టు గా మణిపుర్ జల సరఫరా పరియోజన ను రూప రచన చేయడం జరిగింది.  ఈ విధం గా ఈ  పరియోజన మణిపుర్ లోని 16 జిల్లాల యొక్క 2,80,756 కుటుంబాల కు పూచీపడుతుందన్నమాట.  2024వ సంవత్సరానికల్లా ‘ప్రతి ఇంటి కి నీరు’ లక్ష్యాన్ని సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల లో మణిపుర్ నీటి సరఫరా పరియోజన ఒక ముఖ్యమైన భాగం గా ఉన్నది.  న్యూ డివెలప్ మెంట్ బ్యాంక్ అందిస్తున్నటువంటి రుణాంశం సహా ఈ పరియోజన తాలూకు వ్యయం సుమారు 3,054.58 కోట్ల రూపాయలు గా ఉంది.  

***(Release ID: 1640462) Visitor Counter : 98